మంచు మేనిఫెస్టో : గెలిపిస్తే “అర్హులైన సభ్యులకు” అన్నీ !

“మా” ఎన్నికల్లో గెలిపిస్తే సభ్యులకు సినిమా అవకాశాలు కల్పించడం దగ్గర్నుంచి.. వారి పిల్లల చదువులకు , పెళ్లిళ్ల వరకూ అన్నింటికీ సాయం చేస్తామని మంచు విష్ణు ప్రకటించారు. ఈ మేరకు ఆయన పార్క్ హయత్ హోటల్‌లో మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం అందులో పధ్నాలుగు అంశాలు పెట్టారు. అందులో మొదటిది సభ్యులకు సినిమా అవకాశాలు కల్పించడం. ప్రత్యేకంగా యాప్ తయారు చేయిస్తానని అందరికీ అందుబాటులో ఉంచి.. అవకాశాలు కల్పిస్తామని విష్ణు ప్రకటించారు. జాబ్ కమిటీ వేసి అన్ని ప్రొడక్షన్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వద్దకు వెళ్లి ఒప్పందం చేసుకుంటామని చెప్పుకొచ్చారు.

“మా” భవనాన్ని సొంత డబ్బుతో నేను కడతానని అందు కోసం మూడు స్థలాలు చూశానని ప్రకటించారు. అయితే మేనిఫెస్టోలో సొంత డబ్బుతో కడతానని చెప్పలేదు. ఇక “అర్హులు” అనే పదం వాడి పలు హమీలు ప్రకటించారు. వాటిలో ప్రభుత్వంతో మాట్లాడి సొంత ఇల్లు ఇవ్వడం, ఉచిత వైద్యం, పిల్లల పెళ్లిళ్లకు సాయం, చదవులకు సాయం వంటివి ఉన్నాయి. అర్హులైన సభ్యుల పెళ్లి ఖర్చుల కోసం 1.16 లక్షలు “మా” తరఫున ఇస్తామన్నారు. వృద్ధకళాకారుల సంక్షేమం కోసం ఎన్‌జీవో సర్వే చేయించి అర్హులకు పింఛను అందిస్తామన్నారు.

“మా” చరిత్రలో తొలిసారిగా మహిళల రక్షణ కోసం హైపవర్ ఉమెన్ గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కొందరకి మాలో సభ్యత్వం ఉన్నా ఓటు హక్కు లేదని వారికి ఓటు హక్కు కల్పిస్తామని ప్రకటించారు. “మా” ఉత్సవాలు నిర్వహించి ఫండ్ సేకరించి.. వాటిని మంచి పనులకు ఉపయోగిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర పథకాలకు మా సభ్యులు అర్హులు అయితే వారికి అందేలా ప్యానల్ కృషి చేస్తుందని ప్రకటించారు. జూన్‌లో మోహన్ బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించి .. మా సభ్యులకు సగం స్కాలర్ షిప్ ఇస్తామని హామీ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ప రిలీజ్ డేట్‌…. త‌గ్గేదే లే!

డిసెంబ‌రులో పెద్ద సినిమాల జాత‌ర రాబోతోంది. అఖండ‌తో డిసెంబ‌రు జోరు మొద‌లు కాబోతోంది. డిసెంబ‌రు 17న పుష్ప‌, ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ రాబోతున్నాయి. అయితే పుష్ప రిలీజ్‌కొంచెం క‌ష్ట‌మ‌ని, డేట్ మారే...

జాతీయ అవార్డు గ్ర‌హీత‌.. శివ శంక‌ర్ మాస్ట‌ర్ మృతి

తెలుగు చిత్ర‌సీమ మ‌రో ప్ర‌తిభావంతుడ్ని కోల్పోయింది. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో క‌ళాకారుడ్ని బ‌లి తీసుకుంది. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కుడు శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న...

దేశంలో ఇక “ఒమిక్రాన్” అలజడి !

కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న విమానాల విషయంలో మాత్రం ఆంక్షలు విధించలేదు. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడిన దేశాల నుంచి...

సీఎస్‌గా సమీర్ శర్మ మరో ఆరు నెలలు !

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. బెంగాల్‌లో చీఫ్ సెక్రటరీ పొడిగింపు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ చీఫ్ సెక్రటరీల...

HOT NEWS

[X] Close
[X] Close