ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉంటారా..? బీసీలకు చాన్సిస్తారా..?

తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలందరూ… 29వ తేదీన సమావేశం కాబోతున్నారు. ఆ రోజు… తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. సహజంగా అయితే.. చంద్రబాబునాయుడు… తెలుగుదేశం పార్టీ తరపున ప్రతిపక్ష నేతగా ఉంటారు. కానీ ఈ సారి ఆయన ఉండే అవకాశాలు తక్కువేనన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఈ సారి… మరొకరికి చాన్సిచ్చి.. తాను సూపర్ విజన్ చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉంటారా..?

తెలుగుదేశం పార్టీకి ఈ సారి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ప్రతిపక్షం అంత బలంగా ఏమీ లేదు. అదే సమయంలో… సభలో ఎవరు స్పీకర్‌గా ఉన్నా… ప్రతిపక్షానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే.. గత అసెంబ్లీలో తమకు అవకాశాలు ఇవ్వలేదని.. వైసీపీ చాలా కాలం వాదించింది. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల పోరాటం శృతి మించినప్పటికీ… వారు వెనక్కి తగ్గలేదు. తర్వాత బాయ్ కాట్ చేసేశారు. అయితే.. టీడీపీ నేతలు మాత్రం… ఆ తరహా పోరాటం చేసే అవకాశం లేదు. అసెంబ్లీకి వారు వెళ్లే అవకాశాలే ఎక్కువ. వీలైనంత వరకూ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నిస్తారు. కానీ.. చంద్రబాబు సీన్‌లో ఉంటారా అన్నదే ఆసక్తికరం.

పోరాడే బీసీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తారా..?

చంద్రబాబు.. ఈ సారి ప్రతిపక్ష నేతగా ఉండటం కన్నా.. ఓ డైనమిక్ ఎమ్మెల్యేకు.. ఆ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ బీసీ ఎమ్మెల్యేను ప్రతిపక్ష నేతను చేస్తే.. బాగుంటుందన్న చర్చ.. టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి అచ్చెన్నాయుడు.. బీసీ వర్గాల నుంచి.. ఎన్నికయ్యారు. ఆయనకు శాసనసభా వ్యవహారాల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉంది. మంచి వాగ్ధాటి ఉంది. దేన్నైనా తిప్పికొట్టగలిగే సామర్ధ్యం ఉంది. చంద్రబాబు .. ప్రతిపక్ష నేతగా ఉండదల్చుకోకపోతే… అచ్చెన్నాయుడు మంచి చాయిస్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టీడీపీకి మద్దతుగా ఉన్న సామాజికవర్గంపై.. అన్ని కులాలను రెచ్చగొట్టారని.. అందుకే ఇంత ఘోరమైన ఫలితాలొచ్చాయన్న విశ్లేషణ జరుగుతోంది. ఈ సమయంలో.. బీసీ అభ్యర్థికి ప్రతిపక్ష నేతగా చాన్సివ్వడం… రాజకీయంగానూ మంచిదే కావొచ్చు.

టీడీపీ తరపున గెలిచిన వారిలో అత్యధికం ఒకే సామాజికవర్గం..!

అదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన 23 మందిలో.. అత్యధికలు… చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే. రాయలసీమలో గెలిచిన ముగ్గురు, ప్రకాశం జిల్లాలో గెలిచిన నలుగురిలో ముగ్గురు , కృష్ణా జిల్లాలో గెలిచిన ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లాలో గెలిచిన ముగ్గురిలో ఇద్దరు, విశాఖలో గెలిచిన నలుగురిలో ఒకరు… అదే సామాజికవర్గానికి చెందిన వారు. అంటే.. పదకొండు మంది మాత్రమే.. ఇతర సామాజికవర్గాల వారున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రాధాన్యతల లెక్క ప్రకారం చూసుకున్నా… టీడీపీ.. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు లేకపోతే.. బీసీలకు చాన్సిస్తే మంచిదన్న చర్చ టీడీపీలో నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close