త‌మ‌న్నా పంట పండింది

అదేంటో ఈమ‌ధ్య త‌మ‌న్నాకు అన్నీ బాగా క‌లిసొస్తున్నాయి. మంచి ఆఫ‌ర్లు అందుతున్నాయి. వ‌రుస సినిమాల‌తో త‌మ‌న్నా ఫుల్ బిజీ అయిపోయిందిప్పుడు. త‌న కెరీర్‌లో తొలిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా అభినేత్రిలో న‌టిస్తోంది. బాలీవుడ్ నుంచి కూడా మ‌ళ్లీ పిలుపొచ్చింది. ర‌ణ‌వీర్ సింగ్‌కి జోడీగా ఓ సినిమాలో న‌టించ‌బోతోంది. ఇప్పుడు మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకొన్న‌ట్టు టాక్‌. ఫ్రెంచ్ మూవీ అన్‌ట‌చ్‌బుల్స్ రీమేక్ హ‌క్కుల్ని క‌ర‌ణ్‌జోహార్ ద‌క్కించుకొన్నారు. ఆ సినిమా తెలుగులో ఊపిరిగా వ‌చ్చి మంచి విజ‌యా్న‌ని అందుకొంది. ఇప్పుడు హిందీలో ఈ సినిమాని తెర‌కెక్కించబోతున్నారు. క‌థానాయ‌కుడి సెక‌రెట్రీ పాత్ర‌.. మ‌ళ్లీ త‌మ‌న్నాకే ద‌క్కిన‌ట్టు టాక్‌.

ఇటీవ‌ల ఊపిరి సినిమా చూసిన క‌ర‌ణ్‌.. ఆ పాత్ర‌కు హిందీలో కూడా త‌మ‌న్నా అయితేనే బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. ఈ విష‌య‌మై క‌ర‌ణ్ త‌మ‌న్నాతో సంప్ర‌దింపులు కూడా జ‌రిపార‌ని, క‌ర‌ణ్ జోహార్ సినిమా అన‌గానే త‌మ‌న్నా కూడా మ‌రో విష‌యం ఆలోచించ‌కుండా ఒప్పుకొంద‌ని తెలుస్తోంది. హిమ్మ‌త్ వాలాతో బాల‌వుడ్‌ని ఓ ఊపు ఊపేద్దామ‌నుకొన్న త‌మ‌న్నాకు అక్క‌డ చేదు అనుభ‌వం ఎదురైంది. అయినా స‌రే.. వ‌రుస‌గా ఇలా క్రేజీ ఆఫ‌ర్లు అందుకొంటోందంటే మామూలు విష‌యం కాదు క‌దా. బాలీవుడ్‌లో త‌మ‌న్నా పంట పండిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close