నాగ‌చైత‌న్య‌కు క‌లిసొచ్చిన స్ట్రాట‌జీ

నాగ‌చైత‌న్య టాప్ స్టారేం కాదు. త‌న సినిమాలు 40 – 50 కోట్ల బిజినెస్‌లు చేసిన దాఖ‌లాలు లేవు. సినిమాపై ఎంత బ‌జ్ వ‌చ్చినా… ఈలోపే మార్కెట్ జ‌రుగుతుంది. అయితే `ల‌వ్ స్టోరీ` మాత్రం ఈ హ‌ద్దుల్ని దాటేస్తోంది. త‌న కెరీర్‌లో ఎప్పుడూ చూడ‌ని అంకెలు చైతూ తొలిసారి చూస్తున్నాడు. ఈ సినిమాని ఆంధ్రాలో 15 కోట్ల‌కు అమ్మేశారు. చైతూ కెరీర్‌లో ఇదే రికార్డు. ఓవ‌ర్సీస్ ఆరు కోట్లు ప‌లికింది. అదీ రికార్డే. నైజాంలో ఓన్ రిలీజ్‌. అమ్మితే.. ఇక్కడా మంచి రేటే ప‌లికేది. మొత్తానికి చైతూ సినిమాకి మంచి బిజినెస్ జ‌రిగింది. అయితే.. ఇదంతా శేఖ‌ర్ క‌మ్ముల‌, సాయి ప‌ల్ల‌విల క్రేజ్ వ‌ల్లే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వ‌ర‌కు వీళ్ల కాంబినేష‌న్‌లో `ఫిదా` వ‌చ్చింది. ఆ క్రేజ్ ఈ సినిమాకి బాగా ప్ల‌స్ అయ్యింది. విచిత్రం ఏమిటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇది సాయి ప‌ల్ల‌వి సినిమాగానే ప్ర‌మోట్ అవుతూవ‌చ్చింది. ఆదివారం విడుద‌లైన పాట‌తో అయితే.. ఆ ముద్ర మ‌రింత బ‌లంగా నాటుకుపోయింది. ఏదైతేనేం..? ఈ స్ట్రాట‌జీ.. చైతూకి క‌లిసొచ్చిన‌ట్టే. `ఫిదా`లో సాయి ప‌ల్ల‌వికి మంచి పేరొచ్చినా, వ‌రుణ్‌తేజ్ కూడా త‌న‌దైన మార్క్ చూపించ‌గ‌లిగాడు. ఈసారీ అదే జ‌ర‌గొచ్చు. బొమ్మ హిట్ట‌యితే.. ఆ క్రెడిట్ చైతూ ఖాతాలోకీ వెళ్తుంది. కాబ‌ట్టి.. చైతూ కూడా `ఇది సాయి ప‌ల్ల‌వి సినిమా అనుకుంటారా?` అనే టెన్ష‌న్ లేకుండానే.. ఈ క్రేజ్‌ని ఎంజాయ్ చేస్తున్న‌ట్టు టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

ఏపీలోనే ధరలెక్కువ..! ఎందుకని..?

సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి..? పట్టణాల్లో .. నగరాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సాధారణ రేట్లే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. నిత్యావసర...

HOT NEWS

[X] Close
[X] Close