జగన్ ఇక కోర్టుకు వారానికి రెండు, మూడు రోజులు హాజరవ్వాలా..?

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సడెన్ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసుల్లో ఆయన ఇక వారానికి రెండు, మూడు రోజుల పాటు విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పుతోంది. దానికి కారణం.. అక్రమాస్తుల కేసుల్లో కొన్నింటిపై ఉన్న స్టేలకు పొడిగింపు రాకపోవడమే. అక్రమాస్తుల కేసుల్లో గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను హైకోర్టు పొడిగిస్తేనే వీటి విచారణను నిలిపివేస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అలాగే ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఓఎంసీ కేసుల్లోనూ కోర్టు విచారణ వేగం కానుంది. జగన్‌ కేసుల్లో పలువురు నిందితులు సీబీఐ కోర్టు విచారణను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే క్రిమినల్‌ కేసులో కింది కోర్టుల్లో విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు ఆరు నెలలు దాటితే.. ఆయా కేసుల్లో తాజాగా స్టే పొడిగిస్తూ ఉత్తర్వులు లేకపోతే ఆ కేసుల విచారణ ప్రక్రియను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతే కాదు.. పొడిగించాలంటే.. దానికి స్పష్టమైన కారణాన్ని హైకోర్టు చెప్పాల్సి ఉంటుంది. జగన్‌, ఎమ్మార్‌, ఓఎంసీ కేసులకు సంబంధించి ఆ 6 నెలల గడువు ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ నిందితులు తాజాగా హైకోర్టు నుంచి స్టే పొడిగింపు ఉత్తర్వులు తెచ్చుకుంటేనే విచారణ నిలిపివేస్తామని.. లేదంటే విచారణను కొనసాగిస్తామని సీబీఐ కోర్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణలోగా స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయకపోతే.. సీబీఐ కోర్టులో విచారణ సాగడయం ఖాయమే.

ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. స్టేలు తెచ్చుకున్నారని వైసీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటారు. అలాంటి స్టేలు ఉన్న కేసులు ఏమైనా ఉంటే… చూపించాలని టీడీపీ నేతలు సవాళ్లు చేస్తూనే ఉంటారు. కానీ వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు “స్టే”లను ఆయుధంగా చేసుకుంటారు. ఇప్పుడా స్టేలు తన అక్రమాస్తుల కేసుల్లో తొలగిపోవడం జగన్ కు చ అదే జగన్ కు చిక్కులు తెచ్చి పెట్టింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న సోము వీర్రాజు..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన సోము వీర్రాజు మొదటగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సాధారణంగా ఆయన...మొదట పవన్ కల్యాణ్‌ని కలుస్తారని భావించారు. అయితే.. పవన్ కల్యాణ్‌తో భేటీ కంటే...

అమరావతి నిధుల లెక్కలన్నీ అడిగిన హైకోర్టు..!

అమరావతిలో గత ప్రభుత్వం పెట్టిన రూ. వేల కోట్ల ప్రజాధనం వృధా పోతుందన్న పిటిషన్‌పై హైకోర్టు విచారమలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతిలో రూ. 52 వేల కోట్ల రూపాయల...

జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి...

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

HOT NEWS

[X] Close
[X] Close