కోటీశ్వరులు అక్కడ టైమ్‌పాస్‌కోసం ప్యూన్‌లుగా పనిచేస్తున్నారు!

హైదరాబాద్: ఎవరైనా నౌకరీ ఎందుకు చేస్తారు? జీవనోపాధి కోసం. కానీ అక్కడ మాత్రం కాలక్షేపం కోసం ఉద్యోగాలు చేస్తారు. ఈ విచిత్ర పరిస్థితి గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలోని సనంద్ పట్టణ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. టాటా మోటార్స్ సంస్థ ‘నానో’ తయారీ ప్లాంట్‌ను పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌నుంచి అక్కడ గొడవల కారణంగా 2008లో సనంద్‌కు తరలించిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. నానో ప్లాంట్ రావటంతో సనంద్‌ పరిసరాలలోని కొందరు భూములు యజమానులకు దశ తిరిగింది. గుజరాత్ ప్రభుత్వం సనంద్‌లో నిర్వహిస్తున్న ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో నానో ప్లాంట్ మాత్రమే కాక ఈ ప్రాంతంలో చిన్నా, పెద్దా అన్నీ కలిసి దాదాపు 200 పరిశ్రమలు ఉన్నాయి. ఈ ఎస్టేట్ కోసం గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ సనంద్ పట్టణ పరిసరాలలోని బోల్, హీరాపూర్, ఖొరాజ్ వంటి గ్రామాలలో 4,000 హెక్టార్ల భూమిని గుజరాత్ స్థానికులనుంచి సేకరించింది. దీనికిగానూ దాదాపు రు.2,000 కోట్ల పరిహారాన్ని స్థానికులకు చెల్లించింది. దీనితో స్థానికులు పలువురు రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోయారు. నానో ప్లాంట్ రాకముందు సనంద్‌లో రెండే బ్యాంకులు, వాటి తొమ్మిది శాఖలను నిర్వహిస్తూ ఉండేవి. అప్పట్లో వాటన్నంటిలో కలిపి రు.104 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే 25 కొత్త బ్యాంకులు 56 కొత్త శాఖలను నెలకొల్పాయి. వీటిలో రు.3,000 కోట్ల డిపాజిట్లు మూలుగుతున్నాయి.

ప్రభుత్వంనుంచి భారీగా పరిహారం తీసుకున్న స్థానికులు ఆ డబ్బుతో స్థలాలను, బంగారాన్ని కొనుగోలు చేసి బ్యాంకులలో డిపాజిట్లు చేశారు. ఖరీదైన కార్లు, గేడ్జెట్స్ కొన్నారు. విపరీతంగా ఖర్చు పెట్టారు… ఎంజాయ్ చేశారు. అంతా చేసిన తర్వాత వారికి బోర్ కొట్టింది. ఎంతసేపు ఇలా ఊరికినే తిని కూర్చుంటాం అనుకున్నారు. ఖాళీగా కూర్చుంటే బుర్ర పాడైపోతుందనే నిర్ణయానికొచ్చారు. దీంతో కొందరేమో డబ్బు రాకముందు చేసే ఉద్యోగాలలో, మరికొందరు ఏదో ఒక ఉద్యోగంలోనో చేరిపోయారు. ఈ క్రమంలో వారు కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీలలో మెషిన్ ఆపరేటర్లుగా, ఫ్లోర్ సూపర్‌వైజర్లుగా, సెక్యూరిటీ సిబ్బందిగా, కొంతమందైతే ప్యూన్‌లుగా కూడా ఉద్యోగాలలో కుదురుకున్నారు. వీరికి నెలకొచ్చే జీతం రు.9,000 నుంచి రు.20,000 వరకు ఉంటుంది.

అయితే సనంద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఈ కోటీశ్వరులతో పెద్ద సమస్య వచ్చిపడింది. పరిశ్రమలలో ఉద్యోగాలు చేసేందుకు కార్మికులే దొరకటంలేదు. దొరికినా వారిని నిలబెట్టుకోవటం కష్టమైపోయింది. వారిని ఒక్కమాట అన్నా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. తమ సంస్థలో పనిచేసే 300 మంది సిబ్బందిలో 150 మందికి బ్యాంకుల్లో ఒక కోటి రూపాయలకు పైనే బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయని ఒక పరిశ్రమ యజమాని తెలిపారు. కార్మికులను నిలబెట్టుకోవటం పెద్ద సవాలుగా మారిందని చెప్పారు. ఈ కోటీశ్వరులైన కార్మికులకు ఈ ఉద్యోగాలు ప్రధానమైన ఆదాయ వనరు కాకపోవటంతో, వారిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోందని తెలిపారు. ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలలో ఈ కోటీశ్వరులు పనిచేస్తున్నారని వెల్లడించారు.

మొత్తం మీద హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాలైన తుక్కుగూడ వంటి గ్రామాలలో పదేళ్ళక్రితం, ప్రస్తుతం గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెం ప్రాంతంలో ప్రస్తుతం – భూముల ద్వారా కోటీశ్వరులైనవారి తరహాలోనే ఉంది సనంద్ భూముల యజమానుల వ్యవహారం. అయితే హైదరాబాద్ శివార్లలోని వారిలో చాలామంది తమకు వచ్చిన ఆ నడమంత్రపు సిరిని నిలబెట్టుకోలేక విపరీతంగా ఖర్చుపెట్టి మళ్ళీ బికారులైపోయారు. సనంద్ భూముల యజమానులు మాత్రం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఉద్యోగం చేయటం అభినందించాల్సిన విషయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close