అల్లు రియాక్ఠ్ అవుతాడా? లేదా?

రాంగోపాల్ వ‌ర్మ బాణం ఇప్పుడు `అల్లు` వైపుకు తిరిగింది. అల్లు పేరుతో ఓ సినిమా తీస్తున్నాన‌ని వ‌ర్మ ప్ర‌క‌టించేశాడు. అందులో ఏం చెప్ప‌బోతున్నాడో చూచాయిగా వివ‌రించాడు. చిరు వెనుక‌, ఆ కుటుంబం వెనుక‌, ప్ర‌జారాజ్యం పార్టీ వెనుక‌, టోట‌ల్ గా సినిమా పరిశ్ర‌మ వెనుక‌.. అల్లు పాత్రేమిట‌న్న‌ది ప్ర‌త్యేకంగా గుర్తు చేయాల్సిన అవ‌స‌రం లేదు. త‌న మాస్ట‌ర్ మైండ్ ఏపాటిదో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే అల్లు ఖ్యాతి ఎలాగున్నా- ఆయ‌న‌పై చాలా విమ‌ర్శ‌లున్నాయి. వ‌ర్మ వాటినే ఫోక‌స్ చేస్తాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌ర్మ ఎన్ని వేషాలేసినా మెగా కుటుంబం కామ్ గానే ఉంది. `ప‌వ‌ర్ స్టార్‌` సినిమా విష‌యంలోనూ అస‌లేమాత్రం స్పందంచ‌లేదు. త‌న అన్న‌ద‌మ్ముల్ని ఎవ‌రైనా ఏమైనా అంటే విరుచుకుప‌డిపోయే నాగ‌బాబు సైతం వ్యూహాత్మ‌కంగానే సైలెంట్ అయిపోయాడు. అయితే అల్లు అర‌వింద్ అలా కాదు. త‌ను ఊరికే ఉండే ర‌కం కాదు. వ‌ర్మ‌ని బ్యాన్ చేయాల‌న్న వాద‌న మొట్ట‌మొద‌ట తీసుకొచ్చింది అల్లునే. త‌న‌పైనే సినిమా తీస్తుంటే కామ్ గా ఎందుకు ఉంటాడు? ఏదో ఓ రియాక్ష‌న్ త‌ప్ప‌కుండా ఉంటుంది.

కాక‌పోతే.. వ‌ర్మ‌ని ఇప్పుడు కెలికితే… అది త‌న‌కే ప్ల‌స్ అవుతుంద‌న్న‌ది అల్లు కాంపౌండ్ భ‌యం. ఇప్పుడు అల్లు వ‌ర్గం ఏమ‌న్నా అది `అల్లు` సినిమా ప్ర‌చారంలో వాడేసుకుంటాడు వ‌ర్మ‌. `ప‌వ‌ర్ స్టార్‌` విష‌యంలో.. ఇదే జ‌రిగింది. అప్ప‌టి వ‌ర‌కూ లేని హైప్ లేని ఆ సినిమా వ‌ర్మ ఆఫీసుపై ప‌వ‌న్ అభిమానులు దాడి చేయ‌డంతో.. ప‌వ‌ర్ స్టార్‌కి ఇంకొన్ని ఎక్కువ టికెట్లు తెగాయి. ఇప్పుడు అల్లు స్పందించినా అదే తంతు. అందుకే.. `అల్లు` సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చేంత వ‌ర‌కూ కామ్ గా ఉండాల‌ని అల్లు కాంపౌండ్ భావిస్తోంది. ఆ సినిమా వ‌చ్చాక‌.. దాన్ని అడ్డు పెట్టుకుని, వ‌ర్మ‌ని టార్గెట్ చేయాల‌ని భావిస్తున్నారు.

వ‌ర్మ‌ని తెలుగు ఇండ్ర‌స్ట్రీ నుంచి బ్యాన్ చేయాల‌న్న వాద‌న‌ని మెగా ఫ్యామిలీ ఇప్పుడు మ‌రోసారి బ‌య‌ట‌కు తీసుకుని రావొచ్చు. కానీ దాని వ‌ల్ల‌.. ఉప‌యోగం ఏమీ లేదు. ఎందుకంటే వ‌ర్మ‌కి థియేట‌ర్లు అవ‌స‌రం లేదు. ఆర్టిస్టులు అవ‌స‌రం లేదు. ఇంకా చెప్పాలంటే ఇండ్ర‌స్ట్రీనే అవ‌స‌రం లేదు. తాను ఎక్క‌డున్నా సినిమాలు తీసి వ‌ద‌ల‌గ‌ల‌డు. అందుకే ఆ పాయింట్ ని ప‌క్క‌న పెట్టి.. అల్లు కొత్త‌గా ఏమైనా ఆలోచిస్తే మంచిది. లేదంటే… వ‌ర్మ‌కి మ‌రింత బ‌లాన్ని ఇచ్చిన‌వాళ్ల‌వుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమిత్‌ షాతో భేటీ కోసం ఢిల్లీకి జగన్..!

ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన పర్యటన హఠాత్తుగా ఖరారయింది. చాలా రోజుల నుంచి ఆయన కేంద్రమంత్రుల్ని కలవాలని అనుకుంటున్నారు. గతంలో రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెళ్లిన తర్వాత...

పంపుసెట్లకు మీటర్లను జగన్ ఎందుకు పెడుతున్నారో చెప్పిన హరీష్ రావు..!

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడుతున్న వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.. ఒక వేళ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభమైతే..రైతులు...

ప్రాయశ్చిత్త హోమాలు చేయాలని ఏపీ సర్కార్‌కు ఆస్థాన స్వామిజీ సలహా..!

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు..హిందూత్వంపై వైసీపీ నేతల అరాచక వ్యాఖ్యలకు పరిహారంగా.. ప్రాయశ్చిత్త హోమాలు చేపట్టాలని వైఎస్ జగన్ .. వైసీపీ నేతల ఆస్థాన స్వామిజీ స్వరూపానంద సరస్వతి సూచించారు. వరుస...

రైతులకు ఆ బిల్లులు ఉపయోగపడితే సంబరాలు ఎందుకు చేసుకోరు ?: కేటీఆర్

బిల్లులు ఎలా ఆమోదించుకోవాలో.. ఎలా ప్రజామోదం సంపాదించాలో.. తెలంగాణను చూసి నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు. కేంద్రం వివాదాస్పదంగా ఆమోదించిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేటీఆర్ స్పందన.. అంతే...

HOT NEWS

[X] Close
[X] Close