2016 ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తు ఒక్క అంగుళం!

(సెటైర్)

ఫేక్ న్యూస్ ఛానెల్ టివీ 999 ఆన్ చేయగానే అందులో న్యూస్ బులెటిన్ వస్తోంది.

యాంకర్ నాగ్ : ప్రతిక్షణం అనూహ్యమైన వార్తలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టివీ త్రిబుల్ నైన్ కు స్వాగతం. తాజాగా వండిన వార్తను అందించడానికి రిపోర్టర్ ప్రేమ్ లైన్ లో ఉన్నాడు. హలో ప్రేమ్… హలో… ప్రేమ్…

రిపోర్టర్ ప్రేమ్ : నేను లైన్ లోనే ఉన్నాను నాగ్.

నాగ్ : ఒకే ప్రేమ్. ఇప్పుడు నీదగ్గరున్న వార్తేమిటో చెప్పు.

ప్రేమ్ : నేనిప్పుడు ఖైరతాబాద్ లో ఉన్నాను నాగ్. ప్రతిఏటా ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీవాళ్లు గణేష్ ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తారని అందరికీ తెలుసు నాగ్.

నాగ్ : (విసుగ్గా) అందరికీ తెలిసిన విషయాలు చెప్పకు ప్రేమ్. ఒక్క క్షణం అందరికీ తెలిసిన వాస్తవాలు చెప్పామంటే మన టివీ రేటింగ్స్ పడిపోతాయని ఛైర్మన్ మొన్నీమధ్యనే మీటింగ్ పెట్టి మరీ వాయించేశాడు. సెన్సేషనల్ న్యూస్ చెప్పు.

ప్రేమ్ : నీకంతా తొందరేనాగ్. ఎప్పుడూ రేటింగ్స్ గొడవేనా? నీకో సెన్సేషనల్ న్యూస్ చెప్పాలి. ఇప్పుడు గణేష్ ఉత్సవకమిటీ సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఖైరతాబాద్ విగ్రహం ఎత్తుని కేవలం ఒక్క ఇంచ్ మాత్రమే ఉండబోతుందట.

నాగ్ : ఏమిటీ !! వచ్చే ఏడాది వినాయక విగ్రహం కేవలం అంగుళం మాత్రమే ఉంటుందా… !!

ప్రేమ్ : అవును నాగ్. ఇంకా ఈ వార్త మీడియాలో మిగతావారికి ఎవ్వరికీ తెలియదు. ముందుగా నేనే వండేసి వార్చేస్తున్నాను నాగ్. ఇంకా వేడివేడిగా ఉంది న్యూస్. చేతులు కాలుతున్నాయ్ ఇక్కడ.

నాగ్ : ఇది ఎలా సాధ్యమైంది ? వివరాలు చెప్పు.

ప్రేమ్ : అరవైఏళ్ల క్రిందట కేవలం ఒక్క అడుగుతో పూజలందుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఏటికేడు పెరుగుతూ 60ఆడుగులవరకు వెళ్లిన విషయం మనందరికీ తెలుసు. అయితే నిర్వాహకులు ప్రతిఏటా ఒక్కో అడుగు తగ్గించాలని ముందుగా అనుకున్నప్పటికీ, ఇప్పుడు హఠాత్తుగా తమ ఆలోచనను మార్చేసుకుని వచ్చే ఏడాది అడుగుకంటే బాగా తక్కువగా చివరకు ఒక్క అంగుళం ఎత్తుఉండే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు నేను పసిగట్టేశాను నాగ్.

నాగ్ : మరీ ఒక్క ఇంచ్ కి ఎందుకు తగ్గించావ్…సారీసారీ తగ్గించారు !! నువ్వు చెబుతున్న వార్త మరీ నమ్మేటట్టులేదు ప్రేమ్. ఇంకోమాట చూడు.

ప్రేమ్ : నాగ్, నా సంగతి నీకు తెలుసుగా… ఒక్క సారి ఈ ప్రేమ్ – ఫేకింగ్ న్యూస్ కి కమిటైతే ఎవ్వరిమాట వినడు. ఈ విషయంలో బేరాలుండవ్. నేను చెప్పిన న్యూస్ కి నా దగ్గర బలమైన ఆధారాలున్నాయి నాగ్.

నాగ్ : అయితే ఒకే.. (ప్రేక్షకులవైపు తిరిగి) 2016లో ఖైరతాబాద్ విగ్రహం కేవలం ఒక్క అంగుళం ఎత్తుతోనే తయారుచేయిస్తామని గణేష్ ఉత్సవ నిర్వహకులు చెబుతున్నారు. సుమారు 60 అడుగుల ఎత్తువరకు పెంచిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా ఇంత తక్కువ ఎత్తుతో మైక్రో గణనాథుని విగ్రహం తయారుచేయించాలని అనుకోవడానికి కారణాలేమిటో టివీత్రిబుల్ నైన్ రిపోర్టర్ ప్రేమ్ ని అడిగి తెలుసుకుందాం. హలో, చెప్పు ప్రేమ్… ఇంకా నీ దగ్గరున్న సమాచారం ఏమిటో…

ప్రేమ్ : నాదగ్గరున్న సమాచారం ప్రకారం, నిన్న వినాయక చవతిరోజున నిర్వహక సభ్యుల్లో ఒకాయనకు కలలో వినాయకుడు దర్శనమిచ్చాడు నాగ్.

నాగ్ : సూపర్. సాక్షాత్తు మహాగణపతి వారే ఉత్సవకమిటీ సభ్యుల్లో ఒకరికి కలలో దర్శనమివ్వడం చాలా సెన్సేషనల్ న్యూస్. ఈ న్యూస్ ని ముందుగానే మా రిపోర్టర్ ప్రేమ్ పసిగట్టేశాడు. అతను ఇంకా ఏమి చెబుతాడో విందాం. చెప్పు ప్రేమ్..

ప్రేమ్ : (విసుగ్గా) నన్ను చెప్పనివ్వు నాగ్. మధ్యలో అడ్డుపడకు. వినాయకస్వామివారు కలలో కనిపించి , వచ్చే ఏడాది తన విగ్రహం ఎత్తును తానే నిర్ణయించుకున్నాడట నాగ్. ఎప్పుడో 1954లో మొదలైన ఖైరతాబాద్ వినాయక ఉత్సవంలో ఏటికేడు విగ్రహం ఎత్తు పెరిగిపోతుండటంతో దాన్ని కొద్దికొద్దిగా తగ్గించాలను నిర్వాహకులు ముందుగా అనుకున్నారు. అయితే, ఇప్పుడు స్వామివారే కలలో కనిపించి తన విగ్రహ సైజ్ ను ఖరారు చేయడంతో ఇవ్వాళ ఉదయం కమిటీ సభ్యులు సమావేశమై వచ్చే ఏడాది గణనాథుని విగ్రహం ఎత్తును అంగుళానికి తగ్గించేస్తామని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్టు మనవద్ద సమాచారంఉంది నాగ్.

నాగ్ : (ఉత్సాహంగా) అతి పెద్ద ఖైరతాబాద్ విగ్రహాన్ని భక్తులు ఈ ఏడాది మాత్రమే చూడగలరు. వచ్చే ఏడాది నుంచి ఖైరతాబాద్ విగ్రహం సైజ్ గణనీయంగా తగ్గిపోతుంది. కేవలం ఒక్క ఇంచ్ ఎత్తులోనే 2016లో ఖైరతాబాద్ విగ్రహం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. మైక్రో విగ్రహం పై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా 60 అడుగుల నుంచి ఒక్క ఇంచ్ కి తగ్గించేదానికంటే, ప్రతిఏటా కొంతకొంత తగ్గించడమే మంచిదని కొందరు అంటుంటే, మరికొంత మంది కొండత భక్తి లేకపోయినా, కొండంత దేవుడ్ని చూసి మురిసిపోతున్నామనీ, ఒక్కసారిగా ఎత్తు తగ్గించేయడం బాగోలేదని అంటున్నారు.

ఇప్పుడే అందినవార్త… వినాయక విగ్రహం ఎత్తు బాగా తగ్గించినా తాము తయారుచేసే ప్రత్యేక కళ్లజోళ్లతో విగ్రహాన్ని 60అడుగులకంటే కూడా ఎత్తుగా ఉన్నట్టు కనబడేలా చేయవచ్చని వక్రవిజన్ సంస్థ చెబుతోంది. మరో పక్కన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ వార్తతో రిలాక్స్ ఫీలవుతున్నారు. ఖైరతాబాద్ వినాయకుని ఎత్తే అంగుళం ఉన్నప్పుడు మిగతా విగ్రహాలు దానికంటే తక్కువగానే ఉండవచ్చనీ, దీంతో ట్రాఫిక్ సమస్యలు అసలే ఉండవనీ అంటున్నారు. కాగా, కాలుష్య నివారణ సంస్థలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పుడు ప్రేక్షకులకు ఒక ప్రశ్న… ఖైరతాబాద్ వినాయకుని ఎత్తు అంగుళం ఉన్నప్పుడు ఆయన చేతిలోని తాపేశ్వరం లడ్డూ ఎంతసైజ్ లో ఉంటుందీ? దాన్ని ఎంతకి వేలంపాడే అవకాశం ఉంటుందో తెలియజేయండి.

ఇదీ ఇవ్వాళ్టి ఫేక్ న్యూస్. మరో ఫేక్ న్యూస్ తో మళ్ళీ కలుస్తాము. అంతవరకు సెలవు.

వింటున్న భక్తులకు ఒక కంట్లో భారీగణపతి, మరో కంట్లో బుల్లి గణపతి కనబడసాగారు.

– కణ్వస
kanvasa19@gmail.com

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close