పెళ్ళాం లేచిపోవడం ఏంటి? అని కొందరు హీరోలు రిజెక్ట్ చేశారు : ఆనంద్ దేవర కొండతో ఇంటర్వ్యూ

విజయ్ దేవర కొండ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఆనంద్ దేవర కొండ. నటుడిగా తొలి సినిమాకే ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘దొరసాని’ పెద్ద విజయం సాధించనప్పటికీ ఆనంద్ నటన, విజయ్ లానే మంచి వాయిస్ తో ఆకట్టుకున్నాడు. రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మేలోడిస్’ మాత్రం యూత్ ఫుల్ వినోదం అందించింది. ఇప్పుడు ‘పుష్పక విమానం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ వారం సినిమా విడుదల నేపధ్యంలో ఆనంద్ పంచుకున్న పుష్పక విమానం ముచ్చట్లు..

‘పుష్పక విమానం’ టైటిల్ పెట్టడానికి కారణం ?
‘పుష్పక విమానం’ అనగానే సింగీతం గారి క్లాసిక్ మోవీ గుర్తుకు వస్తుంది. మా సినిమా టైటిల్ అనుకున్నపుడు ఈ టైటిల్ ఒక ఆప్షన్ మాత్రమే. టైటిల్ రైట్స్ గురించి సింగీతం గారికి ఫోన్ చేసి పర్మిషన్ అడిగాం. అది తన టైటిల్ కాదని, పుష్పక విమానం అనేది మన ఇతిహాసాల్లోనే వుందని, దాన్ని ఎవరైనా టైటిల్ గా వాడుకొవచ్చని చెప్పారు. దీంతో సినిమాకి ‘పుష్పక విమానం’ పేరు ఖారారు చేసుకున్నాం. పెళ్లి అంటే అందమైన ప్రయాణం అనుకునే ఓ కుర్రాడి కధ ఇది. అలాగే హనీమూన్ కి సంబధించి పుష్పక్ అనే ట్రావెల్ ఏజెన్సీ కూడా వుంది. ఆ కోణంలో కూడా ఈ టైటిల్ యాప్ట్ గా వుంటుందని పెట్టాం.

‘పుష్పక విమానం’లోకి ఎలా వచ్చారు
దర్శకుడు దామోదర్ అన్నయ్యకి బాగా పరిచయం. మొదట అన్నయ్య కి ఈ కథ చెప్పారు. మొదట్లో సినిమాని ప్రోడ్యుస్ చేయాలనే ఆలోచన వుంది మాకు. నేను నిర్మాతగానే ఈ కథ విన్నా. చాలా మంది హీరోలకి పంపించాం. పెళ్ళాం లేచిపోవడం ఏంటి ? అని ఏ హీరో కూడా ముందుకు రాలేదు. దీంతో నేను చేయాలని నిర్ణయించుకున్నా.

మీరు బ్యాచిలర్ .. కానీ సినిమాలో భర్తగా కనిపిస్తున్నారు. ఛాలెంజింగా లేదా ?
చాలా సవాళ్ళు వున్నాయి. అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు. నాకు పెళ్లి ఏంటి ? ఆడియన్స్ ఆర్టిఫిషియల్ గా ఫీల్ అవుతారా ?అనే అనుమానం వచ్చి మొదట లుక్ టెస్ట్ చేశాం. ఓకే అనుకున్నా తర్వాతే సెట్స్ పైకి వెళ్లాం. ఇందులో భార్యతో ఎక్కువ కెమిస్ట్రీ వుండదు. పెళ్లి జరిగిన ఒక వారం లోనే భార్య వెళ్లిపోతుంది. సో.. యూత్ కూడా కనిపిస్తుంది.

ట్రైలర్ లో మొత్తం మీరే కనిపిస్తున్నారు ? హీరోయిన్ కి ప్రాధాన్యత లేదా ?
హీరోయిన్ కి చాలా ప్రాధాన్యత వుంది. సినిమా చూశాక మీరు సర్ప్రైజ్ అవుతారు. ఆమె పాత్ర లో ఒక జోష్ వుంది. ఇందులో చాలా వింత పాత్రలు వున్నాయి.

ట్రైలర్ చూపించిన కామెడీ సినిమా అంత ఉంటుందా ?
సినిమా అంతా కామెడీ వుంటుందని చెప్పాను కానీ థ్రిల్ వుంటుంది. భార్య లేచిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వం కదా. మనమే మొదట వెదుకుతాం. అలా వెదికే క్రమంలో వచ్చే సీన్స్ హిలేరియస్ గా వుంటాయి. ఎమోషన్స్ కూడా స్ట్రాంగ్ గా వుంటాయి.

మీ పాత్ర పై ప్రేక్షకులకి జాలి కలుగుతుందా ?
ఇందులో ఒక లూజర్ గా కనిపిస్తా. నన్ను నా పాత్రని చూసి వీడి కర్మరా బాబు అని జనాలు జాలి పడుతూ నవ్వుతారు

భార్య లేచిపోవడం లాంటి పాత్ర కమెడియన్స్ కి వుంటుంది ? కానీ హీరోగా చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ?
ఎక్కడో మార్పు రావాలి. అప్పుడే కొత్తదనం వస్తుంది. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావ్ లాంటి నటులు ఇలాంటి కథలు చేస్తుంటారు. మన దగ్గర కూడా ఇలాంటివి రావాలి. బయట మంచి కథలు వున్నాయి. కథ కొత్తగా వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. నేచురల్ సినిమాకి ఎప్పటికీ ఆదరణ వుంటుంది.

రెగ్యులర్ కాకుండా కొత్త తరహా సినిమాలు చేసే ఆలోచలోనే వున్నారా ?
ఏది చేసిన కొత్తగా చేయాలనే అనుకుంటా. గుహన్ దర్సకత్వంలో ఓ రోడ్ థ్రిల్లర్ చేస్తున్నా. ఇది తర్వాత మరో సినిమాలో అటో డ్రైవర్ గా కనిపిస్తా. కొత్త కంటెంట్ తో రావాలనే ప్రయత్నిస్తా.

విజయ్ కంటే మీరే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు ?
నా లైన్ ఎక్కువ వుటుందో ఏమో కానీ అన్నయ్యవి పెద్ద సినిమాలు కదా. షూటింగ్ డేస్ కూడా ఎక్కువ.

పెళ్లి పై మీ అభిప్రాయం ?
పెళ్లి అనేది వుండాలి. అది లేకపొతే ప్రపంచం కంట్రోల్ లో వుండదు. (నవ్వుతూ)

అల్ ది బెస్ట్
థ్యాంక్ యూ..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close