మంచు ఇంట్లోంచి.. సింగ‌ర్స్ వ‌చ్చారు

మంచు ఫ్యామిలీలోని వాళ్లంతా సినిమాల‌తో మ‌మేకం అయిన‌వాళ్లే. నిర్మాణ రంగంలోనూ క‌నిపిస్తున్నారు. మోహ‌న్ బాబు, మ‌నోజ్‌, విష్ణు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌.. వీళ్లంతా నిర్మాత‌లే. వీళ్ల‌లో విష్ణు త‌ప్ప‌.. అంద‌రూ పాట‌లు పాడేశారు. ఇప్పుడు వీళ్ల ఇంట్లోంచి మ‌రో ఇద్ద‌రు గాయ‌కులు వ‌చ్చారు. వాళ్లే… అరియానా, వివియానా. విష్ఱు కుమార్తెలు ఇప్పుడు ఓ సినిమా కోసం పాట పాడారు. విష్ణు హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `గాలి నాగేశ్వ‌ర‌రావు`. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ హీరోయిన్లు గా న‌టిస్తున్నారు. ఈ సినిమా కోస‌మే అరియానా, వివియానా ఓ పాట పాడారు.

అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ గీతానికి భాస్క‌ర‌భట్ల సాహిత్యం అందించారు. సినిమాలోని ఓ కీల‌క‌మైన సంద‌ర్భంలో ఈ పాట వ‌స్తుంద‌ని, అది ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కోన వెంకట్ క‌థ‌, మాట‌లు అందించ‌డం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఏపీ రాజధానేదో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి !

పాలకుడు సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునేవాడు అయి ఉండకూడదు. సొంత ప్రజల్ని నాశనం చేసి తాను ఒక్కడినే సింహాసనంపై కూర్చుని అందర్నీ పీల్చి పిప్పి చేయాలనే వ్యక్తిత్వం ఉండకూడదు. అలా ఉంటే...

ఎడిటర్స్ కామెంట్ : గుర్తుకొస్తున్నావయ్యా.. శేషన్ !

టీ.ఎన్.శేషన్. ఈ పేరు భారత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్మరించుకుంటూనే ఉన్నారు. గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆయనను మరిపించేలా మాత్రం ఎవరూ రావడం లేదు. ఎన్నికల సంఘం...

నిప్పుల కుంపటిలా తెలంగాణ..

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ...

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

HOT NEWS

css.php
[X] Close
[X] Close