నితిన్ – చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. భవ్య ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకి తగిన టైటిల్ పెట్టడం కోసం చిత్రబృందం తర్జన భర్జనలు పడుతోంది. ఇటీవల ‘చదరంగం’ అనే టైటిల్ ఒకటి బయటకు వచ్చింది. అయితే ఈ టైటిల్ మరీ పాత వాసన కొడుతోందని నితిన్ భావిస్తున్నాడట. ట్రెండీగా ఉండే టైటిల్ పెట్టమని దర్శకుడ్ని సూచించాడట. ‘ఏ 1’ అనే మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. ‘చదరంగం’ కంటే ‘ఏ 1’ కాస్త బెటర్ అనుకోవచ్చు. కానీ నితిన్ కి ఈ టైటిల్ కూడా నచ్చలేదని తెలుస్తోంది. ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వెళ్లే కథ ఇది. మైండ్ గేమ్ నేపథ్యంలో నడుస్తుంది. అందుకే ‘చదరంగం’ అయితే బాగుంటుందని చందూ అనుకుంటున్నాడట. నితిన్ ఫ్లాప్ సినిమా ‘లై’ కూడా ఎత్తుకు పై ఎత్తుల కాన్సెప్టే. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.