ఏపీలో 7 నుండి 14కు పెర‌గ‌నున్న విమానాశ్ర‌యాలు

ఏపీలో విమానాశ్ర‌యాల సంఖ్య గ‌ణ‌నీయంగా పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం ఉన్న 7 విమానాశ్ర‌యాల‌ను పూర్తిస్థాయిలో అభివృద్ది చేయ‌టంతో పాటు ఆ సంఖ్య‌ను 14కు పెంచేలా సీఎం చంద్ర‌బాబు కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌గా… అందుకు త‌న‌వంతు కృషి చేస్తాన‌ని కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం ఉన్న రాజ‌మండ్రి, క‌డ‌ప‌, విజ‌య‌వాడ ఎయిర్ పోర్టుల్లో టెర్మిన‌ల్ సామర్థ్యాల పెంపుపై సీఎం చంద్ర‌బాబు కేంద్ర‌మంత్రితో మాట్లాడారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం… స్వ‌యంగా కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు కార్యాల‌యానికి వెళ్లారు. అక్క‌డే అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించి, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అందించాల్సిన స‌హ‌కారం… విమాన‌యాన శాఖ నుండి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.

ఇక‌, ఏపీలో కొత్త‌గా శ్రీ‌కాకుళం, ద‌గ‌ద‌ర్తి, కుప్పంతో పాటు నాగార్జున సాగ‌ర్ లో కొత్త‌గా విమానశ్ర‌యాల‌కు అనువుగా గుర్తించామ‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి వీటిని అభివృద్ది చేసే అంశంపై ముందుకు వెళ్ల‌బోతున్న‌ట్లు కేంద్ర‌మంత్రి అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఇక పుట్ట‌ప‌ర్తిలో ఉన్న ప్రైవేటు విమానాశ్ర‌యాన్ని ప్ర‌భుత్వం త‌ర‌పున ఆప‌రేట్ చేసేందుకు సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలిస్తున్నారు. దీనిపై సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చించామ‌ని, అది కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ‌కు అప్ప‌గిస్తే సాధార‌ణ సేవ‌ల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని అధికారులు వివ‌రించారు. ఏపీని లాజిస్టిక్ హ‌బ్ గా నిల‌బెట్టాల‌న్న ప‌ట్టుద‌ల‌తో సీఎం ఉన్నార‌ని, అందుకు త‌మ శాఖ కీల‌కం కానుంద‌ని… ఇందులో త‌న వంతు తోడ్పాటు అందిస్తాన‌ని కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌క‌టించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడు రాజ్ తరుణ్… ఇప్పుడు సుహాస్

చిన్న సినిమా టాక్ బావుంటే గానీ థియేటర్స్ కి జనం రారు. కంటెంట్ నమ్ముకొని చాలా ప్లాన్ గా చేసుకొని తమ మార్కెట్ ని కాపాడుకోవడం ద్రుష్టిపెడుతుంటారు హీరోలు. అయితే కొన్నిసార్లు పరిస్థితులు...

ఏపీకి మేఘా కృష్ణారెడ్డి రూ. 5 కోట్ల విరాళం !

మేఘా గ్రూపు కంపెనీలు ఏపీకి రూ. ఐదు కోట్ల విరాళం ఇచ్చాయి. వరద బాధితుల కోసం బడా కాంట్రాక్టర్లు స్పందించలేదని విమర్శలు వస్తున్న సమయంలోనే మేఘా కృష్ణారెడ్డి సోదరులు విజయవాడలో చంద్రబాబును కలిశారు....
video

రీల్స్ ని టార్గెట్ చేసిన రజనీ

https://www.youtube.com/watch?v=AiD6SOOBKZI సినిమా పాట ఈక్వేషన్ మారిపోయింది. మంచి పల్లవి, ఆకట్టుకునే చరణాలు, కలకాలం నిలిచిపోయే ట్యూన్ కోసం శ్రమించేవారు సంగీత దర్శకులు. ఇది గతం. ఇప్పుడంతా రీల్స్ ట్రెండ్. ట్యూన్ చేస్తే రీల్స్ లో...

భారత్‌లోకి మంకీపాక్స్ ఎంట్రీ

మంకీపాక్స్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి అనుమానాస్పద కేసు పాజిటివ్ గా తేలింది. దీంతో కేంద్రం అలర్ట్ జారీ చేసింది. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేక క్వారంటైన్‌లకు తరలించే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close