ఇంద్ర‌గంటి చెప్పే.. అమ్మాయి క‌బుర్లు!

సుధీర్‌బాబు – ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ కాంబోలో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇది వ‌ర‌కు వీరిద్ద‌రూ క‌లిసి `స‌మ్మోహ‌నం`, `వి` చిత్రాలు చేశారు. ఇది మూడోది. ఈసారి ఇంద్ర‌గంటి త‌న‌కు అచ్చొచ్చిన ప్రేమ‌క‌థ‌ని ఎంచుకున్నాడు. రొమాంటిక్ కామెడీ జోన‌ర్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ రోజు సాయింత్రం టైటిల్‌ని రివీల్ చేయ‌బోతున్నారు. ఈ చిత్రానికి `మీకో అమ్మాయి గురించి చెప్పాలి` అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది.ఆ అమ్మాయి.. ఇంకెవ‌రు..? మ‌న కృతి శెట్ఇనే. `ఉప్పెన‌`తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది కృతి. ఆ సినిమా బ‌య‌ట‌కురాకుండానే.. ఇంద్ర‌గంటి సినిమాలో ఛాన్స్‌కొట్టేసింది. ఇంద్ర‌గంటి సినిమాల్లో క‌థానాయిక పాత్ర‌కు మంచి వాల్యూఉంటుంది. ఈ సినిమాలోనూ క‌థంతా.. ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంద‌ట‌. క‌థానాయిక పాత్ర‌లో చాలా కోణాలుంటాయ‌ని, అవే ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close