కివీస్‌కు రెండోదెబ్బ…! దూకుడే కాదు నిలకడ కూడా కోహ్లీ టీం బలమే..!

రోమ్‌కెళ్లినప్పుడు రోమన్‌లా ఉండాలి. దీన్ని టీమిండియా పర్‌ఫెక్ట్‌గా క్యాచ్ చేసింది. భారీ లక్ష్యాన్ని చేధించాల్సినప్పుడు.. చూపించాల్సిన దూకుడును చూపించి.. తొలి టీ ట్వంటీని గెలిచేసిన.. టీమిండియా.. రెండో వన్డేలో… సింపుల్ లక్ష్యం సాధించడానికి దానికి భిన్నమైన స్లో అండ్ స్టడీ మార్గాన్ని ఎంచుకుని… సూపర్ విక్టరీ కొట్టింది. ఆక్లాండ్‌లో జరిగిన రెండో టీ ట్వంటీలో.. మళ్లీ కివీసే మొదట బ్యాటింగ్ చేసింది. కానీ.. తొలి మ్యాచ్‌లో చూపించినంత దూకుడు చూపించలేకపోయారు. భారత బౌలర్లు… గొప్ప ప్రతిభ ప్రదర్శించకపోయినా.. తమ సహజసిద్ధమైన టాలెంట్‌నుచూపించడంతో.. పరుగులు భారగా తీయలేకపోయారు. 20 ఓవర్లలో 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఒక్క ఆటగాడు కూడా అర్థసెంచరీ చేయలేదు. తొలి ఓవర్లోనే రెండు సిక్సులు కొట్టి.. మ్యాచ్‌ ఏదో లా ఉండబోతోందని.. సంకేతాలు పంపినా.. కివీస్ ఆటగాళ్లి ఆరంభశూరత్వమే అయింది.

చేజింగ్‌లో టీమిండియా.. మొదట్లో కాస్త తడబడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎక్కువ సేపు నిలబడలకేపోయారు. కానీ.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మాత్రం.. ఎలాంటి లూప్ హోల్‌కు చాన్స్ ఇవ్వలేదు. లక్ష్యం చిన్నదే కావడంతో.. కేఎల్ రాహుల్.. తన సహజస్వభావమైన దూకుడు ఆటకు.. నెమ్మదితనం నేర్పాడు. 50 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి… వ్యక్తిగత రికార్డుల కన్నా.. టీమ్ విజయమే ముఖ్యమని సందేశం పంపారు. శ్రేయస్ అయ్యర్… రాహుల్‌కు.. ఖచ్చితమైన జోడిగా నిలిచారు. 33 బంతుల్లో 44 పరుగులు చేసి.. గెలుపు ముంగిట ఔటయ్యారు. లాంచనాన్ని శివందూబేతో కలిసి రాహుల్ పూర్తి చేశాడు.

ఐదు టీ ట్వంటీల సీరిస్‌లో రెండు టీ ట్వంటీల్లోనూ టీమిండియాఘన విజయం సాధించింది. గతంలో న్యూజిలాండ్‌పై.. టీమిండియా టీ ట్వంటీ రికార్డు చాలా చెత్తగా ఉంది. కానీ.. ఈ సారి ఆటగాళ్లు అక్కడి వాతావరణానికి త్వరగా అలవాటు పడిపోయారు. ఫలితంగా.. భారత్‌లో పిచ్‌లపై ఆడుతున్నట్లే ఆడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాప్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్న మెగా అల్లుడు

`విజేత‌`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు క‌ల్యాణ్ దేవ్‌. రెండో సినిమా `సూప‌ర్ మ‌చ్చీ`. ఇది సెట్‌లో ఉండ‌గానే.. రెండు మూడు సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా...

ఇన్‌సైడ్ టాక్‌: ‘ఉప్పెన’ పాట ‘వెర్ష‌న్‌’ల గోల‌

ఓ పాట‌కు ఒక‌డ్రెండు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇది వ‌ర‌కు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్ద‌రు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయ‌డం జ‌రిగేది. అయితే.. ఇప్పుడు...

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

HOT NEWS

[X] Close
[X] Close