దేవ‌దాస్‌లో కొత్త సీన్లు..?

ఈ గురువారం విడుద‌లైన సినిమా `దేవ‌దాస్‌`. టాక్ కాస్త అటూ ఇటూగా ఉన్నా వ‌సూళ్లు బాగానే ఉన్నాయి. చివరి నిమిషాల్లో మార్పుల వ‌ల్ల‌.. కొన్ని సీన్లు క‌ట్ చేయ‌డం వ‌ల్ల‌… జంపింగ్‌లెక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. దాన్ని స‌వ‌రించ‌డానికి చిత్ర‌బృందం ఇప్పుడు రంగంలోకి దిగిన‌ట్టు తెలుస్తోంది. మ‌రీ ముఖ్యంగా ద్వితీయార్థంలో రెండు కొత్త స‌న్నివేశాలు క‌ల‌పాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. నిడివి ఎక్కువ అవుతోంద‌ని భావించి ట్రిమ్ చేసిన ఆసీన్లు ఇప్పుడు యాడ్ చేస్తే… ఎలా ఉంటుంద‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచ‌న‌. క్యూబ్ సిస్ట‌మ్ వ‌చ్చాక స‌న్నివేశాల్ని మ‌ళ్లీ పేర్చ‌డం అంత తేలిక కాదు. దానికి ఖ‌ర్చు కూడా అవుతుంది. ఇప్పుడు కొత్త‌గా పేర్చిన సన్నివేశాల వ‌ల్ల రిపీటెడ్ ఆడియ‌న్స్ రారు. కేవ‌లం తొలిసారి చూసిన ప్రేక్ష‌కుల‌కు.. సినిమా టెంపో చెడ‌కుండా ఉండ‌డానికే ఈ యాడింగులు. అయితే ఆ స‌న్నివేశాల్ని శ‌నివారం క‌ల్లా జోడిస్తే.. సోమ, లేదంటే మంగ‌ళ‌వారం కొత్త స‌న్నివేశాలున్న `దేవ‌దాస్‌`ని చూడొచ్చు. అయితే అప్ప‌టికీ వ‌సూళ్లు చ‌ల్ల‌బ‌డ‌తాయి. కాబ‌ట్టి ఈ మార్పులు అంత‌గా లాభం చేకూర‌క‌పోవొచ్చు. స‌న్నివేశాలు క‌ల‌పాలా, వ‌ద్దా? అనే విష‌యంలో ఈరోజు సాయింత్రానికల్లా చిత్ర‌బృందం ఓ నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close