ద‌ర్శ‌కుల‌కు, ర‌చ‌యిత‌ల‌కు బోల్డంత ప‌ని

లాక్ డౌన్ స‌మ‌యాన్ని క్యాష్ చేసుకున్న‌ది ఓటీటీ వేదిక‌లే.. అంటూ రామ్ గోపాల్ వ‌ర్మ ఓ జోక్ పేల్చాడు ట్విట్ట‌ర్‌లో. నిజానికి అది జోక్ కాదు. వాస్త‌వం. లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ కాసులు కురిపించుకుంటున్నాయి ఓటీటీ వేదిక‌లే. అవి లేక‌పోతే.. సామాన్య జ‌నం ఏమైపోదురో. వారం వారం ఓ కొత్త సినిమా చూడాల‌నుకునే ప్రేక్ష‌కుడికి టైమ్ పాస్ లేక పిచ్చెక్కిపోయేవాడు. అవ‌స‌రాన్ని, డిమాండ్‌నీ గ‌మ‌నించిన ఓటీటీ సంస్థ‌లు కావ‌ల్సినంత సంఖ్య‌లో సినిమాల్నీ, వెబ్ సిరీస్‌ల‌నూ అప్ లోడ్ చేసి థియేట‌ర్లు లేని లోటు తీరుస్తున్నాయి.

లాక్ డౌన్ ఎత్తేసిన వెంట‌నే – ఎవ‌రికి ప‌ని దొరికినా దొర‌క్క‌పోయినా ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కుల‌కు ఓటీటీ వేదిక‌లు బోలెడంత ప‌ని క‌ల్పించ‌డం ఖాయం. ఎందుకంటే ఇప్ప‌టికే వాళ్ల చేతుల్లో ఉన్న వెబ్ సిరీస్‌లు అయిపోయాయి. దాదాపుగా అన్నింటినీ అప్ లోడ్ చేసేశారు. ఇప్పుడు వాళ్ల‌కు కొత్త కంటెంట్ అవ‌స‌రం. ఒక‌ట్రెండు నెల‌ల్లో వీలైనంత కంటెంట్ ని ఓటీటీలో చూపించుకోవాలి. లేదంటే కొత్త క‌ష్ట‌మ‌ర్ల‌ని ప‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం. షూటింగుల‌కు అనుమ‌తి వ‌చ్చాక‌… సినిమా వాళ్లు రెడీ అవుతారో లేదో గానీ, ఓటీటీ సంస్థ‌లు మాత్రం లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా అని ఆశ‌గా ఎదురు చూస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తేసిన వెంట‌నే షూటింగులు మొద‌లెట్టుకోవ‌డానికి స్క్రిప్టులు రెడీ చేసుకుంటున్నాయి. ఇది వ‌ర‌కు హోల్డ్ లో పెట్టుకున్న కొన్ని స్క్రిప్టులు ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్ల‌బోతున్నాయి. ఆహా, జీ 5, అమేజాన్, హాట్ స్టార్ లాంటి సంస్థ‌లు ఇప్పుడు కొత్త ద‌ర్శ‌కుల‌కు కాంటాక్ట్ లోకి వెళ్తున్నాయి. స్క్రిప్టులు రెడీ చేసుకోమ‌ని ప్లానింగులు ఇస్తున్నాయి.

ఇది నిజంగా ద‌ర్శ‌కులకు, ర‌చ‌యిత‌ల‌కు సువ‌ర్ణావ‌కాశం అనే చెప్పాలి. ఇప్పుడు ఓటీటీకి కంటెంట్ కావాలి. దానికి కావ‌ల్సిన బ‌డ్జెట్లు, స్టార్ కాస్టింగ్ ఇవ్వ‌డానికి ఓటీటీ సంస్థ‌లు రెడీగా ఉన్నాయి. తెలుగులో ఒక‌ట్రెండు సినిమాలు చేసి, ఇప్పుడు ఖాళీగా ఉన్న‌ద‌ర్శ‌కులంద‌రినీ ఆమేజాన్‌, హాట్ స్టార్‌, ఆహా లాంటి సంస్థ‌లు ద‌గ్గ‌ర‌కి చేరుస్తున్నాయి. వాళ్ల‌తో అతి వేగంగా వెబ్ సిరీస్‌ల‌ను రూపొందించ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇది వ‌ర‌కు రిజెక్ట్ చేసిన క‌థ‌ల్ని కూడా ఇప్పుడు ఓకే అనుకుంటున్నారంటే… ఓటీటీలో కంటెంట్ డిమాండ్ ఎంత ఉందో అర్థం చేసుకోవొచ్చు. అందుకే న‌వ‌తరం ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు సినిమాల‌కంటే వెబ్ సిరీస్‌ల‌పై దృష్టి పెట్ట‌డం మేలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close