తెలుగు సినిమాలను పైరసీ చేసే ఐ బొమ్మ వెబ్సైట్ను నిర్వహకుడు ఇమ్మడి రవి ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న రవిని శనివారం ఉదయం కూకట్పల్లిలో పోలీసులకు చిక్కాడు. అతని ఖాతాల్లో ఉన్న సుమారు రూ. 3 కోట్ల డబ్బును పోలీసులు ఫ్రీజ్ చేశారు.
ఐబొమ్మ పెద్ద ఎత్తున పైరసీకి పాల్పడుతోంది. ఈ సైట్ ద్వారా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు, టీవీ షోలు తక్షణమే అక్రమంగా అప్లోడ్ చేసి, లక్షలాది మంది వీక్షకులకు ఉచితంగా అందిస్తూ వచ్చారు. తెలుగు ఫిల్మ్ యూనిట్లు, ప్రొడ్యూసర్లకు ఇది భారీ నష్టాన్ని కలిగిస్తోంది. థియేటర్ రిలీజ్ల తర్వాత కేవలం కొన్ని గంటల్లోనే సినిమాలు ఆన్లైన్లో వస్తున్నారు. ఈ సమస్యపై తెలుగు ఫిల్మ్ యాంటీ-పైరసీ టీమ్ గతంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఐతే అప్పట్లో పోలీసులకే చాలెంజ్ చేశారు. తమను పట్టుకోవాలని సవాల్ చేశారు. పైగా తాము ప్రేక్షకులకు మంచి చేస్తున్నామని వాదించారు. ఇమ్మడి రవి కేరిబియన్ ద్వీపంలో నివసిస్తూ iBomma వెబ్సైట్ను నిర్వహిస్తున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగా, వారు రవి ఫ్రాన్స్ ట్రిప్లో ఉన్న సమయంలో ట్రాక్ చేశారు. ఇండియాకు రాగానే అరెస్టు చేశారు. అయితే ఐ బొమ్మను ఒక్కడే నిర్వహించడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. ఇంకా చాలా మంది ఉంటారని అనుకున్నారు. ఇమ్మడి రవి నుంచి సమాచారం రాబట్టి మొత్తం నెట్ వర్క్ ను ఛేదించే అవకాశం ఉంది.

