బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనపై ఉన్న కేసులో విచారణకు హాజరు కావాలని ఆయనకు ఎన్ని సార్లు నోటీసులు పంపినా.. ఇదిగో అదిగో అని చెప్పి తప్పించుకున్నారు. చివరికి పోలీసులు అరెస్టు చేయడానికి పట్నాకు వెళితే అక్కడా సహకరించలేదు. కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ను రిజెక్ట్ చేయడంతో.. వెంటనే ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అక్కడ్నుంచే ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
జగన్ సీఎం అయ్యాక.. ఏపీ క్యాడర్‌కు డిప్యూటేషన్ పై వచ్చిన ఆయన సీఐడీలో ఉండి.. టీడీపీ నేతల్ని వేటాడటమే పనిగా పెట్టుకున్నారు. స్వయంగా తామే ఫిర్యాదులు చేసి..తామే కేసులు పెట్టి అరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టేవారు. రఘురామపై దేశద్రోహం కేసును సునీల్ నాయకే పెట్టారు. ఇప్పుడు ఆయన రఘురామను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లుగా కేసు నమోదు కావడంతో ఇతరులపై అవినీతి ఆరోపణలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చట్టం చేతులు ఎంత పొడవు ఉంటాయో.. ఐపీఎస్ ఆఫీసర్ అయిన సునీల్ నాయక్ ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. విచారణకు సహకరించకుండా..లేనిపోని ఆరోపణలు చేస్తూ.. రాజకీయం చేస్తున్నారు. కులం అడ్డం పెట్టుకుని బయటపడాలనుకుంటున్నారు. ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే.. పోలీసులు సాంకేతిక అంశాలను క్లియర్ చేసి మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉంది.
