ఒకే టోర్నీ భారత్ , పాకిస్తాన్ మూడో సారి తలపడుతోంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. దుబాయ్‌లో జరగనున్న ఫైనల్లో రెండు జట్లు విజయం కోసం పోరాడనున్నాయి. రెండు జట్లు తమ చివరి సూపర్ ఫోర్ మ్యాచ్‌లల్లో చివరి బంతుల్లో విజయాలు సాధించాయి.
భారత్ ఫేవరేట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ పాకిస్తాన్ ను తక్కువ వేయలేరు. రెండు జట్ల మధ్య పోటీ అంటే అసలు ఆట కంటే.. ఇతర అంశాలు కూడా హైలెట్ అవుతాయి. మొదటి లీగ్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్స్ లేకపోవడం పెను దుమారం అయింది. పాక్ టోర్నీని బహిష్కరించేదాకా వెళ్లింది. మళ్లీ డబ్బులు లాస్ అవుతాయని వెనక్కి తగ్గి ఆడుతున్నారు.
ఇండియాతో రెండు సార్లు ఓడిపోవడంపై ఆ దేశంలో టీమ్ పై ఆగ్రహావేశాలాు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఈ టోర్నీ అంత గొప్ప ప్రదర్శన చూపించలేదు కానీ లక్కు కలిసొచ్చి ఫైనల్ కు చేరుకుంది. 2022 తర్వాత ఇండియాపై ఆ జట్టు ఏ ఫార్మాట్ లోనూ గెలవలేదు. అందుకే ఫైనల్ లో వారు తాడోపేడో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో పడ్డారు. వరుసుగా ఇప్పటికే 8 టైటిళ్లు గెలిచిన భారత్, తొమ్మిదో టైటిల్ ను సొంతం చేసుకుని పాకిస్తాన్ కు ఆపరేషన్ సిందూర్ ను మరోసారి గుర్తు చేయాలని అనుకుంటోంది.
మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది.