తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిని కల్తీ చేసిన ముఠా గుట్టు రట్టు అయ్యే సమయం దగ్గర పడింది. ప్రణాళిక ప్రకారం సీబీఐ సిట్ దర్యాప్తు చేస్తోంది. ఒకరి తరవాత ఒకరు.. లింకుల్ని పట్టుకుని ప్రధాన సూత్రధారి వద్దకు వెళ్తోంది. ప్రతి కేజీ నెయ్యికి రూ. 25 కమిషన్ అందుకున్నారని తేలింది. ఆ కమిషన్ ఎవరికి చేరిందన్నది తేల్చడానికి సిట్ దర్యాప్తు చేస్తోంది. ఆ దశకు దగ్గరగా ఉన్నట్లుగా పరిణామాలు నిరూపిస్తున్నాయి. త్వరలోనే ఈ కమిషన్ అందుకున్న వారి గుట్టు రట్టు చేసి .. కేసును క్లోజ్ చేయనున్నారు.
చిన్న అప్పన్న, జీఎం అన్నీ చెప్పేస్తున్నారు !
చిన్న అప్పన్న అనే సుబ్బారెడ్డి మాజీ పీఏ, ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం అన్నీ సీబీఐ సిట్ కు చెప్పేస్తున్నారు. చిన్న అప్పన్న కేవలం ఓ మధ్యవర్తి. ఆయనకు ఒకరు ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం వ్యవహరించే వ్యక్తి. అంతకు మించి ఆయనకు ఏమీ తెలియదు. ఆయన బెదిరించమన్నవారిని బెదిరించారు.. డబ్బులు వసూలు చేయాలన్న దగ్గర వసూలు చేశారు. ఆయనకు ఎవరు ఆదేశాలు ఇచ్చారన్నది తేలాల్సి ఉంది. ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం పూర్తిగా సుబ్బారెడ్డి గురించే చెప్పారు. ఆయన చైర్మన్ అని.. ఆయన చెప్పినట్లు చేయకపోతే ఉద్యోగాలు ఉండవని అందుకే ఆయన చెప్పినట్లుగా చేశానన్నారు.
అన్ని అనుమానాలు సుబ్బారెడ్డి దగ్గరకే !
నెయ్యి కల్తీ వ్యవహారంలో సుబ్బారెడ్డి దగ్గరకు అన్ని దారులూ వెళ్తున్నాయి. ఇప్పటికి కస్టడీలో కెమికల్ సరఫరా చేసిన వారిని ప్రశ్నిస్తున్నారు. ఆ లింకులు కూడా బయటకు వస్తున్నాయి. హవాలా మార్గంలో పెద్ద ఎత్తున డబ్బులు సూత్రధారికి చేరాయని సిట్ గుర్తించింది. ఆ సూత్రధారి ఎవరో కూడా క్లారిటీ ఉంది. ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే స్టెప్ బై స్టెప్ విచారణలో భాగంగా వెళ్తున్నారు. ఇప్పుడు చివరి స్టెప్ కు చేరుకునేందుకు సమయం దగ్గర పడిందని భావిస్తున్నారు. చివరి సూత్రధారిని అరెస్ట్ చేసి విచారణను ముగించే అవకాశం ఉంది.
మరో నెలలో సంచలన విషయాలు వెలుగులోకి !
దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసి దోపిడీ చేయడానికి ఏ మాత్రం వెనుకాడని వారు .. ఇపుడు రకరకాల డ్రామాలు వేస్తున్నారు. వారెవరు.. ఏంటి అనేది సామాన్య ప్రజలకు క్లారిటీ ఉంది. ఆధారాలతో సహా సిట్ బయటపెట్టి చర్యలు తీసుకుంటే ఆ ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. మరో నెలలో నెయ్యి కుట్రదారులంతా.. బయటకు వస్తారు. ప్రజల ముందు నిలబడతారు. దేవుడి ముందు తాము ఓడిపోయామని ముఖాన్ని చేతుల్లో దాచుకుని కుమిలిపోవాల్సిన పరిస్థితికి వస్తారు.