చిరు వెన‌క్కి ఇచ్చింది రూ.10 కోట్లేనా?

ఆచార్య డిజాస్ట‌ర్ త‌ర‌వాత‌… అస‌లు లెక్క‌లు ఒకొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ సినిమా ఎన్ని న‌ష్టాలు మిగిలిచ్చింది? చివ‌రికి ఆ భారాన్ని ఎవ‌రు మోస్తున్నారు? అనే విష‌యాలు తేట‌తెల్లం అవుతున్నాయి. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ అనే పేరు పోస్ట‌ర్‌పై క‌నిపిస్తున్నా.. పెట్టుబ‌డి పెట్టింది మాత్రం… మాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌నే. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. చిరు, చ‌ర‌ణ్‌లు త‌మ వాటాగా దాదాపుగా రూ.50 కోట్లు తీసుకెళ్లారు. అది కాకుండా.. ప్రొడ‌క్ష‌న్ రూ.70 కోట్ల‌కు తేలింది. ఆ రూ.70 కోట్లూ.. మాట్నీకి తిరిగి ఇచ్చేసి.. సినిమా క‌మ‌ర్షియ‌ల్ వ్య‌వ‌హారాల్ని కూడా కొర‌టాల నెత్తిమీద వేసుకున్న‌ట్టు స‌మాచారం. అంటే.. ఈ సినిమా విష‌యంలో అటు మాట్నీకి, ఇటు కొణిదెల ప్రొడ‌క్ష‌న్‌కి ఎలాంటి సంబంధ‌మూ లేదు. ఇప్పుడు బ‌య్య‌ర్ల‌ని ఆదుకోవాల్సిన బాధ్య‌త కూడా కొర‌టాల‌పైనే ప‌డింద‌ని తెలుస్తోంది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాని కొర‌టాల స‌న్నిహితులే రిలీజ్ చేశారు. వాళ్లంద‌రికీ ఇప్పుడు స‌ర్దుబాటు చేయాల్సిన బాధ్య‌త కొర‌టాల శివ‌పై ప‌డింది. ఈ మేర‌కు ఓ బ‌య్య‌ర్‌.. చిరంజీవికి ఓపెన్ లెట‌ర్ రాసి, త‌మ‌ని ఆదుకోవాల‌ని కోరాడు. అయితే ఇప్ప‌టికే చిరు నుంచి రూ.10 కోట్లు వెన‌క్కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. త‌న పారితోషికం నుంచి ఈ రూ.10 కోట్ల‌ని చిరు తిరిగి ఇచ్చేశాడ‌ని టాక్‌. అయితే ఈ రూ.10 కోట్లు ఎంత మాత్ర‌మూ స‌రిపోవు. ఆయ‌న నుంచి ఇంకా వ‌స్తాయ‌న్న ఆశ‌తో బ‌య్య‌ర్లు ఉన్నారు. చిరు ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయ‌న తిరిగొచ్చాక‌.. బ‌య్య‌ర్ల‌తోనూ, కొర‌టాల‌తోనూ ఓ కీల‌క‌మైన మీటింగ్ జ‌ర‌గ‌బోతోంద‌ని టాక్. ఆ త‌ర‌వాత‌.. చిరు న‌ష్టాల భ‌ర్తీ చేస్తార‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close