ఐ బొమ్మ రవిని మరో పన్నెండు రోజుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం ప్రకటించింది. ఆయనపై దాఖలైన ఐదు కేసుల్లో రెండింటిలో కస్టడీకి తీసుకున్నారు. మరో మూడు కేసుల్లో ఈ పన్నెండు రోజుల కస్టడీకి ఇచ్చారు. ఒక్కో కేసులో విడివిడిగా రోజుల తరబడి ప్రశ్నిస్తారు. ఓ కేసులో నిందితుడ్ని ఇలా రావాలా తరబడి కస్టడీకి తీసుకుని ప్రశ్నించడం చాలా అరుదు. ఐ బొమ్మ రవి కేసులోనే ఇది సాధ్యమవుతోంది. ఇప్పటికి రెండు సార్లు కస్టడీకి తీసుకుని ప్రశ్నించినప్పుడు గుట్టు అంతా బయటపడిందని మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ ఏమీ బయటపడలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
రవిని పట్టుకున్నప్పుడు ఆధారాలేమీ దొరకలేదు!
రవిని హైదరాబాద్ లో పట్టుకున్నప్పుడు పోలీసులకు ఆధారాలేమీ దొరకలేదు. ఆయన ఫోన్ లో ఫుడ్ యాప్స్ తప్ప ఏమీ లేవని పోలీసులే చెబుతున్నారు. అప్ లోడ్ చేసిన పైరసీ వీడియోలు.. టెలిగ్రామ్ నుంచి కొనుగోలు చేశారని కూడా చెప్పారు. అంటే ఆయన పైరసీ చేయలేదు. పైరసీలవి కొని అప్ లోడ్ చేసినట్లుగా ఆధారాలు లేవు. ఈ బేసిక్ మీద చూస్తే ఐ బొమ్మ రవిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవసరమైన సాక్ష్యాలులేవు. వాటిని ఆయనదగ్గర నుంచే సంపాదించాలి. టెక్నికల్ వ్యవహారం అంతా ఆయనకే తెలుసు. దాన్ని రాబట్టడానికే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి.
రవి ఒక్కడే ఎలా చేస్తాడు?
పైరసీ చేయాలంటే ఒక్కడి వల్ల కాదు.ఓ పెద్ద ముఠాఉండాలి. కానీ ఐ బొమ్మ విషయంలో పోలీసులు రవి ఒక్కడి పనే అని డిసైడర్ అయిపోయారు. రవి తనకు ఎవరూ సాయంచేయరని అంతా తానే చేసుకుంటానని చెప్పాడని దానికే ఫిక్సయ్యారు. కానీ ఇది ఎలా సాధ్యమన్న ప్రశ్న కోర్టులో వస్తుంది. ఇప్పటికీ పైరసీ ఆగడం లేదు. ఐ బొమ్మ కాకపోతే ఇంకో బొమ్మ..సైట్లు చాలా ఉన్నాయి. వాటిలో సినిమాలు అప్ లోడ్ అవుతూనే ఉన్నాయి. అంటే వ్యవస్థీకృతమైన ముఠాను ఇప్పటికీ కదిలించలేకపోయారని అనుకోవచ్చు.
అచ్చంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సమస్యే !
ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసి విచారణ చేసినప్పుడు చాలా మందిని అరెస్టు చేశారు. వారిలో కొంత మంది ఇచ్చిన వాంగ్మూలాలు తప్ప.. ఆధారాలు లేవు. ఏమైనాఅంటే ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్ రావు ధ్వంసం చేశారని అంటున్నారు. ఎంత ధ్వంసం చేసినా టెక్నికల్ గా ఆరోపణలు నిరూపించగలిగేలా కొన్ని ఆధారాలు ఉండాలి. అవేమీ లేకపోవడం వల్ల ఏ వన్ ప్రభాకర్ రావు ఒక్క రోజు కూడాజైలుకు వెళ్లకుండా టైంపాస్ చేస్తున్నారు. ఆయన కూడా తన డేటా మొత్తం ఏరేస్ చేసుకుని చేతనైంది చేసుకోండి అని సవాల్ విసురుతున్నారు. కాని పోలీసులుఈ కేసులో కంక్లూడింగ్ కు రాలేకపోతున్నారు.
