ఇండియా, పాక్ క్రికెట్ మ్యాచ్ కు టిక్కెట్లు ఎక్కడైనా బ్లాక్ లో అమ్ముతారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లో అయిపోతాయి.కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిది. అసలు టిక్కెట్లు కొనేవారు లేకుండా పోయారు. ఆసియా కప్ లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు టికెట్ అమ్మకాలు దారుణంగా ఉన్నాయి. సగం స్టేడియంపైనే ఖాళీగా ఉండటం ఖాయమే. సేల్స్ అసలు లేకపోవడంతో టిక్కెట్ ధరలు తగ్గించారు. అయినా డిమాండ్ కనిపించలేదు,
సాధారణంగా స్టాండర్డ్ టికెట్ రేట్‌ను మొదట 475 దిర్హమ్స్ గా నిర్ణయించారు. అమ్మకాలు లేకపోవడంతో 350 దిర్హమ్స్ కు తగ్గించారు. ఇక ప్రీమియం టిక్కెట్ల సేల్స్ దాదాపుగా లేవు. మ్యాచ్ కు బజ్ లేకపోవడంతో వీఐపీలు ఎవరూ హాజరు కావడంలేదు. ప్రీమియం సీట్ల ధరలు అత్యంత ఖరీదైనవిగా ఉండటంతో ఇతర అభిమానులు ఆసక్తి చూపించలేదు.
సాధారణంగా వివాదాలు ఉంటే.. ఎక్కువ ప్రచారం వచ్చేది.కానీ ఈ సారి ఆపరేషన్ సింధూరం వ్యవహారం ఉన్నా.. హైప్ రాలేదు. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్లు లేకపోవడం కూడా ఓ కారణం. ఇండియా జట్టు నుండి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు రిటైర్ కావడం కూడా టికెట్ అమ్మకాలపై ప్రభావం చూపింది. ఈసారి ఆసియా కప్ నిర్వాహకులు ప్యాకేజ్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని వల్ల కూడా టిక్కెట్లు కొనేవాళ్లు తగ్గిపోయారు.
కారణం ఏదైనా.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. గతంలో వచ్చే హైప్లో పది శాతం కూడా ఆదివారం మ్యాచ్ కు రాలేదు.