నాకూ ప్రభాస్ లా కొట్టాలని వుంటుంది : వైష్ణవ్‌ తేజ్‌ తో ఇంటర్వ్యూ

మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో అంటే సహజంగానే అంచనాలు పెరిగిపోతాయి. అయితే ఆ అంచనాలని తొలి సినిమా ఉప్పెనతో అందుకున్నాడు వైష్ణవ్‌ తేజ్‌. ఉప్పెన మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు దర్శకుడు క్రిష్ తో జత కట్టాడు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ హీరో ‘కొండపొలం’ తెరకెక్కింది. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో వైష్ణవ్‌ తేజ్‌ చెప్పిన కొండపొలం కబుర్లు ఇవే..

దర్శకుడు క్రిష్ సినిమా కధ చెప్పినపుడు ఎలా ఫీలయ్యారు ?
కధ చాలా బాగా నచ్చింది. నా జీవితంలో ఎప్పుడూ కొండపొలం చూడలేదు. కధ చెప్పినపుడే కొత్త అనుభూతికి లోనయ్య. సినిమా చూసిన తర్వాత మీకూ కొత్త అనుభూతి లభిస్తుందనే నమ్మకం వుంది.

క్రిష్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
నాకు ఇష్టమైన దర్శకుడు క్రిష్. గమ్యం నా ఫేవరేట్. ఆయన సినిమాలు చాలా లోతుగా వుంటాయి. అలాంటి ఫిల్మ్ మేకర్ తో పని చేయడం మంచి అనుభూతి

ఈ ప్రాజెక్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ?
నాకు చిన్నప్పటి నుంచి ఆయన సపోర్ట్ వుంది. హరిహర వీరమల్లు గ్యాప్ లో ఆయన పర్మిషన్ తోనే కొండపోలం చేశాం. మొన్న వెళ్లి కలిశా. ఆల్ ది బెస్ట్ చెప్పారు.

కరోనా సమయంలో షూటింగ్ చేయడం కష్టంగా అనిపించిందా ?
కష్టం ఏమీ లేదు. కానీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కొండపొలం వద్ద షూటింగ్ చేసినప్పుడు మాత్రం కొన్ని సామాన్లు అందరితో పాటు నేనూ కొండపైకి మోసా.

ఈ సినిమాలో మీ పాత్ర గురించి ?
ఒక్క మాటలో చెప్పలేను. మంచి క్యారెక్టర్ జర్నీ. ఇందులో రవీంద్ర యాదవ్ పాత్రలో కనిపిస్తా. ఆ పాత్రతో ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఈ పాత్ర కోసం యాస విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నాం.

మొదటి సినిమాలో అందరూ కొత్త వాళ్ళు. ఇప్పుడు అంతా అనుభవం వున్న వాళ్ళు. ఎలా అనిపించింది ?
ఈ విషయంలో నేను చాలా లక్కీ. చాలా అనుభవం వున్న టీం దొరికింది. ఈ పాత్ర కోసం క్రిష్ గారు నన్ను తీసుకోవడం చాలా థ్రిల్లింగా అనిపించింది. కొండపొలంలో చాలా నేర్చుకున్నా.

సాయి చంద్, కోటా గారి గురించి ?
సాయి చంద్ గారు వండర్ ఫుల్ యాక్టర్. చాలా ఇన్స్పైర్ చేస్తారు. ఇక కోటాగారిని చూసి షాక్ అయ్యా. అంత వయసులో కూడా సెట్స్ లోకి వచ్చి ఆయన డైలాగ్ పొల్లుపోకుండా చెబుతుంటే అద్భుతమనిపించింది.

ఇప్పటివరకూ చేసిన రెండు కూడా ప్రయోగాత్మకమైన సినిమాలే. మూడో సినిమా ఎలా ప్లాన్ చేస్తున్నారు ?
మంచి కధ కావాలి. అలా అని పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలకు దూరం అని కాదు. సినిమాలు చూసేటప్పుడు ప్రభాస్ లా కొట్టాలని నాకూ వుంటుంది( నవ్వుతూ). మా ఇంట్లో కూడా నన్ను కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలో చూడడానికి ఇష్టపడతారు.

మీకు గొర్రెల సైకాలజీ వచ్చిందట.. క్రిష్ గారు చెప్పారు ?
హహ.. షూటింగ్ లో దాదాపు వెయ్యి గొర్రెలు వున్నాయి. రోజూ వాటితో గడపటంతో కొన్ని విషయాలు తెలిసాయి. వాటికి పచ్చళ్ళు, చట్నీలు బాగా ఇష్టం. వాసన చూపించిన వైపు వస్తాయి. వాటి దారి మళ్లించాలంటే వాసనతో డైవర్ట్ చేయొచ్చు. ఒకరోజు క్రిష్ గారికి చేసి చూపించా. అందుకే నాకు గొర్రెల సైకాలజీ వచ్చని చెప్పుంటారు.

తేజు అన్నయ్య ఎలా వున్నారు ?
అన్నయ్య బావున్నాడు. ఫిజియోథెరపీ జరుగుతుంది. కొన్ని రోజుల్లో పూర్తిగా బయటికి వచ్చేస్తాడు.

రిపబ్లిక్ లో అన్నయ్య తేజు కలెక్టర్ గా కనిపించారు. కొండపోలంలో కూడా మీ పాత్ర అదే .. ఎలా అనిపిస్తుంది ?
రెండు కలెక్టర్ పాత్రలే అయిన ప్రయాణం వేరు. రెండు పాత్రలకు ఎలాంటి పోలికలు లేవు. రేపు థియేటర్ లో మీరే చూస్తారు.

కొత్త సినిమా కబుర్లు ?
గిరీసయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న. కొన్ని కధలు వింటున్న.

అల్ ది బెస్ట్
థ్యాంక్ యూ..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ప రిలీజ్ డేట్‌…. త‌గ్గేదే లే!

డిసెంబ‌రులో పెద్ద సినిమాల జాత‌ర రాబోతోంది. అఖండ‌తో డిసెంబ‌రు జోరు మొద‌లు కాబోతోంది. డిసెంబ‌రు 17న పుష్ప‌, ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ రాబోతున్నాయి. అయితే పుష్ప రిలీజ్‌కొంచెం క‌ష్ట‌మ‌ని, డేట్ మారే...

జాతీయ అవార్డు గ్ర‌హీత‌.. శివ శంక‌ర్ మాస్ట‌ర్ మృతి

తెలుగు చిత్ర‌సీమ మ‌రో ప్ర‌తిభావంతుడ్ని కోల్పోయింది. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో క‌ళాకారుడ్ని బ‌లి తీసుకుంది. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కుడు శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న...

దేశంలో ఇక “ఒమిక్రాన్” అలజడి !

కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న విమానాల విషయంలో మాత్రం ఆంక్షలు విధించలేదు. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడిన దేశాల నుంచి...

సీఎస్‌గా సమీర్ శర్మ మరో ఆరు నెలలు !

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. బెంగాల్‌లో చీఫ్ సెక్రటరీ పొడిగింపు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ చీఫ్ సెక్రటరీల...

HOT NEWS

[X] Close
[X] Close