ఇన్‌సైడ్ టాక్‌: భోళా శంక‌ర్‌.. చిరు కోసం కాదా?

చిరు పుట్టిన రోజు వేడుక‌లు అయిపోయాయి. రోజుంతా చిరు సినిమాల‌దే సంద‌డి. గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్ లుక్స్‌, బాబి సినిమా లుక్స్ తో.. సంబ‌రాలు రెట్టింపు అయ్యాయి. అంతా బాగానే ఉన్నా – ఎక్క‌డో మెహ‌ర్ ర‌మేష్ ప్రాజెక్ట్ నే కాస్త అనుమానంగానూ, ఆశ్చ‌ర్యంగానూ చూస్తున్నారు మెగా ఫ్యాన్స్‌. అస‌లు ఈ కాంబినేష‌న్ సెట్ కావ‌డంలోనే బోల్డంత ఫ‌జిల్ ఉంది. ఉందుకంటే… శ‌క్తి, షాడో… సినిమాలు చూశాక మెహ‌ర్ ర‌మేష్ పేరెత్త‌డానికే భ‌య‌ప‌డిపోయారు హీరోలు, నిర్మాత‌లు. మెహ‌ర్ కూడా ఎవ‌రినీ క‌లిసి, క‌థ చెప్పే ధైర్యం చేయ‌లేదు. అలాంటి మెహ‌ర్ కి ఈ ప్రాజెక్టు ద‌క్క‌డం షాకింగ్ ఎలిమెంటే.

మెహ‌ర్ ఏదో అద్భుత‌మైన క‌థ చెప్పి, చిరుని క‌దిలించ‌డానికి చెప్ప‌డానికేం లేదు. ఎందుకంటే ఇది వేదాళం రీమేక్‌. ఓ భాష‌లో బాగా ఆడిన సినిమాని రీమేక్ చేయ‌డం చిరుకి కొత్త కాదు. కానీ అలా రీమేక్ చేసిన‌ప్పుడు ఆయ‌న చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాడు. హిట్స్ తో స్పీడుమీదున్న డైరెక్ట‌ర్ కే ఆ బాధ్య‌త అప్ప‌గిస్తాడు. మార్పులు చేర్పుల విషయంలో చిరు హ్యాండ్ చాలా ఉంటుంది. ద‌గ్గ‌రుండి త‌న‌కు అనువుగా ఈ క‌థ‌ని మ‌ల‌చుకుంటాడు. కానీ `వేదాళం` రీమేక్ విష‌యంలో ఇదేం జ‌ర‌గ‌లేదు.

నిజానికి వేదాళం రీమేక్ చేయాల‌న్న ఆలోచ‌న చిరుది కాదు. కేవ‌లం మెహ‌ర్ ర‌మేష్ దే. ఈ సినిమా చూసి, దాన్నితెలుగు నేటివిటీకి అనువుగా మార్చుకుని ఓ స్క్రిప్టు త‌యారు చేశాడ‌ట మెహ‌ర్‌. తాను క‌థ రాస్తున్న‌ప్పుడు హీరో చిరంజీవి కాదు. మ‌రెవ‌రో. ఆమ‌ధ్య సీసీసీ అంటూ చిరు ఓ కార్య‌క్ర‌మం మొద‌లెట్టిన‌ప్పుడు… వెనుక ఉండి, ఆ ప‌నులు చూసుకున్న‌ది మెహ‌ర్ ర‌మేషే. ఆ సంద‌ర్భంగా.. చిరుతో సాన్నిహిత్యం పెరిగింది. ఆ స‌మ‌యంలోనే `నీ ద‌గ్గ‌ర క‌థ‌లేమైనా ఉన్నాయా` అని అడిగితే.. వేదాళం రీమేక్ గురించి చెప్ప‌డం, చిరుకి ప్ర‌త్యేకంగా ఆ సినిమా చూపించి, తాను ఎలాంటి మార్పులు చేశాడో పూస గూచ్చిన‌ట్టు చెప్ప‌డంతో చిరు బాగా ఇన్‌స్పైర్ అయ్యాడ‌ని తెలుస్తోంది. అప్ప‌టికీ.. చిరు ఈ సినిమా చేస్తాడ‌న్న న‌మ్మ‌కం మెహ‌ర్ కి లేదు. ఓరోజు `ఈ క‌థ నేనే చేస్తా` అని చిరు మాట ఇవ్వ‌డం – ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ని ఈ టీమ్ లోకి తీసుకురావ‌డం ఇవ‌న్నీ చిరునే చూసుకున్నాడ‌ట‌. అలా.. మెహ‌ర్ కి అనుకోని అదృష్టం వ‌రించేసింది. నిజానికి ఇంత జ‌రుగుతున్నా ఈ ప్రాజెక్టుపై ఎవ‌రికీ న‌మ్మ‌కాల్లేవు. మొద‌లైప్పుడు చూద్దాంలే అనుకున్నారు. ఇప్పుడు టైటిల్, ఫ‌స్ట్ లుక్ కూడా వ‌చ్చేశాయి కాబ‌ట్టి.. న‌మ్మ‌క త‌ప్ప‌డం లేదు. మ‌రి చిరు త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని మెహ‌ర్ ఎలా నిల‌బెట్టుకుంటాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close