ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు అసెంబ్లీ తీర్మానంతో పనేముంది..?

వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ అమరావతిలో జరిగిందని చెబుతున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ తప్ప.. అన్నీ చేస్తోంది. తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరపాలని.. హోంమంత్రి సుచరిత.. అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. దానికి అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ చేయిస్తామని సుచరిత ప్రకటించారు. ప్రభుత్వ వ్యవహారం చూసి.. ప్రజలు ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ సైడర్ ట్రేడింగ్.. అవినీతి.. భూముల కబ్జాలు.. ఇలాంటివి జరిగినట్లుగా తేలితే.. ఆధారాలుంటే..కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం ఇప్పటి వరకూ జరిగింది కానీ.. ఏపీ సర్కార్ మాత్రం అసెంబ్లీలో తీర్మానం చేసింది.

ఇప్పటి వరకూ ఈ తీర్మానం లేకనే విచారణ చేయిలేదన్నట్లుగా సభ్యులు మాట్లాడారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై వైసీపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటి నుండి గొంతు చించుకుంటోంది. టీడీపీ లో ఉన్న ముఖ్య నేతల పేర్లందరివీ చేర్చి.. బినామీలంటూ ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిరూపించాలనే పట్టుదలతో ప్రతీ రికార్డునూ పరిశీలించింది. ఇప్పటికీ ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. ఏదైనా పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు.. టీడీపీ నేతలపై.. ఆరోపణలు చేస్తూ.. హడావుడి చేస్తున్నారు.

దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలని.. టీడీపీ నేతలు.. సవాల్ చేస్తున్నా.. ఆ దిశగా.. ప్రభుత్వం అడుగు ముందుకు వేయడం లేదు. కానీ.. టీడీపీని బ్లాక్ మెయిల్ చేస్తామన్నట్లుగా ప్రకటనలు తీర్మానాలు చేస్తున్నారు. దాంతో.. ప్రభుత్వం తీరుపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ తీర్మానంతో అయినా… ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపి.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close