ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అదుర్స్!

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఎర్రకోట నుండి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకొంది. ప్రతిపక్షాలు అడుగుతున్న అనేక ప్రశ్నలకు, చేస్తున్న ఆరోపణలకు ఆయన తన ప్రసంగంలో సమాధానాలు చెపుతూనే, వారికి చాలా చురకలు కూడా వేశారు. ఇటువంటి సందర్భాలలో మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ చాలా చప్పగా ప్రసంగించేవారు. కానీ సామాన్య ప్రజలకు కూడా అర్ధమయ్యేలా, ఆసక్తి కలిగించేలా, తమ భవిష్యత్ పై ఆశలు చిగురించేలా నరేంద్ర మోడి ప్రసంగం సాగింది. మోడీ ప్రభుత్వం తరచూ ప్రతిపక్షాల నుండి తరచూ ఎదుర్కొనే ఆరోపణ విదేశాల నుండి నల్లధనం రప్పించడంలో విఫలమవడం.

దాని గురించి ఆయన మాట్లాడుతూ, “విదేశాలలో పడి ఉన్న నల్లధనం వెనక్కి తీసుకురావడానికి మేము అధికారంలోకి రాగానే ‘సిట్’ ఏర్పాటు చేసాము. విదేశాలలో నల్లధనం దాచుకొన్నవారిపై కటినమయిన చర్యలు చేప్పట్టడానికి చట్టాలు తయారు చేశాము. ఆ చట్టాన్ని చూసి నల్లధనం దాచుకొన్నవారు తమకు ఇచ్చిన గడువుని ఉపయోగించుకొంటూ ప్రభుత్వానికి తమ నల్లధనం వివరాల గురించి తెలియజేస్తూ జరిమానాలు చెల్లింస్తున్నారు. మేము విదేశాల నుండి నల్లధనం ఇంకా వెనక్కి రప్పించలేకపోవచ్చు కానీ దేశంలో నుండి నల్లధనం బయటకి తరలిపోకుండా నిలువరించగలిగాము. మేము చేస్తున్న కృషి కారణంగా వివిధ దేశాలు ఇప్పుడు మన ప్రభుత్వం సహకరించేందుకు ముందుకు వస్తున్నాయి. మన ప్రయత్నాలు ఫలిస్తే విదేశాలలో ఉన్న నల్లధనం అంతా ఖచ్చితంగా వెనక్కి వస్తుంది.” అని తెలిపారు.

కొత్తగా ఆదాయ వనరుని సృష్టించడం ఎంత ముఖ్యమో, ఉన్నదానిని గుర్తించడం,కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని తెలియజేస్తూ, “మన దేశంలో చిరకాలంగా లక్షాలాది ఉన్నతాదాయ వర్గాలకు చెందిన ప్రజలకు కూడా సామాన్య ప్రజలతో సమానంగా గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాము. కానీ ఆ చిన్న మొత్తం వారికి ఒకరోజు టీ ఖర్చు కూడా కాదు. కనుక సామాన్య ప్రజల కోసం దానిని వదులుకోమని మేము ఇచ్చిన పిలుపుకి ఇంతవరకు సుమారు 20లక్షల మంది స్పందించి తమ సబ్సీడీని వదులుకొన్నారు. దాని వలన ప్రభుత్వానికి ఏడాదికి రూ.15, 000 కోట్లు మిగుతోంది. భారత్ వంటి దేశానికి అది చాలా పెద్ద మొత్తం,” అని ఆయన చెప్పారు. ఇంత చిన్న ఆలోచనతో అంత భారీ ఆదాయం మిగల్చగలడం ఒక్క మోడీకే చెల్లు.

అవినీతి నిర్మూలన గురించి ఆయన మాట్లాడుతూ, “ఈ 15నెలల కాలంలో మా ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. అదే మా నిజాయితీకి, పారదర్శకతకి ఒక ఉదాహరణ. మేము అధికారంలోకి వచ్చిన తరువాత బొగ్గు గనులు, స్పెక్ట్రం చివరికి ఎఫ్.ఎం. రేడియో లైసెన్సులని కూడా వేలం ద్వారానే కేటాయిస్తున్నాము. దాని వలన మన ఖజానాలో ఈ ఏడాది మూడు లక్షల కోట్లు జమా అయింది,” అని తెలిపారు.

అవినీతి చీడపురుగులా దేశాన్ని లోపలి నుండి తొలిచేస్తోందని దాని నిర్మూలనకు కటినమయిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తోందని, ఆ కారణంగా తమ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిళ్ళు వస్తున్నాయని తెలిపారు. ఉదాహరణకి ఇంతవరకు ప్రభుత్వ సంస్థలలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో చాలా వరకు కెమికల్ కంపెనీలకు మళ్ళిపోతుండేదని, దానిని నివారించేందుకు తమ ప్రభుత్వం యూరియాకి వేప కోటింగ్ చేయడం ఆరంభించామని, అప్పటి నుండి కెమికల్ కంపెనీలకి ఆ యూరియా పనికిరాకుండాపోయిందని, కానీ అదే వేప కోటింగ్ చేయబడ్డ యూరియా వ్యవసాయానికి చాలా ప్రయోజనకరంగా మారుతోందని ఆయన తెలిపారు.

ఈ విధంగా చిన్నచిన్న ఉపాయాలు కూడా ప్రభుత ఖజానాకు ఆదాయాన్ని చేకూర్చుతోందని, దానిని మళ్ళీ దేశంలో సామాన్య ప్రజల సంక్షేమం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనా కోసం ఖర్చుపెడుతున్నామని తెలిపారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంతవరకు తీవ్ర నిర్లక్ష్యానికి గురికాబడ్డ ఈశాన్య రాష్ట్రాలకు అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించి వాటినీ దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీపడే విధంగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

దేశంలో నిరుపేదలకు వైద్యం, భీమా పాలసీలను కల్పించిందని తెలియజేశారు. స్వచ్చ భారత్ పధకం క్రింద ఇంతవరకు దేశంలో పదిలక్షల లేట్రిన్స్ కట్టించామని తెలిపారు. దేశంలో ఇంతవరకు కూడా విద్యు లేని గ్రామాలు 18500 ఉన్నాయని, వచ్చే నాలుగేళ్ళలో తమ ప్రభుత్వం ఆ గ్రామాలన్నిటికీ కూడా విద్యుత్ అందిస్తుందని తెలిపారు. ప్యూను, గుమస్తా, డ్రైవరు వంటి చిన్న చిన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు చేయకుండా వారి ప్రతిభ ఆధారంగా లేదా వారి మార్క్స్ షీట్లు ఆధారంగా నేరుగా ఉద్యోగాలు ఇచ్చేందుకు అవసరమయిన నియమనిబంధనలు తయారుచేసేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు.

ఈవిధంగా ప్రతీ సమస్యనీ వాస్తవిక దృక్పధంతో పరిశీలించి, వాటికి అనువయిన పరిష్కారాలు కనుగొంటున్నామని మోడీ తెలిపారు. ఆయన ప్రసంగం ఆద్యంతం చాలా సరళంగా, అర్ధవంతంగా భవిష్యత్ పట్ల చాలా ఆశాజనకంగా సాగింది. ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రభుత్వం చేపడుతున్న వివిధ చర్యల గురించి, వాటికి వస్తున్న సత్ఫలితాల గురించి, ఇంకా ముందు చేప్పట్టబోయే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన చాలా చక్కగా, చాలా సమర్ధవంతంగా ప్రజలకు వివరించగలిగారు. దేశంలో బీజేపీ నేతలందరూ ఆయనలాగే తమ ప్రభుత్వం చేపడుతున్న పనుల గురించి చెప్పుకోగలిగితే ప్రజలలో మోడీ ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బెల్లంకొండ‌తో అతిథి శంక‌ర్‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, మంచు మ‌నోజ్‌, నారా రోహిత్ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'గ‌రుడ‌న్`కి ఇది రీమేక్‌. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర ధీర శూర‌'...

సిమ్లాలోనూ మత చిచ్చు !

హిమాచల్ ప్రదేశ్ మొత్తం మీద లక్షన్నర మంది ముస్లింలు ఉంటారు. ఇతర వర్గాలన్నీ కలిపి అరవై లక్షల వరకూ ఉంటారు. అయినా అక్కడ హేట్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. సిమ్లాలో...

కామెడీ ఈజ్ కింగ్‌

సర్వేంద్రియానాం న‌య‌నం ప్ర‌ధానం అన్న‌ట్టు.. జోన‌ర్ల‌న్నింటిలోనూ హాస్యం ప్ర‌ధానం అని న‌మ్ముతుంది చిత్ర‌సీమ‌. ప‌క్కాగా నవ్వించాలే కానీ, సినిమా హిట్ట‌వ్వ‌డం గ్యారెంటీ. ఇలాంటి సినిమాల‌కు జ‌నాల్లో రీచ్ కూడా ఎక్కువ‌. ఫ్యామిలీ మొత్తం...

కేసీఆర్ ఆలస్యం చేస్తే జరిగేది ఇదే!

నడిపించే నాయకుడు సైలెంట్ గా ఉండిపోతే ఏం జరుగుతుందన్నది బీఆర్ఎస్ లో జరుగుతోన్న పరిణామాలు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి. నేతలకు దిశానిర్దేశం చేసే అధినేత ఏమి పట్టన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో బీఆర్ఎస్ క్రమంగా పట్టు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close