వైఎస్సార్ కు సూరీడు.. జగన్ కు కేఎన్ఆర్..ఎవరీ కేఎన్ఆర్..?

సూరీడు గుర్తున్నాడా..? వైఎస్సార్ ఎంత పాపులారో ఆయన పక్కన కనిపించే సూరీడు కూడా అంతే. వైఎస్సార్ హయాంలో ఆయన నీడలా ఉండేవారు. వైఎస్సార్ మరణం తర్వాత సూరీడు జగన్ పక్కన ఉంటారని అంతా భావించారు.కానీ అలా జరగలేదు. సూరీడు- వైఎస్సార్ కాంబినేషన్ తరహాలో జగన్ పక్కన మరో యువకుడు దర్శనమిస్తున్నాడు. ఎన్నికల ప్రచార సభలో జగన్ పక్కనే ఉంటున్నారు.జగన్ కు అవసరమైన స్పీచ్ పేపర్లను అందించడం…ఆఖర్లో ఫ్యాన్ గుర్తును జగన్ చేతికి అందించడం రోజూ కనిపిస్తోంది. దీంతో జగన్ పక్కనున్న ఆ వ్యక్తి ఎవరని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు.

జగన్ పక్కన తరుచుగా కనబడుతోన్న వ్యక్తి పేరు.. నాగేశ్వర్ రెడ్డి. జగన్ వ్యక్తిగత కార్యదర్శి. కేఎన్ఆర్ అని పిలుస్తారు. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయనతోపాటే ఉంటున్నారు. నమ్మకస్తుడిగా మారటంతో ఆయనను అధికారికంగా పీఏగా సెలక్ట్ చేసుకున్నారు. కేఎన్ఆర్ కు జగన్ సైతం ప్రాధాన్యత ఇస్తారట.ఈయన ఎవరో కాదు… జగన్ సొంత జిల్లా కడపకు చెందినవాడే. జగన్ దగ్గర జాయిన్ అవ్వకముందు పలు మీడియా సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. జగన్ ఎంపీగా బాధ్యతలు చేపట్టాక దగ్గరై.. మన్ననలు పొంది పీఏగా అపాయింట్ అయినట్లు తెలుస్తోంది.

జగన్ ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్ప పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు కేఎన్ఆర్. జగన్ బాగోగులన్నీ ఆయన చూసుకున్నారని..జగన్ మనసును బట్టి వర్క్ చేయడం కేఎన్ఆర్ స్పెషల్. అందుకే చాలా తొందరగా జగన్ కు సన్నిహితుడిగా, నమ్మకస్తుడిగా మారాడని అంటుంటారు. జగన్ వ్యవహారాలను చక్కబెట్టడం..రోజూవారీ వ్యవహారాలను జగ్రత్తగా చూసుకుంటూ జగన్ కు కుటుంబ సభ్యుడిలా మారాడని అంటుంటారు. అందుకే జగన్ మిస్ అయ్యే కొన్ని కార్యక్రమాలకు తన ప్రతినిధిగా కేఎన్ఆర్ ను పంపుతారని వైసీపీ వర్గాల టాక్.

సాధారణంగా జగన్ ఎవరిని పెద్దగా విశ్వసించరని అంటుంటారు. ఒకవేళ విశ్వసిస్తే వాళ్ళ కోసం ఎంతవరకైనా తెగిస్తారని ఆయన సన్నిహితులు చెప్పేమాట. ఇది ఎంత నిజమో కాని, కేఎన్ఆర్ కోసం జగన్ గొడవకు కూడా దిగారట. సీఎం అవ్వకముందు వైజాగ్ విమానాశ్రయంలో జగన్ బైఠాయించిన సంగతి తెలిసిందే. ఈ గొడవ పెద్ద వివాదానికి దారి తీసింది. అయితే.. ఈ గొడవ కేఎన్ఆర్ గురించేనని తర్వాత తెలిసింది. జగన్ మీద దాడి జరిగిన సమయంలో.. నాగేశ్వర్ రెడ్డి పక్కనే ఉన్నారు. కేఎన్ఆర్ కు జగన్ ఇచ్చే ప్రాధాన్యతను చూసే చాలామంది నేతలు.. జగన్ ను కలిసేందుకు ముందుగా కేఎన్ఆర్ ను సంప్రదిస్తుంటారు.

వైఎస్సార్ – సూరీడు కాంబోలో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి – కేఎన్ఆర్ కాంబో తయారైందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close