ఈ టైంలోనూ “రెడ్డి గార్ల”కు పదవుల పందేరం..!

సాక్షి రెడిసెంట్ ఎడిటర్‌గా ఏపీ ఎడిషన్‌కు పని చేసిన ధనుంజయరెడ్డి అనే జర్నలిస్టును ముఖ్యమంత్రి సలహాదారుగా నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేసింది. అలాగే.. ఏపీపీఎస్సీ సభ్యుడిగా రమణారెడ్డి అనే మరో విద్యాసంస్థల అధినేతకు కూడా పదవులు ఇచ్చింది. అధికార యంత్రాంగం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. అత్యవసర సర్వీసులు మాత్రమే పని చేస్తున్నాయి. ఇలాంటి సమయంలోనూ.. ఇలాంటి ఎమర్జెన్సీ కాని పదవుల పంపకాలకు ప్రభుత్వానికి చాలా తీరిక దొరుకుతోంది. సలహాదారుగా నియమితులైన ధనుంజయ్ రెడ్డి విధులుగా ముఖ్యమంత్రి వార్డు మెంబర్లు, గ్రామ సచివాలయాల విషయంమలో సలహాలు ఇస్తారట.

ధనుంజయ్ రెడ్డి నిన్నామొన్నటిదాకా సాక్షి పత్రికలో రెసిడెంట్ ఎడిటర్ గా పని చేశారు. హఠాత్తుగా ఆయనను తొలగించేశారు. ఏపీ ఎడిషన్‌కు.. చలపతిరావు అనే సీనియర్ తెలంగాణ జర్నలిస్టును రెసిడెంట్ ఎడిటర్ గా నియమించారు. చలపతిరావు కంటే… ధనుంజయ్ రెడ్డి జూనియర్ . అయినప్పటికీ.. కడప అడ్వాంటేజ్‌తో వైసీపీ అధినేత కుటుంబానికి దగ్గరగా మారడంతో.. సాక్షి పత్రికలో ముందే కీలక పోస్టు దక్కింది. కానీ హఠాత్తుగా ఆయన పక్కన పెట్టారు. దీనికి కారణం ఏమిటన్నదానిపై సాక్షి గ్రూప్‌లో అనేక ప్రచారాలు జరిగాయి. వాటిలో ప్రధానమైనవి.. తన రెసిడెంట్ ఎడిటర్ పోస్టును అడ్డం పెట్టుకుని భూదందాలకు పాల్పడటం. చిత్తూరు జిల్లాతో పాటు విశాఖలోనూ… ఇలా భూదందాలు చేశాడని.. అది తెలియడంతోనే ఆయనను పక్కన పెట్టారని సాక్షిలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న జర్నలిస్టును నేరుగా ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించడం ఏమిటో.. చాలా మందికి అర్థం కాలేదు. తమ వారు అనుకున్న వారు ఏం చేసినా అండగా ఉంటామన్న సందేశాన్ని… మీడియా గ్రూప్ నుంచి బయటకు పంపడానికి ఈ నియామకం చేశారని కొందరు అంటున్నారు. ఇప్పుడు.. పదవి ఇచ్చినా.. రేపు ఏదో చిన్న వివాదాన్ని సాకుగా చూపి పంపేస్తారని… అప్పుడు.. సాక్షిలోనూ.. ప్రభుత్వంలోనూ పని ఉండదని అంటున్నారు. ఏదైనా… సలహాదారుల జాబితాలో మరో వ్యక్తి చేరిపోయినట్లే. మరో సాక్షి ఉద్యోగి ఖాతాలో ప్రజాధనం పడుతున్నట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కట్‌ చేసిన జీతాలు,పెన్షన్లను 12 శాతం వడ్డీతో చెల్లించాల్సిందే..!

కరోనా పేరు చెప్పి రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జీతాలు, పెన్షన్‌ బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.మార్చి, ఏప్రిల్ నెలల్లో బకాయిపడిన 50శాతం...

జగన్ అనుకుంటే అంతే.. ! ఎమ్మెల్సీ టిక్కెట్ ఆయన కుమారుడికి..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనుకుంటే ఇట్టే నిర్ణయం తీసుకుంటారు. దానికి ముందూ వెనుకా ఎలాంటి మొహమాటాలు పెట్టుకోరు. దానికి తాజాగా మరో ఉదాహరణ ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఎంపిక. రాజ్యసభకు...

వైసీపీలోనూ అలజడి రేపుతున్న రాపాక..!

జనసేన తరపున గెలిచి తాను వైసీపీ మనిషినని చెప్పుకుంటున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆ పార్టీలోనూ చిచ్చు పెడుతున్నారు. రాజోలు వైసీపీలో మూడు గ్రూపులున్నాయని.. అందులో తనది ఒకటని స్వయంగా...

బిగ్ బాస్ – 4 వాయిదా?

బిగ్ బాస్ రియాలిటీ షో.. తెలుగులోనూ సూప‌ర్ హిట్ట‌య్యింది. ఎన్టీఆర్‌, నాగార్జున‌, నాని లాంటి హోస్ట్ లు దొర‌క‌డంతో బిగ్ బాస్ కి తెలుగు ఆన‌ట ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు నాలుగో సీజ‌న్...

HOT NEWS

[X] Close
[X] Close