సోమవారం అసెంబ్లీకి టీడీపీ డుమ్మా..!

శాసనమండలి రద్దు తీర్మానం కోసం అసెంబ్లీలోని సమావేశపర్చబోతున్నారన్న సమాచారం మేరకు.. తెలుగుదేశం పార్టీ తన వ్యూహాన్ని ఖరారు చేసుకుంది. శాసనమండలి సమావేశాల గురించి శాసనసభలో చర్చించడం.. రాజ్యాంగ విరుద్ధమవుతుందన్న అభిప్రాయంతో.. సోమవారం సమావేశాలకు వెళ్లకూడదని టీడీపీ నిర్ణయించుకుంది. దీంతో.. అసెంబ్లీలో.. వైసీపీ మాత్రమే… తన అభిప్రాయాలను వెల్లడించి.. శాసనమండలిపై.. తనదైన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడనుంది. నిజానికి గత గురువారం కూడా.. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాలేదు. ఆ రోజు కూడా.. మండలి సమావేశాలు జరిగిన తీరుపై చర్చ జరిగింది. మంత్రులందరూ.. శాసనమండలిని రద్దు చేయాలన్న సూచనలు చేశారు. చివరికి ముఖ్యమంత్రి కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చివరికి మూడు రోజులు వాయిదా వేసి.. సోమవారం నిర్ణయం తీసుకుందామన్నారు.

తెలుగుదేశం పార్టీ గైర్హాజర్ అయితే.. ప్రతిపక్షం లేకుండా.. అసెంబ్లీ తీర్మానం చేసి పంపినట్లు అవుతుంది. అయితే.. తీర్మానాన్ని ఆమోదించి.. కేంద్ర హోంశాఖ బిల్లు తయారు చేసే విషయంలో ఇదేం పెద్ద అడ్డంకిగా ఉండకపోవచ్చు కానీ.. వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందన్న అభిప్రాయం మాత్రం.. ప్రజల్లోకి వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. పైగా.. శాసనమండలి గురించి.. శాసనసభలో చర్చించడం అనేది అసాధారణం. రెండూ శాసన వ్యవస్థలే. ఒక దానితో మరో దానికి పోలిక ఉండదు. రెండూ రాజ్యాంగ వ్యవస్థలు. ఒక వ్యవస్థ సరిగ్గా పని చేయలేదని.. మరో వ్యవస్థలో చర్చించడం అంటే.. రాజ్యాంగాన్ని కించపర్చినట్లే అవుతుందంనేది..కొంత మంది వాదన.

తెలుగుదేశంపార్టీ.. మండలి విషయంలో చాలా స్పష్టంగానే ఉంది. రద్దు చేస్తామని బెదిరించినంత మాత్రాన.. తాము.. లొంగిపోయి ప్రజావ్యతిరేక బిల్లులను.. పాస్ చేస్తామనుకోవడం పొరపాటు అని.. తమకు రాష్ట్రమే ముఖ్యమని.. పదవులు కాదని.. స్పష్టం చేస్తున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశం మాత్రమే ఉంటోంది. మండలి నిరవధికంగా వాయిదా పడింది. ప్రత్యేకంగా సమావేశ పర్చాలని ప్రభుత్వం భావిస్తే తప్ప.. సమావేశం అయ్యే అవకాశం లేదు. సమావేశం కాకుండానే మండలిని రద్దు చేయాలన్న సంకల్పంలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ పిలుపు… విరాళాల వెల్లువ..!

ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వరదల కారణంగా హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడంతో పాటు పెద్ద ఎత్తన ధ్వంసం అయిన రోడ్లు, విద్యుత్...

‘న‌ర్త‌న‌శాల’ టికెట్… 10 ల‌క్ష‌ల నుంచి 50 రూ. వ‌ర‌కూ

శ్రేయాస్ ఏటీటీ ద్వారా `న‌ర్త‌న‌శాల‌` విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 24 న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా `న‌ర్త‌న‌శాల‌`లోని 17 నిమిషాల స‌న్నివేశాల్ని విడుద‌ల చేస్తున్నారు. బాల‌కృష్ణ స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది....

పాపం.. విజ‌య్ సేతుప‌తి కూతుర్ని కూడా వ‌ద‌ల్లేదు!

స‌భ్య స‌మాజం మ‌రోసారి త‌ల‌దించుకోవాల్సిన దుస్థితి ఇది. మొన్న‌టికి మొన్న ఐపీఎల్ లో ధోనీ విఫ‌లం అయితే.. ధోనీ కుమార్తెని అత్యాచారం చేస్తాన‌ని బెదిరించి - దిగ‌జారిపోతున్న విలువ‌ల‌కు త‌ర్ప‌ణంగా నిలిచాడో దుర్మార్గుడు....

‘న‌ర్త‌న‌శాల‌’లో అర్జునుడిడిగో…!

నంద‌మూరి బాల‌కృష్ణ క‌ల‌ల ప్రాజెక్టు `న‌ర్త‌న‌శాల‌`. త‌న స్వీయ నిర్మాణంలోనే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. భారీ కాస్టింగ్‌, బాల‌య్య ద‌ర్శ‌క‌త్వం, పౌరాణిక గాథ‌.. ఇవ‌న్నీ ఈ సినిమాపై ఆక‌ర్ష‌ణ‌ని పెంచాయి. కొంత‌మేర...

HOT NEWS

[X] Close
[X] Close