త‌మ‌న్నా త‌ప్పుకోవ‌డ‌మే రాజుగారిని దెబ్బ‌తీసిందా?

`రాజుగారి గ‌ది 3`కి బాగా నెగిటీవ్ టాక్ స్పైడ్ అయ్యింది. ఈ సినిమాలో అటు భ‌య‌మూ, ఇటు వినోద‌మూ రెండూ లేవ‌ని విమ‌ర్శ‌కులు తేల్చేశారు. ఓపెనింగ్స్ కూడా చాలా డ‌ల్‌గా ఉన్నాయి. ఓ రీమేక్ క‌థ‌ని ఎంచుకుంటూ.. సినిమాని ఇంత డ‌ల్ నోట్‌లో ఎందుకు తీశాడ‌న్న చ‌ర్చ మొద‌లైంది. నిజానికి ఓంకార్ బ‌ల‌మైన క‌థే రాసుకున్నాడు.కాక‌పోతే… త‌మ‌న్నా త‌ప్పుకోవ‌డంతో క‌థ‌పై ఎఫెక్ట్ ప‌డిపోయింది.

రాజు గారి గ‌ది 3 లేడీ ఓరియెంటెడ్ క‌థ‌. త‌మ‌న్నా ని దృష్టిలో ఉంచుకుని క‌థ రెడీ చేశాడు. కానీ త‌మ‌న్నా స‌డ‌న్‌గా త‌ప్పుకుంది. ఆ క‌థ కాజ‌ల్‌,తాప్సి వ‌ర‌కూ వెళ్లింది. కానీ.. వాళ్లూచివ‌రి నిమిషంలో హ్యాండ్ ఇచ్చేశారు. అలాంట‌ప్పుడు మ‌రో స్టార్ హీరోయిన్‌ని వెదికి ప‌ట్టుకుని ఈ సినిమా చేయాల్సింది.కానీ… ఓంకార్ త‌న త‌మ్ముడి కోసం ఆలోచించాడు. త‌మ‌న్నా త‌ప్పుకోవ‌డంతో, ఈ క‌థ‌ని త‌న త‌మ్ముడికి అనుకూలంగా రాసుకోవ‌డం మొద‌లెట్టాడు. త‌మ్ముడ్ని హీరోగా ఎలివేట్ చేయ‌డానికి సీన్ల‌న్నీ త‌న‌వైపుకు షిఫ్ట్ చేశాడు. క‌థ‌లో అర్థాంత‌రంగా వ‌చ్చిన మార్పుల వ‌ల్ల స్క్రిప్టు గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది. త‌మ‌న్నా వెళ్లిపోవ‌డంతో.. త‌మ‌న్నా కోసం రాసుకున్న స‌న్నివేశాలు పూర్తిగా ప‌క్క‌న పెట్టి, అప్ప‌టి క‌ప్పుడు అశ్విన్ కి అనుకూలంగా స‌న్నివేశాల్ని వండుకున్నారు. ఆ వంట‌కం కుద‌ర్లేదు. దాంతో… క‌థ పూర్తిగా ట్రాక్ త‌ప్పేసింది. త‌మ‌న్నా ఎప్పుడైతే నో చెప్పిందో, అప్పుడు ఈ ప్రాజెక్టు ఆపేయాల్సింది. లేదంటే.. త‌మ‌న్నా స్టార్ డ‌మ్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్న మ‌రో క‌థానాయిక‌తో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సింది. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఆ ప్ర‌భావ‌మే ఇప్పుడు రిజల్ట్ పై ప‌డింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com