మేఘాపై సీబీఐ కేసు – ఫ్రాడ్ రేంజ్ చాలా చిన్నదే !

హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థతో పాటు ఎన్ఎండీసీ ఐరన్ స్టీల్ ప్లాంట్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కు చెందిన 8 అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రూ. 315 కోట్ల మోసం జరిగిందని సీబీఐ గుర్తించింది. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఏ ఒక్కటి అయినా నీతి, నిజాయితీ, విలువలతో చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. గనుల్లో ఎప్పడు .. ఏ వ్యాపారం కోసం వేలు పెట్టిందో కానీ.. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినట్లుగా కనిపిస్తోంది.

నిజానికి మేఘా కంపెనీ రేంజ్ ను చూస్తే.. రూ. 315 కోట్ల మోసం కేసు అనేది చాలా చిన్న మొత్తం. కాళేశ్వరం ప్రాజెక్టు తవ్వితే వేల కోట్ల అవినీతి వెలుగులోకి వస్తుందని అందరూ చెబుతూంటారు. మేఘా చేసేది ఒక్క కాళేశ్వరం మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్లతో ముడిపడి ఉన్న ప్రతీ ప్రాజెక్టు మెగా చేతుల్లోనే ఉంది. ఇలా వచ్చిన కాంట్రాక్టులతో.. రకరకాల వ్యాపారాలకు విస్తరించింది. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత.. ఈ కంపెనీ అసలు గుట్టు అంతా బయటకు వస్తుందని అనుకుంటున్నారు. ఇంకా ఈ లెక్కలు బయటకు రాలేదు.

ఎలక్టోరల్ బాండ్స్ లో రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చిన కంపెనీల్లో ఊరూపేరూ లేని గేమింగ్ కంపెనీ తర్వాతి స్థానం మేఘాదే. ఎప్పటికీ సమాచారం బయటకు రాదనుకుని అధికార పార్టీలు అయిన బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీలకు పెద్ద ఎత్తున విరాళాలిచ్చారు. వీటి వెనుక లోగుట్టేమిటో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు.. అనూహ్యంగా ఓ కేసులో సీబీఐ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. అక్కడ్నుంచి కంపెనీ వ్యవహారాలన్నీ తవ్వుకుంటూ వచ్చి .. అసలు టార్గెట్ రీచ్ అవుతారా లేకపోతే.. ఇదేమైనా బెదిరింపు కేసా అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close