లారెన్స్‌- లోకేష్ క‌న‌గ‌రాజ్ ‘బెంజ్’

ద‌ర్శ‌కుడిగా లోకేష్ క‌న‌గ‌రాజ్‌కి స్టార్ డ‌మ్ వ‌చ్చేసింది. బ‌డా హీరోల‌తో ప్రాజెక్టులు ఫైన‌ల్ అవుతున్నాయి. ఒక్కో సినిమాకు క‌నీసం యేడాది తీసుకొంటున్నారు. ఈలోగా త‌న క‌థ‌ల్ని మిగిలిన ద‌ర్శ‌కుల‌కు ఇచ్చి ‘సేల్‌’ చేసుకొంటున్నారు. అందులో భాగంగా లారెన్స్‌కు ఓ క‌థ ఇచ్చేశారు. అదే ‘బెంజ్‌’.

ఈ చిత్రానికి భాగ్య‌రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సోమ‌వారం ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. ఇది వ‌ర‌కు ‘రెమో’, ‘సుల్తాన్’ చిత్రాల‌కు ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. రెండూ యావరేజ్ మార్క్ ద‌గ్గ‌రే ఆగిపోయాయి. అయితే.. ఇది లోకేష్ క‌థ‌. కాబ‌ట్టి.. క‌చ్చితంగా ఎగ‌స్ట్రా మైలేజ్ ద‌క్కే అవ‌కాశం ఉంది. `బెంజ్‌` అనే క్యాచీ టైటిల్ కూడా ఈ సినిమాకు ప్ల‌స్ అయ్యే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు ర‌మేష్ వ‌ర్మ కూడా లారెన్స్ కోసం ఓ క‌థ రెడీ చేసేశారు. ఆ సినిమా కోసం `శ్రీ‌రామ రాక్ష‌` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. స్క్రిప్టు ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. `బెంజ్‌` పూర్త‌యిన వెంటనే… ర‌మేష్ వ‌ర్మ సినిమా ప‌ట్టాలెక్కేఅవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close