న్యూ జెర్సీలో 38 వేల మందితో ఇండియా డే పరేడ్

ఏ దేశమేగినా మూలాలను మరువని భారతీయులు, తమ మాతృభూమిపై మమకారాన్ని చాటుతూనే ఉంటారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా అమెరికా న్యూజెర్సీలో సుమారు 38 వేల మంది ఇండియా డే పరేడ్ ఘనగా నిర్వహించారు. ఎడిసన్ లో మొదలైన పరేడ్, వుడ్ బ్రిడ్జ్ సమీపంలోని ఇండియన్ స్క్వేర్ వద్ద ముగిసింది.

సుమారు రెండు కిలోమీటర్ల పరేడ్ కన్నుల పండుగ్గా సాగింది. బ్యాండ్ బృందాలు ఫుల్ జోష్ తో సంగీతాన్ని వినిపిస్తుంటే ప్రవాస భారతీయులు డాన్స్ చేస్తూ, నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ఊరేగింపుగా ముందుకు సాగారు. బృందాలుగా విడిపోయి విభిన్నమైన స్లోగన్స్ ఇస్తూ, పాటలు పాడుతూ ఆడుతూ పాడుతూ ఈ వేడుకను చిరస్మరణీయంగా మార్చేశారు. ప్రపంచంలో ఉన్న జోష్ మొత్తం న్యూజెర్సీలోనే ఉందా అనేటంత సందడిగా ఈ వేడుకను జరుపుకొన్నారు.

న్యూ జెర్సీలోని వందకు పైగా సంస్థలు ఇందులో పాలుపంచుకున్నాయి. ఎడిసన్, మిడిల్ సెక్స్ ప్రాంతంలో భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఇక్కడి జనాభాలో భారతీయులు దాదాపు 13 శాతం మంది. అందుకే ఇండియా డే అంత గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు. సినీ తారలు మదాలసా శర్మ, సమీక్షా సింగ్, ప్రాచీ షా, సుజాతా మెహతా, టాక్ షో యాంకర్ రిచా అనిరుధ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియా డే పరేడ్ పేరుతో వేడుక నిర్వహించడం ఇది 11వ సారి కావడం విశేషం.

భారత దేశం 69వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొనే వేళ, అమెరికాలోనూ అనేక చోట్ల ఈ వేడుకను నిర్వహించారు. అందులోనూ న్యూజెర్సీ పరేడ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చిన రేవంత్ రెడ్డి !

జర్నలిస్టులు సుదీర్ఘంగా చేస్తున్న పోరాటం ఫలించింది . జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కింద గతంలో కేటాయించిన భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి హ్యాండోవర్ చేశారు. ఈ భూమికి ఒక్కో జర్నలిస్టు...

కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం!

ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా వరుసగా కొరడా ఝులిపిస్తోంది. ఓ వైపు హైడ్రా పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నా..మరోవైపు ఉన్నపళంగా భవనాలను కూల్చివేస్తుండటంపై తీవ్ర విమర్శలు...

జయభేరీది కార్ సర్వీసింగ్ సెంటర్ !

జయభేరీ మూడున్నర దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది కానీ ఇప్పటి వరకూ ఆ సంస్థపై చిన్న ఆరోపణ రాలేదు. క్లీన్ ఇమేజ్ తో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. అయితే...

దివ్వెలకు ఇల్లు రాసిచ్చేసిన దువ్వాడ !

దివ్వెల మాధురీ పది రోజులు సైలెంట్ గా ఉంటానంటే.. అందరూ ఏంటో అనుకున్నారు. ఈ పది రోజుల్లో ఆమె సైలెంట్ గా తన పని తాను పూర్తి చేసుకుంది. టెక్కలిలో ఉన్న దువ్వాడ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close