భారత పొరుగు దేశాల్లో జరుగుతున్న అలజడులు చూస్తే.. ఒక దాని తర్వాత ఒకటి చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని ఎవరికైనా అనిపిస్తుంది. మొదట శ్రీలంక.. తర్వాత బంగ్లాదేశ్.. ఇప్పుడు నేపాల్.. పాకిస్తాన్ లోనూ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టిన దగ్గర నుంచి పాకిస్తాన్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సైన్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్ని అణిచివేస్తున్నారు కానీ .. పాకిస్తాన్ పరిస్థితి కూడా నిప్పుల మీద దుప్పటి కప్పినట్లుగానే ఉంది. ఇలా ఒకొకటిగా ఎందుకు రాజకీయంగా అనిశ్చితంగా మారుతున్నాయి ? వీటి వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్ర ఏమిటి ?
నేపాల్ అల్లర్ల వెనుక చైనా శక్తులు ఉన్నాయా ?
నేపాల్ యువత పూర్తిగా కట్టు తప్పిపోయారు. సైకోలుగా మారిపోయారు. నేపాల్ ప్రధాని రాజీనామా చేసినా ఊరుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేస్తున్నారు. ఓ మాజీ ప్రధాని భార్యను సజీవదహనం చేశారంటే.. అది ఖచ్చితంగా యువత ఆగ్రహం కాదు.. అంతకు మించిన అరాచకాలు, అల్లర్ల చోదక శక్తి ఏదో ఉంటుంది. సహజంగా నేపాల్.. చైనా గుప్పిట్లో ఉంటుంది. ఇటీవల ఒక్క టిక్ టాక్ తప్ప అన్ని సోషల్ మీడియాను నేపాల్ లో బ్యాన్ చేశారు. ఆ తర్వాతే అల్లర్లు ప్రారంభమయ్యాయి. అప్పటికే అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. అది బట్టబయలు అయింది.
శ్రీలంక దుస్థితికి చైనానే కారణం !
శ్రీలంకలో పరిస్థితికి ప్రత్యక్షంగా..పరోక్షంగా చైనానే కారణం. శ్రీలంక రాజకీయనాయకులు చైనా నాయకత్వంతో సన్నిహితంగా ఉండి.. విపరీతంగా అప్పులు చేశారు. తిరిగి చెల్లించలేకపోయారు. అదే సమయంలో శ్రీలంక మౌలిక సదుపాయాలు, కీలక పోర్టుల్లో చైనా పెట్టుబడులను తీసుకున్నారు. ఫలితంగా నియంత్రణ కోల్పోయే పరిస్థితికి వచ్చారు. చివరికి అది శ్రీలంక ప్రజలకు కనీస అవసరాలు తీరకుండా చేసింది. దాంతో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది.
బంగ్లాదేశ్ దుస్థితి వెనుక అమెరికా ఉందని ఆరోపణలు !
అమెరికాకు సెయింట్ మార్టిన్స్ దీవిని ఇచ్చేసి ఉంటే బంగ్లాదేశ్ లో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని భారతదేశానికి పారిపోయి వచ్చిన షేక్ హసీనా చెప్పారు. ఆ మార్టిన్స్ దీవి బంగ్లాదేశ్ ది. ఆ దీవి కోసం అమెరికా కుట్రలు చేసిందని హసీనా ఆరోపణ. హసీనాను తరిమేసి అధ్యక్ష పదవి చేపట్టిన యూఎస్ .. అమెరికాతో టచ్ లో ఉండేవారు. ఆయనను ముందు పెట్టి ఇదంతా చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆసియాలోని ఇతర దేశాల్లోనూ అలజడి
జపాన్ ప్రధానులు ఐదేళ్లలో ముగ్గురు మారారు. ఆ దేశంపై అమెరికా పదిహేను శాతం సుంకం విధించడమే కారణం. ధాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధం జరిగి ఆగిపోయింది. పాకిస్తాన్ , ఆప్ఘనిస్తాన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. మొత్తం ఆసియాలోనే అలజడి రేపే అంతర్జాతీయ కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు బలంగాఉన్నాయి.