“కోడ్” అడ్డం వచ్చిందని పాదయాత్ర ఆపేసిన షర్మిల !

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర ఆపేశారు. నిన్న ఎన్నికలకోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఎక్కడెక్కడ పాదయాత్ర జరుగుందో కూడా మీడియాకు సమాచారం పంపారు. అయితే ఉదయమే ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల కోడ్ కారణంగా పాదయాత్ర వాయిదా వేస్తున్నానని మళ్లీ కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తామని ప్రకటించారు. నిరాటంకంగా 400 రోజుల పాటు పాదయాత్ర చేయాలనుకున్న ఆమె 22 రోజులకే మొదటి విరామం ఇవ్వాల్సి వచ్చింది.

చేవెళ్లలో ప్రజా ప్రస్థానం పేరుతో ప్రారంభమైన పాదయాత్రలో ప్రస్తుతం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లికి చేరుకుంది. ఏపీలో జగన్ రాజకీయం చేస్తూండగా తాను తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్న లక్ష్యంతో పార్టీ ఏర్పాటు చేశారు. పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఆమె పార్టీలో ఎవరూ సీనియర్లు లేకపోవడం.. పార్టీని ఎవరూ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. పాదయాత్రలో ఎవరూ పాల్గొనడం లేదని.. అరువు తెచ్చుకుంటున్న వారు మాత్రమే నడుస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయి.

ఈ కారణంగానే షర్మిల కూడా పాదయాత్రపై ఆసక్తి కోల్పోయారని చెబుతున్నారు. ప్రస్తుతం పాదయాత్ర వాయిదా వేయడంతో మళ్లీ ఎప్పట్నుంచి ప్రారంభిస్తారో క్లారిటీ లేదు. డిసెంబర్ పదిహేనో తేదీ తర్వాత ఎన్నికల కోడ్ ముగిసిపోతుంది కాబట్టి ఆ తర్వాత కొత్త వ్యూహంతో పాదయాత్రను ప్రారంభించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close