ఇంద్ర‌గంటికి నిరీక్ష‌ణ త‌ప్ప‌దా?

‘వి’ త‌ర‌వాత ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ భారీ ప్ర‌ణాళిక‌లే వేసుకున్నాడు. నాగ‌చైత‌న్య‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల‌కు ముందే లైన్ లో పెట్టుకున్నాడు. వీరిద్ద‌రిలో ఒక‌రితో త‌న త‌దుప‌రి సినిమా ప‌ట్టాలెక్కాలి. కానీ… ఇద్ద‌రు హీరోలూ… ఇంద్ర‌గంటిని నిరీక్ష‌ణ‌లో పెట్టేశారు. విజ‌య్ – పూరి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇది అవ్వ‌గానే.. ఓ బాలీవుడ్ సినిమా చేయాలి. అప్ప‌టి వ‌ర‌కూ ఇంద్ర‌గంటికి విజ‌య్ దేవ‌ర‌కొండ అందుబాటులోకి రాడు. మ‌రోవైపు నాగ‌చైత‌న్య ప‌రిస్థితీ అంతే. `ల‌వ్ స్టోరీ` త‌ర‌వాత‌.. విక్ర‌మ్ కె.కుమార్ తో జ‌ట్టు క‌ట్ట‌బోతున్నాడు. `థ్యాంక్స్‌` సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వచ్చేసింది. ఆ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కూ.. చైతూ మ‌రో సినిమా చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దాంతో.. ఇంద్ర‌గంటికి హీరోలు క‌రువ‌య్యారు. ఇద్ద‌రు హీరోల‌‌తో `ఓకే` అనిపించుకున్నా స‌రే, ఇప్పుడు సినిమా చేయ‌డానికి హీరో కోసం వెదుక్కోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. నిజానికి ఇదంతా ‘వి’ ఎఫెక్టే అనుకోవాలి. ఆసినిమా గ‌నుక హిట్ట‌యితే.. చైతూ ఆలోచ‌న‌లో ప‌డేవాడేమో. అటు విక్ర‌మ్ సినిమానీ, ఇటు ఇంద్ర‌గంటి సినిమానీ ఏక కాలంలో పూర్తి చేసేవాడు. కానీ `వి` ఫ‌లితం తేడా కొట్టే స‌రికి.. అంత రిస్క్ చేయ‌డానికి చైతూ సాహ‌సించ‌డం లేదు.

కాక‌పోతే ఇంద్ర‌గంటి ప్లానింగులు వేరేలా ఉన్నాయి. ఈ గ్యాప్ లో ఓ వెబ్ సిరీస్ పూర్తి చేయాల‌నుకుంటున్నాడు. ‘శ‌ప్త‌భూమి’ న‌వ‌ల ఇంద్ర‌గంటికి బాగా న‌చ్చింది. ఆ క‌థ‌ని వెబ్ సిరీస్ గా రూపొందించే అవ‌కాశాలున్నాయి. అది కుద‌ర‌ని ప‌క్షంలో అంతా కొత్త‌వారితో త‌న స్టైల్ లో ఓచిన్న సినిమా చేసే ఛాన్సుంది. మ‌రి ఇంద్ర‌గంటి దేన్ని ఎంచుకుంటాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ అడిగాడు.. త్రివిక్ర‌మ్ కాద‌న్నాడు

`అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్ కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ద‌స‌రా సంద‌ర్భంగా ఆదివారం వ‌చ్చేసింది. ఈ రీమేక్‌లో ప‌వ‌న్‌న‌టిస్తాడా, లేదా? అన్న స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. ద‌ర్శ‌కుడిగా... సాగ‌ర్ చంద్ర పేరు ఖాయ‌మైంది. అయితే...

స‌మంత‌కు కార్తికేయ క‌ర్చీఫ్‌

ఈ ఆదివారం బిగ్ బాస్ 4 సెట్లో సంద‌డి చేసింది స‌మంత‌. మావ నాగార్జున లేని లోటుని... త‌న న‌వ్వుల‌తో, త‌న స్క్రీన్ ప్రెజెన్స్‌తో భ‌ర్తీ చేయ‌గ‌లిగింది. ఈ షోలో.. కార్తికేయ కూడా...

కోర్టు నుంచి స్టే వస్తుందనే అర్థరాత్రి కూల్చివేతలు..!

తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, సానుభూతి పరుల ఆస్తులపై అటు వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు.. ఇటు ప్రభుత్వం కూడా తమకు దఖలు పడిన అధికారాన్ని ఉపయోగించుకుని ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతోందన్న ఆరోపణలు...

ఐపీఎల్‌లో చేజింగ్ సండే..!

ఐపీఎల్‌లో ప్రతీ ఆదివారం రోమాలు నిక్కబొడుచుకునే మ్యాచ్‌లు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆదివారం మాత్రం సాదాసీదా మ్యాచ్‌లో జరిగాయి. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ టీమ్‌లో విజయ సాధించాయి. స్కోర్ ఎంత...

HOT NEWS

[X] Close
[X] Close