విష్ణు నేరం – ప్రభుత్వ పాపం విజయవాడ ఘోరానికి ఇదే మూలం

వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఎక్సయిజ్‌ ఆదాయ లక్ష్యం అంతకంతకూ పెంచడమంటే ప్రజలకు మరింత తాగబోయించడం కాదా? తాగుబోతుల కుటుంబాలు, ముఖ్యంగా మహిళల చేత కన్నీళ్లు పెట్టించి వారి సాధికారత గురించి మాట్లాడటం నీచాతినీచం కాదా? ఏకష్టమైనా పరామర్శలతో ప్రజల్ని ముంచేసే ప్రభుత్వాధినేతలు లిక్కర్ మృతుల కుటుంబాలవైపు చూడకపోవడం మొహం చెల్లక కాదా?

కేవలం ఎక్సయిజ్‌ డ్యూటీని మాత్రమే మద్యం రాబడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కచూపిస్తోంది. ఆ లెక్కన సంవత్సరానికి 4,680 కోట్ల రూపాయలే లిక్కర్ ఆదాయం. ఎక్సయిజ్‌ సుంకంతో పాటు దుకాణాల లైసెన్స్‌ ఫీజు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ట్రేడ్‌ మార్జిన్‌, వ్యాట్‌ కలిపితేనే మద్యం ఆదాయం లెక్క తేలేది. మద్యం సంబంధిత ఆదాయాలన్నిటినీ వేర్వేరు పద్దుల్లో చూపించి ఇది లిక్కర్ అమ్ముకునునే ప్రభుత్వంకాదని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది ఈ రాబడుల మొత్తం రూ.11,500 కోట్లు. ఈ ఏడాది రూ.15 వేల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించుకుంది. మొదటి ఆర్నెల్లలో ఎక్సైజ్‌ ఆదాయం పది శాతం పెరిగింది.

ఈ ఆదాయం ఇంకా పెంచుకునే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తగా స్టార్‌ హోటళ్లలో, నగరాల్లో, మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో ఉదారంగా బార్‌ లైసెన్సులు ఇవ్వబోతున్నారు.ఇప్పటికే వైన్‌ షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్‌ రూంలకు ఇవి అదనం. పది శాతం ప్రభుత్వ వైన్‌ దుకాణాలుండాన్న నిబంధనను ఎత్తేసేశారు.

ఎక్సయిజ్ శాఖను ఆదాయ వనరుగా ప్రభుత్వాలు చూసినంతకాలం విజయవాడలో మాదిరిగా ఘోరాలు ఆగవు. ప్రభుత్వం నడవాలన్నా, సంక్షేమ పథకాలు కావాలన్నా లిక్కర్‌ ఆదాయం తప్పనిసరి అని ప్రభుత్వాలు సిగ్గులేకుండా చెప్పుకొనే కాలం ఇది.

లిక్కర్‌ విషయంలో ఎప్పుడూ అధికార, ప్రధాన ప్రతిపక్షాలు తోడు దొంగలే. కాంగ్రెస్‌ సర్కారులో సిండికేట్లపై ఎసిబి విచారణే అందుకు ఉదాహరణ. రాజకీయ నాయకులు ఒక్కరిపైనా కేసుల్లేవు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల కనుసన్నల్లో లిక్కర్‌ షాపులు నడుస్తున్నాయని ఆ వ్యవహారాలు గమనించే ప్రతీ ఒక్కరికీ తెలుసు. విజయవాడ బార్‌ కాంగ్రెస్‌ నేతది కాబట్టి బార్లకు కొత్తగా లైసెన్సులిస్తున్నందున ప్రత్యర్ధులు కుట్ర చేశారనే ఆరోపణలూ వస్తున్నాయి.

కల్తీ మద్యవల్ల ఐదుగురి మృతికి కారణమైన విజయవాడలోని స్వర్ణ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, ఎం హోటల్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు కుటుంబసభ్యుల నిర్వహణలో ఉంది. 15 సంవత్సరాల నుండి వీరు మద్యం వ్యాపారంలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో నాలుగో నిందితురాలిగా పేర్కొన్న మల్లాది బాల త్రిపురసుందరి స్వయంగా మల్లాది విష్ణుకు తల్లి. భాగవతుల శరత్‌చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కె.ఎ.లక్ష్మీసరస్వతి, విష్ణుకు అతి దగ్గర బంధువులు. లైసెన్సు రిజిస్ట్రేషన్లో ఎక్సైజ్‌శాఖ వద్ద ఈ పేర్లు నమోదు చేసి ఉండటంతో పోలీసులు వారందరిపై కేసు నమోదు చేశారు. అయితే విష్ణు మాత్రం బార్‌తో తనకు ఎటువంటి సంబంధమూ లేదని చెబుతున్నారు. సంఘటన జరిగిన తరువాత సాయంత్రం వరకూ వారంతా నగరంలోనే ఉన్నారు. విష్ణు మీడియాతోనూ మాట్లాడారు. అయినా పోలీసులు వారిని అదుపులోకి తీసుకోలేదు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో వారు పరారయ్యారని మీడియాకు సమాచారమిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

తేజా స‌జ్జా… క‌రెక్టు రూటులో!

'హ‌నుమాన్' లాంటి హిట్ త‌ర‌వాత ఏ హీరోకైనా కాస్త క‌న్‌ఫ్యూజన్ మొద‌లైపోతుంది. త‌ర‌వాత ఏం చేయాలి? ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలి? అనే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతుంటారు. ఆ గంద‌ర‌గోళంలో త‌ప్పులు...

మేనిఫెస్టో మోసాలు : సీపీఎస్ రద్దు ఏది బాసూ !

" అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు " .. ఈ డైలాగ్ పాదయాత్ర పొడుగుతూ వినిపించింది. ఉద్యోగుల్ని పిలిపించుకుని ర్యాలీలు చేసి... ప్లకార్డులు పట్టుకుని ఎంత డ్రామా...

ఈ విషయంలో కేసీఆర్‌ నెంబర్ వన్ !

రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన పార్టీ అభ్యర్థులను బీజేపీ ,కాంగ్రెస్ పంచుకున్నప్పటికీ ఆయన అభ్యర్థులను ఖరారు.. చేసి నోటిఫికేషన్ వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close