విభజన ఎఫెక్ట్: తగ్గుతున్న ‘గణేష్ లడ్డు’ వేలం ధరలు

హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రభావం వినాయక చవితి లడ్డు వేలంపాటలపైకూడా పడింది. చవితి మంటపాల సంఖ్య, లడ్డుల పరిమాణం పెరుగుతోందిగానీ వినాయక చవితి లడ్డుల వేలంపాటలపై ఆసక్తి, వేలం ధరలు తగ్గుముఖంపట్టాయి.

హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకున్న 2002-2003 సమయంలో ఈ లడ్డు వేలంపాటల ట్రెండ్ ప్రారంభమయింది. లడ్డు వేలం పాటల విలువ సంవత్సరం సంవత్సరానికీ పెరిగిపోయేది. ముఖ్యంగా బాలాపూర్ లడ్డు రు.12 లక్షలవరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదంతా విభజనకు ముందు సంగతి. విభజన తర్వాత – గతఏడాది ఈ వేలంపాటల ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం రియల్ ఎస్టేట్ రంగం. ఈ వేలంపాటలలో పాల్గొని లడ్డూలను దక్కించుకునేది రియల్ ఎస్టేట్ వ్యాపారులే. ఈ పాటలద్వారా సెంటిమంట్‌తోపాటు వ్యాపారులకు కావాల్సినంత పబ్లిసిటీకూడా దక్కుతుంది. అందుకే వీరు ఈ పాటలలో ఉత్సాహంగా పాల్గొంటారు. విభజనతర్వాత రియల్ ఎస్టేట్ రంగం మందగించిన సంగతి తెలిసిందే. అమీర్‌పేటలో 2013లో గణేష్ లడ్డు రు.12.56 లక్షలు పలకగా, 2014లో రు.10.08 లక్షలు మాత్రమే పలికింది. బడంగ్ పేట లడ్డుకు కూడా అదే పరిస్థితి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇటీవల కొద్దిగా కదలిక ప్రారంభమైనప్పటికీ ఓవరాల్‌గా పెద్ద తేడా లేకపోవటంతో ఈ ఏడాదికూడా వేలంపాటలపై పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

మరోవైపు మంటపాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపవటం విశేషం. గత ఏడాది హైదరాబాద్ నగరంలో మంటపాల సంఖ్య సుమారు 50 వేలు ఉండగా, ఈ ఏడాది అది లక్షకు చేరిందని ఈ వేడుకలను పర్యవేక్షించే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి చెబుతోంది. ఈ మంటపాలద్వారా దాదాపు రు.100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని ఒక అంచనా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close