మాల్యాని అప్పగించండి: బ్రిటన్ కి భారత్ అభ్యర్ధన

బ్యాంకులను మోసం చేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను తిరిగి భారత్ కి పంపించవలసిందిగా కోరుతూ డిల్లీలోని బ్రిటిష్ హైకమీషనర్ కి భారత విదేశాంగ శాఖ ఒక లేఖ వ్రాసింది. అలాగే లండన్ లోని భారత్ హైకమీషనర్ ద్వారా బ్రిటన్ విదేశాంగశాఖకు కూడా ఒక లేఖ అందజేస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలియజేసారు.
విజయ్ మాల్యాపై ఈడి అధికారులు మనీ లాండరింగ్ కేసును నమోదు చేశారు. వారి అభ్యర్ధన మేరకు ఆయన పాస్ పోర్ట్ కూడా రద్దు చేయబడింది. అయినా విజయ్ మాల్యా ఏమాత్రం చలించకపోవడం విశేషం. ఎందుకంటే ఆయనకు 1992 నుంచే బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది. ఈ విషయం గురించి ఆయన రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్ లో కూడా పేర్కొనకుండా దాచిపెట్టి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆ కారణంగా ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటు ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది. మే 3న దానిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

విజయ్ మాల్యాకి బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది కనుక, అతనిని భారత్ కి పంపించదానికి బ్రిటన్ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనుమానమే. ఒకవేళ పంపించదలచుకోకపోతే మాత్రం, విజయ్ మాల్యాని భారత్ తిరిగి రప్పించడం దాదాపు అసంభవమేనని భావించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతిపక్షం ఎవరో దుబ్బాక ఎన్నిక తేల్చబోతోందా..?

తెలంగాణలో ప్రతిపక్షం ఎవరో తేల్చుకోవడానికే దుబ్బాకలో రాజకీయం నడుస్తోందా..? అంటే..అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. దుబ్బాకలో అధికార పార్టీగా ఉండి.. సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కోల్పోయే అవకాశం లేదు. ఆ విషయం కనీస రాజకీయ...

రాములమ్మ రాజకీయ భ్రమణం.. మళ్లీ బీజేపీలోకి..!?

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న విజయశాంతి మళ్లీ బీజేపీలోకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. విజయశాంతి వైపు నుంచి సానుకూల...

తెలంగాణ, ఏపీలకు భారీ పెట్టుబడులు..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రలకు భారీ పెట్టుబడులు వచ్చే్వకాశఆలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ శివారులో ఉన్న జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు అగ్రశ్రేణి సంస్థలు అయిన లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్ ఇండియా సిద్ధమయ్యాయి. ఈ...

అమరావతి తరహాలోనే పోలవరంపై ఏపీ బీజేపీ వాదన..!

అమరావతి రాజధానిలోనే ఉండాలి కానీ...రోడ్డెక్కం..! ఉద్యమం చేస్తామన్న జనసేన లాంటి నేతల్నీ అడ్డుకుంటాం..! పైగా.. అమరావతి మహిళలపై అసభ్య విమర్శలూ చేస్తాం..!.. ఇదీ ఏపీ రాజధానిపై బీజేపీ వైఖరి. ప్రస్తుతం పోలవరం విషయంలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close