కొత్తపలుకు: కేసిఆర్ .. మీరు గుడ్లు ఉరిమితే ఇక్కడెవరూ భయపడరు !: ఆర్కే

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సై అంటే సై అని తేల్చుకోవడానికి తాను సిద్ధమని.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రకటించారు. ప్రతీ వారాంతం “కొత్తపలుకు” పేరుతో తాను రాసే ఆర్టికల్‌లో.. తనకు “కరోనా” రావాలంటూ.. కేసీఆర్ పెట్టిన శాపంపై… “తీవ్రంగా శిక్షిస్తానంటూ” చేసిన హెచ్చరికలపై ఆర్కే ఓ రేంజ్‌లో ఫైరయిపోయారు. కేసీఆర్ గురించి తాను.. మొదటి నుంచి తెలుసని.. తాను అనుకుంటే.. మొత్తం చరిత్ర బయటపెట్టగలనన్నట్లుగా.. పరోక్షంగా ఆయన తన ఆర్టికల్‌లో కేసీఆర్‌ను చాలెంజ్ చేశారు. కేసీఆర్ కేసులు మాత్రమే పెట్టించగలరని.. తప్పొప్పులు నిర్ధారించేది కోర్టులేనని గుర్తుంచుకోవాలన్నారు. చేతయినంది చేసుకోండి.. తాము ప్రజా సమస్యలను ప్రచురిస్తూనే ఉంటామని సవాల్ చేసేశారు.

కేసీఆర్ వ్యవహారశైలిపై ఆర్కే ఒక్క సారిగా ఇంత తీవ్ర స్థాయిలో ఫైర్ కావడావికి కారణం ఏమిటోకానీ.. తాను నేరుగా సీఎంతో ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకునేందుకు ఆర్కే ఏ మాత్రం మొహమాటపడలేదు. ప్రస్తుతం తెలంగాణలో మీడియా అంతా.. కేసీఆర్‌కు ప్రో గా మారిపోయింది. ఈ తరుణంలో యాంటీ కేసీఆర్‌గా అవతారం ఎత్తితే.. పత్రిక పరంగా పునాదులు బలపడతాయనే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ .. మీడియా సమావేశంలో చేసిన హెచ్చరికలనే.. ఆర్కే.. ఓ అవకాశంగామల్చుకుని.. తన పత్రికను… ప్రజల గొంతుగా చిత్రీకరింప చేసుకుని.. సామాన్యుల కోసం పోరాడే పత్రికగా..మల్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది.

నిజానికి కేసీఆర్‌ మనస్థత్వం ఎలాంటిదో ఆర్కేకు ఐదు దశాబ్దాలుగా తెలుసు. దినపత్రికలు మాత్రమే మీడియా అయిన కాలంలో ఎమ్మెల్యే అయిన కేసీఆర్.. పత్రికల ప్రతినిధులతో సన్నిహితంగా ఉండేవారు. ఆంధ్రజ్యోతి ఆర్కేతో ఆయనకు ” అరేయ్.. ఒరేయ్ ” అని పిలుచుకునేంత సాన్నిహిత్యం ఉందని మీడియా సర్కిల్స్ లో చెప్పుకుంటూ ఉంటారు. అయినప్పటికీ.. ఇటీవలి కాలంలో.. ఆంధ్రజ్యోతిపై కేసీఆర్ గుస్సా అవడం ఎక్కువయింది. అదే సమయంలో.. ఆర్కే కూడా.. తాను కూడా రెడీ అంటున్నారు. మీడియా – ప్రభుత్వాల పోరాటంలో.. తెలంగాణలో కొత్త ఎపిసోడ్ ప్రారంభమవుతుందన్నట్లుగా ఆర్కే ఈ వారం స్పందన ఉంది. మరి.. ఇద్దరు మిత్రులు ఈ వివాదాన్ని చెరో మాటతో వదిలేస్తారా లేదంటే… కేసీఆర్ చెప్పినట్లు.. అత్యంత కఠిన శిక్షలు వేస్తారా..? దానికి ఆర్కే న్యాయపోరాటం చేస్తారా..? అన్నది తర్వాతి భాగంలో చూడాలి.

మొత్తంగా.. ఈ వారం కొత్తపలుకులో కేసీఆర్ ను టార్గెట్ చేసినా.. ఏపీ సీఎం జగన్ ను కూడా వదిలి పెట్టలేదు. ఆయనను మానసికంగా విపరీత లక్షణాలున్న వ్యక్తిగా చెప్పేశారు. జరుగుతున్న పరిణామాలన్నింటినీ విశ్లేషించాలి.. ఆంధ్రప్రదేశ్‌ను ఆ దేవుడే కాపాడాలని విస్తుపోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదని తేల్చేశారు. అధికారం కట్టబెట్టిన ప్రజలే దాని పర్యవసానాలను కూడా అనుభవించాలన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close