BBB బాల‌య్య‌+బ‌న్నీ+బోయ‌పాటి

ఇది అస‌లే మ‌ల్టీస్టార‌ర్ల కాలం. ఎప్పుడు ఏ హీరో, ఏ హీరోతో క‌లిసి న‌టించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. క‌థ రెడీ అయితే చాలు, రంగంలోకి దిగిపోతున్నారు హీరోలు. అందులోనూ ఓ అగ్ర ద‌ర్శ‌కుడు పూనుకుంటే, ఇక చెప్పేదేముంది? అందులో భాగంగానే త్వ‌ర‌లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చూసే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ‌, అల్లు అర్జున్‌ల‌తో.. బోయ‌పాటి శ్రీ‌ను ఓ సినిమా రూపుదిద్దుకొనే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. బాల‌య్య అంటే బోయ‌పాటి, బోయ‌పాటి అంటే బాల‌య్య అన్న‌ట్టు త‌యారైంది ప‌రిస్థితి. ఇద్ద‌రూ క‌లిస్తే.. రికార్డుల వేటే అన్న‌ది అఖండ‌తో మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది. బోయ‌పాటి ఏం చెప్పినా, చేసేసేందుకు బాల‌య్య రెడీ. మ‌రోవైపు బ‌న్నీతోనూ అలాంటి అనుబంధ‌మే ఉంది. స‌రైనోడుతో ఓ అదిరిపోయే హిట్ ఇచ్చాడు బోయ‌పాటి. ఇప్పుడు మ‌రోసారి బ‌న్నీతో క‌లిసి సినిమా చేయ‌బోతున్నాడు. బోయ‌పాటి ద‌గ్గ‌ర ఓ మ‌ల్టీస్టార‌ర్ కథ ఉంద‌ట‌. అది బాల‌య్య‌, బ‌న్నీల‌కు ప‌ర్‌ఫెక్ట్ గా స‌రిపోతుంద‌ని తెలుస్తోంది.

బాల‌య్య‌, బ‌న్నీ, బోయ‌పాటి.. ఈ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుందా? అనే ప్ర‌శ్న‌కు బోయ‌పాటి నేరుగా స‌మాధానం చెప్ప‌లేదు కానీ.. ఆశాజ‌నిత‌మైన ఆన్స‌రే ఇచ్చాడు. “ఇక్క‌డ ఇది జ‌ర‌గ‌దు అది జ‌ర‌గ‌దు అని లేదు. ఏదైనా జ‌రగొచ్చు…“ అని హింట్ ఇచ్చేశాడు. బోయ‌పాటి ద‌గ్గరైతే మ‌ల్టీస్టారర్ క‌థ ఉంది. అది చేయ‌డానికి బాల‌య్య రెడీనే. మ‌రి బ‌న్నీ ఏమంటాడో చూడాలి. `అన్‌స్టాప‌బుల్‌`తో అల్లు కుటుంబంతో బాల‌కృష్ణ‌కు అనుబంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో బాల‌య్య‌, బ‌న్నీ, బోయ‌పాటి కాంబో… అసాధ్య‌మేం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close