ఇంటర్వ్యూ : ఎన్టీఆర్‌ – ఫాన్స్‌ నుండి కొంత నెగెటివ్‌ రెస్పాన్స్‌ వచ్చిన మాట నిజమే.!

ఎన్టీఆర్‌, సుకుమార్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంపై ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యేలా సుకుమార్‌ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తీశారని ఎన్టీఆర్‌ చెప్తున్నారు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌. ‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతికి విడుదలవున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌తో తెలుగు360.కామ్ జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించడానికి రీజన్‌?
– ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. సుకుమార్‌గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన చెప్పిన లైన్‌ నచ్చింది. ఆయన మీద వున్న కాన్ఫిడెన్స్‌తోనే ఈ గెటప్‌కి నేను ఓకే చెప్పాను. ఆయన సినిమాలు రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా వుంటాయి. అలాంటి డిఫరెన్స్‌ ఈ సినిమాలో ఏదో వుంది అనిపించింది. అది నా డెసిషన్‌కి బాగా హెల్ప్‌ అయింది.

గెటప్‌ వేసుకున్న తర్వాత అద్దంలో చూసుకుంటే ఏమనిపించింది?
– మొదట భయమేసింది. అయితే రిమార్క్స్‌ మాత్రం పాజిటివ్‌గానే వున్నాయి. ఈ గెటప్‌ సుకుమార్‌గారికి ఫస్ట్‌ నుంచీ బాగా నచ్చింది. అమ్మకి నా గెటప్‌ చూసిన తర్వాత అసలు అర్థం కాలేదు. అభయ్‌ అప్పటికి చాలా చిన్నవాడు. నన్ను చూసి భయపడ్డాడు. ఇప్పుడు గడ్డం తీసిన తర్వాత గుర్తు పట్టడేమోనని భయపడ్డాను. కానీ, గుర్తుపట్టాడు.

ఈ గెటప్‌ గురించి ఫాన్స్‌ ఏమనుకుంటారో అనిపించలేదా?
– ఫాన్స్‌ విషయంలో చాలా భయపడ్డాము. ఒకటి కాదు రెండు కాదు బోలెడన్ని భయాలు. ఆ గెటప్‌తో ఫస్ట్‌ డే షూటింగ్‌కి వెళ్ళామో అప్పుడు అందరికీ విపరీతమైన కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఒక స్టిల్‌ తీసి షూటింగ్‌ స్టార్ట్‌ అయిందని న్యూస్‌ ఇచ్చాం. దానికి భయంకరమైన పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే మొత్తం పాజిటివే వచ్చిందని మాత్రం చెప్పను. కొంత నెగెటివ్‌ రెస్పాన్స్‌ కూడా వచ్చింది. మనకి చూడడానికి బాగానే వుంటుంది. కానీ, ఆడియన్స్‌ ఎంతవరకు యాక్సెప్ట్‌ చేస్తారు అని నాతో కలిసి వుండే నా మనుషులే అన్నారు. అయితే నాకు తెలిసి ఆ గెటప్‌ సినిమాలో ఒక్క నిముషమే వుంటుంది అంటే అందరూ హర్ట్‌ అవుతారు.

‘నాన్నకు ప్రేమతో’ అనే సాఫ్ట్‌ టైటిల్‌ పెట్టడానికి రీజన్‌?
– సుకుమార్‌గారి కాంబినేషన్‌లో సినిమా చేద్దామనుకున్నప్పుడు ‘నాన్నకు ప్రేమతో’ అనే కథే లేదు. సుకుమార్‌గారు అక్టోబర్‌లో ఒక లైన్‌ చెప్పారు. చాలా అద్భుతంగా వుంది. నాకు బాగా నచ్చి చేసేద్దాం అనుకున్నాము. దాని మీద వర్క్‌ చేయడం మొదలుపెట్టారు. ‘1 నేనొక్కడినే’ రిలీజ్‌ తర్వాత సుకుమార్‌గారి నాన్నగారి హెల్త్‌ అప్‌సెట్‌ అయింది. నిమ్స్‌లో వున్న సుకుమార్‌గారిని కలవడానికి ప్రసాద్‌గారి అబ్బాయి బాపి వెళ్ళాడు. అప్పుడు మనం అనుకున్న కథ కాదు వేరే కథతో సినిమా చేద్దామని సుకుమార్‌గారు అన్నారట. ఆ విషయం బాపి నాతో వచ్చి చెప్పాడు. దానిదేముంది కథ బాగుంటే అదే చేద్దాం అన్నాను. వాళ్ళ నాన్నగారి ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తయిన తర్వాత తిరిగొచ్చి అప్పుడు లైన్‌ ఇలా వుంటుంది అని చెప్పారు. చనిపోబోతున్న ఒక తండ్రి కోరిక. ఆ లైన్‌ వినగానే నేను బాగా కనెక్ట్‌ అయిపోయాను. ఈ లైన్‌ ఎప్పుడనుకున్నారు? అని అడిగాను. ఎప్పటి నుంచో వుంది కానీ అది ఇలా లేదు అన్నారు. మా నాన్నగారు చనిపోతుంటే ఆయనకు ఏదో డెడికేట్‌ చేద్దామనుకున్నాను అన్నారు. ఆ కమిట్‌మెంట్‌ నాకు బాగా నచ్చింది. నాకు తెలిసి ఇలాంటి ఆలోచన ఎవరికీ రాదేమో అనిపించింది.

ఈమధ్యకాలంలో మీలో వచ్చిన మార్పులు ఏమిటి?
– అభయ్‌ పుట్టిన తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి. నేను చాలా హైపర్‌గా వుండేవాడిని. కానీ, ఇప్పుడు చాలా కామ్‌ డౌన్‌ అయిపోయాను. అలాగే ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసిన తర్వాత వ్యక్తిగతంగా నాలో చాలా ఛేంజెస్‌ వచ్చాయి. ముఖ్యంగా అభయ్‌ కోసం చాలా మారాను. అంటే వాడు పెద్దయ్యాక నాకేదో చెయ్యాలన్న ఇంటెన్షన్‌ నాలో లేదు. కొడుకుగా వాడిపై నాకు వున్న ప్రేమ. ఈ సినిమాలో రన్‌ అయిన ప్రేమ నా రియల్‌ లైఫ్‌లో కూడా ప్లే అవుతోంది.

ఈ కథ చెప్పినపుడు చాలా ఎక్సైట్‌ అయ్యారు. మరి షూటింగ్‌ చేస్తున్నప్పుడు?
– షూటింగ్‌లో కూడా చాలా ఎక్సైట్‌ అయ్యాను. క్లైమాక్స్‌లో ఒక బిట్‌ వుంటుంది. దానికి ఐదు వెర్షన్స్‌ నాతో చేయించారు. ఈ బిట్‌లో నేను ఏడవాలి. ఫస్ట్‌ వెర్షన్‌లో రాజేంద్రప్రసాద్‌గారిని పట్టుకొని నిజంగానే ఏడ్చేస్తున్నాను. కట్‌ అన్న తర్వాత నేను మామూలుగా అవ్వడానికి 20 నిముషాలు పట్టింది. మా కెమెరామెన్‌ విజయ్‌ చక్రవర్తికి వాళ్ళ నాన్నగారంటే చాలా ఇష్టం. ఓ పక్కన అతను కూడా ఏడుస్తున్నాడు. అలా అందరం పర్సనల్‌గా బాగా కనెక్ట్‌ అయిపోయాం.

దేవిశ్రీప్రసాద్‌ నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ సినిమా రిలీజ్‌ పోస్ట్‌ పోన్‌ చెయ్యాలన్న ఆలోచన వచ్చిందా?
– అసలు పోస్ట్‌ పోన్‌ చెయ్యాలన్న ఆలోచనే లేదు. కానీ, నెక్స్‌ట్‌ ఏమిటి అనే క్వశ్చన్‌ మాత్రం వుంది. మేమంతా స్పెయిన్‌లో వున్నప్పుడు దేవి వాళ్ళ నాన్నగారు చనిపోయారన్న న్యూస్‌ తెలిసింది. దేవికి నేను మెసేజ్‌ చేసి సారీ చెప్పాను. రెండు రోజుల తర్వాత దేవి నాకు మెసేజ్‌ పెట్టాడు. స్టార్టెడ్‌ వర్కింగ్‌ ఎగైన్‌.. ఒక పాట పాడించేశాను.. డోన్ట్‌ వర్రీ అని మెసేజ్‌ పెట్టాడు. ఇలాంటి ఇన్సిడెంట్‌ తర్వాత కోలుకొని వర్క్‌ స్టార్ట్‌ చేశాడంటే వర్క్‌ పట్ల అతనికి ఎంత కమిట్‌మెంట్‌ వుంది అనేది అర్థమవుతుంది. అది వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చిన కమిట్‌మెంట్‌. ఈ ఇన్సిడెంట్స్‌ అన్నీ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో రిలేట్‌ అయి వున్నాయి. మన సినిమాలో కూడా ఇలాగే వుంది కదా అనిపించింది.

మీ క్యారెక్టర్‌లో రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ వుంటాయని తెలిసింది. ఎంతవరకు నిజం?
– అలాంటిది ఏమీ లేదు. సింగిల్‌ షేడ్‌ మాత్రమే వుంటుంది. తండ్రి ఆఖరి కోరిక కోసం పరుగులు తీసే ఒక కొడుకు. దానికి ఏ స్టేజ్‌కి అయినా వెళ్ళిపోతాడు అనేది కాన్సెప్ట్‌. ఈ స్టోరీ స్పాన్‌ 30 రోజులు. 30 రోజుల్లో ఒక మనిషి జీవితంలో ఏం జరిగింది అనేది కథ. సినిమా అంతా సింగిల్‌ షేడే వుంటుంది కానీ ఎక్కడా డబుల్‌ షేడ్‌ వుండదు.

ఈ సినిమా డిఫరెంట్‌గా వుంటుందని చెప్పారు. అంటే ఎలాంటి డిఫరెంట్‌ మూవీ ఇది?
– డిఫరెంట్‌ మూవీ అనగానే ఇది రెగ్యులర్‌ సినిమాలా కాకుండా ఎక్కడికో వెళ్ళిపోతుందా అనుకుంటారు. కానీ, డిఫరెంట్‌ అంటే డిఫరెంట్‌ ఇన్‌ ద మేకింగ్‌, డిఫరెన్స్‌ ఇన్‌ ద క్యారెక్టరైజేషన్స్‌, డిఫరెన్స్‌ ఇన్‌ ద డైలాగ్స్‌, డిఫరెన్స్‌ ఇన్‌ ద స్క్రీన్‌ప్లే… ఇవన్నీ కలిపితే ఇది ఒక డిఫరెంట్‌ మూవీ అయింది.

ఎన్టీఆర్‌ హిట్‌ సినిమాలు తీసిన డైరెక్టర్స్‌తోనే సినిమాలు చేస్తాడు అనే కామెంట్‌కి మీ సమాధానం?
– ఈ విషయాన్ని చాలా మంది నాకే ఆపాదిస్తుంటారు. ఎందుకో తెలీదు. ఈ విషయాన్ని క్లారిఫై చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎన్టీఆర్‌ హిట్‌ దర్శకులతోనే సినిమాలు చేస్తాడనే అభాండం వుంది. అంటే నేను డైరెక్టర్‌ని సెలెక్ట్‌ చేసుకున్న తర్వాత హిట్స్‌ తీసి నాతో ఫ్లాప్‌లు తీస్తున్నారా? లేదా సినిమా హిట్‌ అయిన తర్వాత నేను సెలెక్ట్‌ చేసుకుంటున్నానా అనేది తెలియడం లేదు. హిట్‌ డైరెక్టర్స్‌తోనే సినిమాలు చేస్తున్నానని చెప్పడం కరెక్ట్‌ కాదు. నేను బృందావనం చేసినపుడు వంశీ పైడిపల్లికి హిట్‌ లేదు. నేను ఈ సినిమా చేస్తున్నానంటే దీని ముందు సుకుమార్‌కి హిట్‌ లేదు. స్టూడెంట్‌ నెం.1, ఆది, నా అల్లుడు వంటి సినిమాలు చేసినపుడు ఆయా డైరెక్టర్లు అంతకుముందు హిట్‌ సినిమాలు తీసినవారు కాదు. నేను దీన్ని అస్సలు నమ్మను.

రెండు రాష్ట్రాల్లో కలిపి 2,000 స్క్రీన్స్‌ వున్నాయి. మరి ఈ సంక్రాంతికి రిలీజ్‌ అయ్యే సినిమాలకు ఇవి సరిపోతాయా?
– ఒకప్పుడు మన సినిమాలు సంవత్సరం ఆడాయి. ఆ తర్వాత 175 ఆడాయి. ఆ తర్వాత 100 రోజులు, ఆ తర్వాత 50 రోజులు.. ఇప్పుడు రెండు వారాలకు పడిపోయింది సినిమా. ఎన్ని రోజులు సినిమా ఆడిందన్నది కాదు, ఎంత కలెక్ట్‌ చేసిందనేది ముఖ్యం అనే స్థాయికి తెలుగు సినిమా వచ్చేసింది. అలాగే సినిమా సీజన్‌లో రిలీజ్‌ అవ్వాలనేది మరో ముఖ్యమైన పాయింట్‌ అయిపోయింది. మనకు సంక్రాంతి, సమ్మర్‌, దసరా.. ఇలాంటి సీజన్స్‌లో పెద్ద సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. ఈ మూడు సీజన్స్‌ మనకి ఇంపార్టెంట్‌. గతానికి వెళ్తే ఒకే సీజన్‌లో రెండు మూడు సినిమాలు హిట్‌ అయిన సందర్భాలు కూడా వున్నాయి. సీతమ్మ వాకిట్లో…, నాయక్‌ సినిమాలు సంక్రాంతికి రిలీజ్‌ అయి పెద్ద హిట్‌ అయ్యాయి. ఒకే సీజన్‌లో ఎక్కువ సినిమాలు రిలీజ్‌ అవ్వడం తప్పు కాదు. అన్ని సినిమాలూ హిట్‌ అవ్వాలి, అందరికీ మంచి జరగాలి అనేది నా ఒపీనియన్‌ అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో ఎన్టీఆర్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close