ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చి జగన్ ఉన్నప్పుడు అరాచకశక్తిగా వ్యవహరించి తర్వాత బీహార్ వెళ్లిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్.. కులం వెనుగ దాక్కుంటున్నారు. పోలీసులు అరెస్టు చేయడానికి చేసిన ప్రయత్నంపై ఆయన సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. తాను లంబాడీనని.. తన వర్గం నుంచి ఎవరూ ఉన్నత స్థానానికి ఎెదుగకూడదా అని డైలాగ్ చెప్పారు. లంబాడా అయితే.. చట్టాలను గౌరవించకూడదని.. విచారణకు రాకూడదని ఎక్కడా లేదు.
తనపై వస్తున్న ఆరోపణలు, నమోదైన కేసులపై ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. 2021లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి, 2024లో నమోదైన ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకపోయినా, కావాలనే తనను ఈ కేసులోకి లాగారని సునీల్ నాయక్ ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన పేర్కొన్నారు. రఘురామ తనకు ఫోన్ చేసి, మాజీ ముఖ్యమంత్రి , పీవీ సునీల్ కుమార్‌లకు వ్యతిరేకంగా మాట్లాడాలని, లేదంటే కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు ఆరోపించారు. అయితే తనకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ వివరాలను బయట పెట్టాల్సిన సునీల్ నాయక్.. రఘురామ కృష్ణంరాజు కాల్ డేటాను విశ్లేషిస్తే, ఈ కేసులో ఎంత మందిని బెదిరించారో, ప్రభావితం చేశారో వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు.
ఎవరిపై చేశారో అర్థం కాకుండా కొంత మందిపై సునీల్ నాయక్ ఆరోపణలు చేశారు. ఓ శుభకార్యం పేరుతో 4 కోట్ల రూపాయల విలువైన బంగారం బహుమతులు పొందినా విచారణ లేదు. హెచ్డీఎఫ్సీ మేనేజర్‌ను అడ్డం పెట్టుకుని చేసిన భూదందాలపై చర్యలు లేవు. ఇసుక, గ్రానైట్ మైనింగ్ దందాలపై ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదని ప్రశ్నించారు. తమ వద్ద అన్ని ఆధారాలు, ఫోన్ కాల్ రికార్డింగ్‌లు ఉన్నాయని, ప్రస్తుతం వ్యవహారం కోర్టులో ఉన్నందున సరైన సమయంలో వాటన్నింటినీ బయటపెడతానని సునీల్ నాయక్ స్పష్టం చేశారు. తన తల్లిని అవమానించిన వారిని చట్టం ముందు నిలబెడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
చట్టం మీద ఆయనకు అంత నమ్మకం ఉంటే.. విచారణకు సహకిరంచాల్సి ఉంది. రాజకీయ బాసులు ఇచ్చే తాయిలాల కోసం అడ్డగోలుగా వ్యవహరించి.. కనీసం విచారణకు సహకరించకుండా.. పదవిలో ఉన్పన్నప్పుడు ఓ ఎంపీపై హత్యాయత్నం చేసి.. ఇప్పుడు ఆయన కులం గురించి మాట్లాడుతున్నారు. అణగారిన వర్గాల నుంచి ఎదిగితే.. రోల్ మోడల్ గా ఉండాలి కానీ ఇలాంటి వ్యవహారాలతో వివాదాస్పందా మారి.. చట్టానికి సహకరించకుండా.. సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తే.. గొప్పతనం అవుతుందా అన్న కామెంట్లు సోషల్ మీడియా నుంచి వస్తున్నాయి.
