“సంపూర్ణభారతం”లో స్పెషల్ ఇండిపెండెన్స్ డే..!

స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులు జరుపుకుంటున్న 73వ స్వాతంత్ర్య దినోత్సవం ఇది. కానీ.. ఇది ఎప్పటిలాంటిది మాత్రం కాదు. ఇప్పటి వరకూ.. దేశ చిత్రపటంపై.. ఉన్న అంతో.. ఇంతో అనిశ్చితి లేకుండా… సగర్వంగా.. మీసం మెలేస్తూ.. అందాల కశ్మీరం భరతమాత.. తలపాగాలా.. మువ్వెన్నెల పతాకంతో మెరుస్తూండగా.. దేశం మొత్తం… ఉత్తేజితంగా జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవం ఇంది. బ్రిటిష్ వాళ్లు ఇండియాను వదిలి పెట్టి పోతూ.. పోతూ.. వేసిన విభజన బీజం… మంటలు.. దేశాన్ని 73 ఏళ్ల పాటు మండించాయి. కశ్మీర్ పేరుతో… పెట్టిన ప్రత్యేక షరతులతో.. అసలు ఆ భాగం… ఇండియా కాదా.. అంటూ చర్చ.. ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు.. ఆ చర్చ.. అనిశ్చితి రెండూ లేవు.

అప్పటి కారణాలకు అదే మంచిదనిపించిందేమో… కానీ కశ్మీర్ ఇండియాలో భాగం అయినా.. కాదన్నట్లుగా.. ఇంత కాలం ఉండిపోయింది. ప్రత్యేక రాజ్యాంగం.. ప్రత్యేక చట్టాలు.. ఇలా ప్రతి ఒక్కటి వేరుగా.. చూపిస్తూ.. కశ్మీర్ మనది కాదేమో అన్న భావనకు ప్రతి భారతీయుడు వచ్చేలా పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక … అదే కశ్మీర్ కేంద్రంగా.. పాకిస్థాన్ లాంటి దేశాలు.. సీమాంతర ఉగ్రవాదంతో విరుచుకుపడేందుకు… చేసిన ప్రయత్నాలు.. అప్పుడప్పుడూ.. సక్సెస్ అయిన వ్యవహారాలు.. అన్నీ… దేశంలో… ఓ రకమైన భయోత్పాతాన్ని చాలా కాలం కల్పించాయి. ఇప్పుడు భయాలన్నింటి నుంచి విముక్తి లభించింది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎలాగో.. ఇప్పుడు కశ్మీర్ కూడా అలాంటిదే. అందుకే.. ఎప్పుడూ లేనంతగా.. భారతీయుడి చాతి.. ఉప్పొంగుతోంది.

మారణహోమాలు.. రక్తపాతాలు … ఉగ్రవాద దాడులు.. ఇలా సుందర కశ్మీరాన్ని భూతల నరకంగా చేశాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. దేశంలో ఉన్న ప్రజలందరూ.. కశ్మీర్ కు…. వెళ్లి అక్కడ ఓ కొండ వాలున ఇల్లు కొనుక్కుని ప్రశాంతంగా గడిపే అవకాశం లభించింది. స్వాతంత్రం వచ్చినప్పుడు.. భారతీయులంతా.. ఎంతగా సంబరపడ్డారో…. 73 ఏళ్ల తర్వాత ప్రజల్లో అదే భావోద్వేగం కనిపిస్తోంది. భారత్ మాతాకీ జై అనే నినాదం.. ప్రతి ఒక్కరి గుండెల్లో నినదిస్తోంది. అందుకే… 73ఏళ్ల తర్వతా దేశ ప్రజలకు.. ఈ స్వాతంత్ర్య దినోత్సవం.. ఓ స్పెషల్..!

హ్యాపీ ఇండిపెండెన్స్ డే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com