ఇళ‌య‌రాజా వివాదం ముదురుతోంది

ఎందుకో… ఇళ‌య‌రాజా అప్పుడ‌ప్పుడూ వివాదాల్లో ఇరుక్కుంటుంటారు. అందులో ఆర్థిక ప‌రమైన‌వే ఎక్కువ‌. అప్ప‌ట్లో త‌న ఆప్తుడు, స‌న్నిహితుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంపై `రాయ‌ల్టీ` విష‌యంలో గొడ‌వ ప‌డ్డారు. ఆ వివాదం మెల్ల‌మెల్ల‌గా స‌ద్దుమ‌ణిగింది. ఇప్పుడు ఎల్వీ ప్ర‌సాద్ స్టూడియో విష‌యంలోనూ ఇలానే కోర్టు, పోలీసు స్టేష‌ను చుట్టూ తిరుగుతున్నాయి.

చెన్నైలోని ఎల్వీ ప్ర‌సాద్ స్టూడియోలో.. ఇళ‌య‌రాజాకు రికార్డింగ్ థియేట‌ర్ ఉంది. అయితే అది ఆయ‌న‌ది కాదు. స్టూడియోదే. అప్ప‌ట్లో ఎల్వీ ప్ర‌సాద్‌.. ఇళ‌య‌రాజాపై గౌర‌వంతో.. `ఈ స్టూడియో మీరు వాడుకోండి` అన్నారు. న‌ల‌భై ఏళ్లుగా ఇళ‌య‌రాజా అందులోనే కంపోజింగ్ చేస్తున్నారు. ఆ స్టూడియో ఇళ‌య‌రాజా ఆఫీసు, అడ్డాల మారింది. ఇప్పుడు ఎన్వీ ప్ర‌సాద్ మ‌న‌వ‌డు సాయి ప్ర‌సాద్ తో ఇళ‌య‌రాజా గొడ‌వ మొద‌లైంది. ఈ స్టూడియోని ఖాళీ చేయాల‌ని.. ఇళ‌య‌రాజాకు ఆయ‌న నోటీసులు జారీ చేశారు. ఇక్క‌డే ఇళ‌య‌రాజా గొడ‌వ‌కు దిగారు. `ఈ రికార్డింగ్ థియేట‌ర్ నాది… ఖాళీ చేసే ప్ర‌స‌క్తి లేదు` అంటూ.. కోర్టుకెళ్లారు.

నిజానికి ఈ స్టూడియోపై ఇళ‌య‌రాజాకు ఎలాంటి అధికారం లేదు. రికార్డింగ్ థియేట‌ర్ సైతం.. ఎన్వీ ప్ర‌సాద్ వార‌సుల పేరుపైనే ఉంది. దాన్ని ఇళ‌య‌రాజా కేవ‌లం వాడుకుంటున్నారంతే. న‌ల‌భై ఏళ్లుగా ఆయ‌న ఈ స్టూడియోకి ఎలాంటి రుసుమూ చెల్లించ‌డం లేద‌ని తెలుస్తోంది. కేవ‌లం ఇళ‌య‌రాజాపై గౌర‌వంతో.. అభిమానంతో.. రికార్డింగ్ స్టూడియో ఇస్తే.. ఇప్పుడు దాన్ని ఖాళీ చేసేది లేదంటూ ఇళ‌య‌రాజా గొడ‌వ ప‌డుతున్నారు. కోర్టులో కేసు వేశారు. ఎటు చూసినా ఈ కేసు నిల‌బ‌డ‌దు. ఇళ‌య‌రాజా ఖాళీ చేయాల్సిందే. కానీ… ఇళ‌య‌రాజా మాత్రం మొండి ప‌ట్టుద‌ల‌కు పోతున్నారు. త‌న‌పై ఎల్వీ ప్ర‌సాద్ వార‌సులు దాడి చేశార‌ని, బ‌ల‌వంతంగా స్టూడియోని ఖాళీ చేయిస్తున్నార‌ని, స్టూడియోలోని సామాగ్రిని సైతం ధ్వంసం చేస్తున్నార‌ని ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

స్టూడియోపై ఇళ‌య‌రాజాకు ఎలాంటి హ‌క్కూ లేద‌ని, ఆయ‌న గౌర‌వంగా ఖాళీ చేస్తే హుందాగా ఉండేద‌ని, ఇప్పుడు అన‌వ‌స‌రంగా ఈ కేసు కోర్టు వ‌ర‌కూ వెళ్లింద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఈ గొడ‌వ ఎప్పుడు స‌ద్దుమ‌ణుగుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పంపుసెట్లకు మీటర్లను జగన్ ఎందుకు పెడుతున్నారో చెప్పిన హరీష్ రావు..!

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడుతున్న వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.. ఒక వేళ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభమైతే..రైతులు...

ప్రాయశ్చిత్త హోమాలు చేయాలని ఏపీ సర్కార్‌కు ఆస్థాన స్వామిజీ సలహా..!

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు..హిందూత్వంపై వైసీపీ నేతల అరాచక వ్యాఖ్యలకు పరిహారంగా.. ప్రాయశ్చిత్త హోమాలు చేపట్టాలని వైఎస్ జగన్ .. వైసీపీ నేతల ఆస్థాన స్వామిజీ స్వరూపానంద సరస్వతి సూచించారు. వరుస...

రైతులకు ఆ బిల్లులు ఉపయోగపడితే సంబరాలు ఎందుకు చేసుకోరు ?: కేటీఆర్

బిల్లులు ఎలా ఆమోదించుకోవాలో.. ఎలా ప్రజామోదం సంపాదించాలో.. తెలంగాణను చూసి నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు. కేంద్రం వివాదాస్పదంగా ఆమోదించిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేటీఆర్ స్పందన.. అంతే...

ఏపీలో యాప్‌ ద్వారా పోలీస్ సేవలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లకుండా ఫిర్యాదు చేసుకునే ఓ కొత్త వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రత్యేకంగా యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఏపీ పోలీస్‌ సర్వీస్‌ యాప్‌ను...

HOT NEWS

[X] Close
[X] Close