క్రికెటర్ కావాల‌ని ఎప్పుడూ అనుకోలేదు: అఖిల్‌

అఖిల్‌లోని న‌టుడు కంటే క్రికెట‌రే ముందుగా ప‌రిచ‌యం అయ్యాడు. సీసీసీ (సెల‌బ్రెటీ క్రికెట్ లీగ్‌) తో అఖిల్ బ్యాటింగ్ విన్యాసాలు చూసే అవ‌కాశం ద‌క్కింది. హీరో కాక‌పోయి ఉంటే క‌చ్చితంగా క్రికెట‌ర్ అయిపోతాడు అన్నంత సీరియ‌స్ నెస్ అఖిల్ ఆట‌లో క‌నిపించేది. కానీ.. అఖిల్ మాత్రం అలా ఎప్పుడూ అనుకోలేదంటున్నాడు. “క్రికెట్ నా హాబీ మాత్ర‌మే. ఎప్పుడూ క్రికెట‌ర్ కావాల‌నుకోలేదు. దానికి చాలా ప్యాష‌న్ ఉండాలి. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ ఆడాలంటే జీవితం ధార‌బోయాలి. నాకు క్రికెట్ అంటే ఇష్టం మాత్ర‌మే. స్కూలు వ‌య‌సులో.. క్రికెట్ తెగ ఆడేవాడ్ని. కోచింగ్ తీసుకోవ‌డానికి ఆస్ట్రేలియా కూడా వెళ్లా. ఇప్ప‌టికీ క్రికెట్ ఆడుతూనే ఉంటా. మాన‌సికంగా ఒత్తిడి ఉన్న‌ప్పుడు క్రికెట్ ఆడితే.. అదంతా మాయం అవుతుంది. క్రికెట్ ని నేనెప్పుడూ అలానేచూశాను” అంటున్నాడు.

శ‌నివారం నుంచి ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభం కాబోతోంది. ఈ సీజ‌న్ గురించి అఖిల్ చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడ‌ట‌. “ఐపీఎల్ అనేది అతి పెద్ద క్రికెట్ పండ‌గ‌. మ‌న ఫేవ‌రెట్ ప్లేయ‌ర్స్ అంద‌రినీ ఒకేచోట చూసే వీలు ద‌క్కుతుంది. ఐపీఎల్ ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ మిస్ కాను. నాకు విరాట్‌, డివిలియ‌ర్స్ అంటే చాలా ఇష్టం. వాళ్లిద్ద‌రూ ఒకే టీమ్ లో ఉంటారు. అందుకే బెంగ‌ళూరు మ్యాచ్ ఆడుతుంటే.. మ‌రింత ఆస‌క్తి మొద‌లైపోతుంది. టీమ్ గా చెప్పాల్సివ‌స్తే.. మ‌న‌ హైద‌రాబాద్ జ‌ట్టుని స‌పోర్ట్ చేస్తా” అంటున్నాడు. మామూలుగా అయితే.. ఐపీఎల్ మ్యాచులు అన‌గానే వెంకీ, అఖిల్‌లు స్టేడియాల్లో ద‌ర్శ‌నం ఇస్తుంటారు. ఈసారి వాళ్ల‌కు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈసారి ఐపీఎల్ దుబాయ్ లో జ‌ర‌గబోతోంది. అందులోనూ ప్రేక్ష‌కులు లేకుండానే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ అడిగాడు.. త్రివిక్ర‌మ్ కాద‌న్నాడు

`అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్ కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ద‌స‌రా సంద‌ర్భంగా ఆదివారం వ‌చ్చేసింది. ఈ రీమేక్‌లో ప‌వ‌న్‌న‌టిస్తాడా, లేదా? అన్న స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. ద‌ర్శ‌కుడిగా... సాగ‌ర్ చంద్ర పేరు ఖాయ‌మైంది. అయితే...

స‌మంత‌కు కార్తికేయ క‌ర్చీఫ్‌

ఈ ఆదివారం బిగ్ బాస్ 4 సెట్లో సంద‌డి చేసింది స‌మంత‌. మావ నాగార్జున లేని లోటుని... త‌న న‌వ్వుల‌తో, త‌న స్క్రీన్ ప్రెజెన్స్‌తో భ‌ర్తీ చేయ‌గ‌లిగింది. ఈ షోలో.. కార్తికేయ కూడా...

కోర్టు నుంచి స్టే వస్తుందనే అర్థరాత్రి కూల్చివేతలు..!

తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, సానుభూతి పరుల ఆస్తులపై అటు వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు.. ఇటు ప్రభుత్వం కూడా తమకు దఖలు పడిన అధికారాన్ని ఉపయోగించుకుని ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతోందన్న ఆరోపణలు...

ఐపీఎల్‌లో చేజింగ్ సండే..!

ఐపీఎల్‌లో ప్రతీ ఆదివారం రోమాలు నిక్కబొడుచుకునే మ్యాచ్‌లు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆదివారం మాత్రం సాదాసీదా మ్యాచ్‌లో జరిగాయి. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ టీమ్‌లో విజయ సాధించాయి. స్కోర్ ఎంత...

HOT NEWS

[X] Close
[X] Close