చంద్రబాబు చెబితే మద్యం విక్రయిస్తారట..!

ఏపీలో మద్యం అమ్మాలంటే ఎవరి పర్మిషన్ కావాలి..?. మంత్రులకు సొంత నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు కాబట్టి… ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం జరగాలి. సలహాదారులో.. మరొకరో దీనిపై రీసెర్చ్ చేసి.. జగన్ కు సమర్పిస్తే.. ఆమోద ముద్ర వేయడమో.. తిరస్కరించడమో చేస్తారు. అంతిమంగా ముఖ్యమంత్రి పర్మిషన్ ఇస్తే.. ఏపీలో లాక్ డౌన్ ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు చేస్తారు. కానీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి మాత్రం.. చంద్రబాబు చెబితే.. మద్యం విక్రయించడానికి సిద్ధమని ప్రకటించేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు కానీ.. ఇలా చంద్రబాబు చెప్పాలనే షరతును ఎందుకు పెడుతుందో అనేది క్లిష్టమైన కాన్సెప్టే.

లాక్ డౌన్ సమయంలో.. మద్యం విక్రయాలు లేకపోవడంతో మందుబాబులు.. ఇబ్బందులు పడుతున్నామని.. మానసికంగా దెబ్బతింటున్నారని కథనాలు వస్తున్నాయి. వీరి కోసమైనా.. పరిమితంగా మద్యం అమ్మాలని ఏపీ సర్కార్ కు సూచనలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి వెసులుబాటు కల్పించారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ పైనో.. మరో విధంగానో.. బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో.. మద్యం అమ్ముతున్నారు. ఏపీ సర్కార్ కూడా.. అలాగే చేయాలని.. ఒత్తిడి వస్తోంది. ఇదేదో మంచి ఆలోచనే అన్నట్లుగా ఉన్న ప్రభుత్వం… చంద్రబాబు ఎక్కడ విమర్శలు చేస్తారోననని ఆగిపోతున్నట్లుగా ఉంది. ఆయన కూడా చెబితే.. మద్యం అమ్ముతామంటూ.. బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. అసలు ఏపీ సర్కార్… ప్రతిపక్షాల్ని.. ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం ఎప్పుడో మానేసింది కదా.. ఈ ఒక్క విషయంలో చంద్రబాబు ఆమోదం ఎందుకన్న సందేహం ఇతరులకు సహజంగానే వస్తోంది.

కొద్ది రోజులుగా.. మంత్రులు చంద్రబాబుపై ఒకటే విమర్శ చేస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి విమర్శలు చేస్తున్నారనేది ఆ విమర్శ. దానికి టీడీపీ నేతలు… మీకు చేత కావడం లేదని.. ఏపీకి వచ్చి చంద్రబాబు పని చేయాలని కోరుకుంటున్నారా అని కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమలో ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి. .. చంద్రబాబు చెబితే తాము మద్యం అమ్ముతామంటూ.. చేసిన ప్రకటన పార్టీకి మరింత డ్యామేజీ కల్పించేలా ఉందని నేతలు మథనపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close