భార‌త్ సేనకు అద్భుతం.. టెస్ట్ సిరీస్ కైవ‌సం

టెస్టు సిరీస్ విజ‌యం, అందులోనూ ప‌రాయి గ‌డ్డ‌పై, అదీ.. ఆసీన్ లాంటి బ‌ల‌మైన జ‌ట్టుపై – ఏ జ‌ట్టుకైనా ఇంత‌కంటే గొప్ప కల ఏముంటుంది? ఆ క‌ల‌ని నిజం చేసింది భార‌త క్రికెట్ జ‌ట్టు. ఆసీస్ పై 2-1 తేడాతో టెస్టు సిరీస్ విజ‌యాన్ని సాధించి.. గ‌బ్బా మైదానంలో భార‌త ప‌తాకాన్ని రెప రెప‌లాడించింది.

భార‌త్ గెల‌వాలంటే.. చివ‌రి రోజున 324 ప‌రుగులు చేయాలి. చివ‌రి రోజున గ‌బ్బా పిచ్ పేస‌ర్ల‌కు స్వ‌ర్గ‌ధామం. అలాంటి పిచ్ పై.. కోహ్లీ అండ‌లేని భార‌త జ‌ట్టు.. ఆసీస్‌ని చిత్తు చేసింది. మూడు వికెట్ల తేడాతో విజ‌య ప‌తాక ఎగ‌రేసింది. శుభ్‌మ‌న్ గిల్ (91), రిష‌బ్ పంత్(89 నాటౌట్‌) పుజారా (56) రాణించ‌డంతో.. 328 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని టీమిండియా ఛేదించ‌గ‌లిగింది. ఓ ద‌శ‌లో.. మ్యాచ్ డ్రా అవుతుందేమో అనిపించింది. భార‌త్ ఈ మ్యాచ్‌ని కాపాడుకోవ‌డం క‌ష్టం అనిపించింది. అలాంటి ద‌శ‌లో.. శుభ్‌మ‌న్ గిల్… బ్యాట్ ఝులిపించి వేగంగా ప‌రుగులు సాధించాడు. త‌న‌కి పుజారా చ‌క్క‌టి తోడ్పాటు అందించాడు. పిచ్‌లో పాతుకుపోయి.. అబేధ్య‌మైన డిఫెన్స్ తో ఆసీస్ బౌల‌ర్ల‌కు విసుగుపుట్టించాడు. గిల్, పుజారా అవుట్ అయినా… పంత్ రూపంలో భార‌త్‌కు ఆప‌ద్భాంధ‌వుడు దొరికాడు. పంత్ త‌న స‌హ‌జ‌సిద్ధ‌మైన ఆట ఆడ‌డానికి టైమ్ తీసుకున్నా.. ఒక్కసారి కుదురుకున్నాక‌.. ఆసీస్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. చివ‌ర్లో వేగంగా ప‌రుగులు కావ‌ల్సిన ద‌శ‌లో.. వాషింగ్ట‌న్ సుంద‌ర్ నుంచి పంత్ కి తోడ్పాటు అందింది. ఇద్ద‌రూ వన్డే మ్యాచ్‌ని త‌ల‌పిస్తూ.. బ్యాటింగ్ చేశారు. సుంద‌ర్ అవుటైనా, పంత్ కంగారు ప‌డ‌కుండా.. భార‌త్ ని విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. గ‌బ్బా స్టేడియంలో ఇప్ప‌టి వ‌ర‌కూ.. ఆసీస్ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అలాంటి జ‌ట్టుకు భార‌త్ ఓట‌మి రుచి చూపించిన‌ట్టైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close