సుభాష్ : హరీష్‌రావు సహనం సునామీకి సూచికా..!?

తెలంగాణలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి హరీష్ రావు వచ్చారు. అక్కడ అందరూ ఆయన వైపు ఓ రకంగా జాలి చూపులు చూశారు. ఆయనపై ఎక్కడ అభిమానం చూపిస్తే.. కేసీఆర్ దృష్టిలో తాము.. ఆయన మనుషులం అయిపోతామో అన్న భయం ఉన్నప్పటికీ.. కొంత బయటపడ్డారు. అయినా హరీష్ రావు తనకేమీ అసంతృప్తి లేదని.. అందరితోనూ కలుపుగోలుగా ఉండే ప్రయత్నం చేశారు. కేటీఆర్‌తోనూ అలాగే ఉన్నారు. మరి నిజంగానే.. హరీష్‌రావు మనసులో ఏమీ లేదా..? వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా…?

కేసీఆర్ రాజకీయానికి అప్‌డేటెడ్ వెర్షన్ హరీష్ రావు..!

హరీష్ రావు రాజకీయ ఓనమాలు నేర్చుకుంది.. కేసీఆర్ దగ్గరే. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ఆయన ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటూ.. ఒక్కో అడుగు ముందుకు వేసిన నేత. కేసీఆర్ ఎలా రాజకీయాలు చేస్తారో కింది స్థాయి నుంచి తెలిసిన నేత. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. ఊహించగలిగిన నేత. అంతే కాదు.. కేసీఆర్ రాజకీయానికి మరింత మెరుగులు పెట్టి… అద్భుతమైన ఫలితాలు సాధించడం.. హరీష్‌కు వెన్నతో పెట్టిన విద్య. అంటే గురువును మించిన శిష్యుడన్నమాట. ఆ విషయం.. తన రాజకీయ అడుగులతోనే ఎప్పుడో బయట ప్రపంచానికి తెలియచేశారు. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం.. ఖమ్మంలో కేసీఆర్ ఆమరణదీక్షకు ముగింపునిస్తే.. ఉస్మానియాలో శవయాత్రలు నిర్వహింప చేసి.. మళ్లీ దీక్ష కొనసాగించేలా చేసింది హరీష్ రావే. ఆ ఘటనే లేకపోతే.. తెలంగాణ ఉద్యమం ఈ స్థాయిలో ఉండేది కాదని.. టీఆర్ఎస్‌లో చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి నేత.. తన రాజకీయ భవిష్యత్‌పై క్లారిటీ లేకుండా ఉంటారా..?. అవకాశమే లేదు.. కానీ… హరీష్‌… అల్లాటప్పా రాజకీయాలు చేసే వ్యక్తి కాదు.. కేసీఆర్‌కు అప్ డేటెడ్ వెర్షన్. అందుకే దానికి తగ్గట్లుగానే రాజకీయాలు చేస్తున్నారు.

హరీష్‌పై అభిమానం పెంచుతున్న విధేయత..!

హరీష్ ఎందుకంత.. విధేయత చూపుతున్నారు…? కేసీఆర్ అవమానిస్తున్నా… చిరునవ్వుతో ఎలా ఉంటున్నారు..? ఇది సగటు టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తున్న సందేహం. కానీ.. హరీష్ .. కేసీఆర్‌ను మించిన రాజకీయ నాయకుడు. అందుకే.. తనదైన రాజీకయ వ్యూహం అవలంభిస్తున్నాయి. కేసీఆర్ ఎంత అవమానించినా బద్దుడిగా ఉంటున్నానని .. రాజకీయ జీవితం ఇచ్చిన గురువు పట్ల.. గౌరవం ప్రదర్శిస్తున్నానన్న సందేశాన్ని పంపుతున్నారు. పదవుల కోసం తాను.. ఏదో చేయాల్సిన అవసరం తనకు లేదని చెబుతున్నారు. ఇదే.. ప్రజల్లో ఆయనపై అభిమానం పెంపొందేలా చేస్తోంది. ఆయనపై సానుభూతి వచ్చేలా చేస్తోంది. హరీష్‌రావుకు కూడా ఇప్పుడు కావాల్సింది అదే. కేసీఆర్‌ తనను ఎంత దూరం పెడితే అంత మంచిదని.. నమ్ముతున్నారు. అదే సమయంలో.. తనను ఎంతలా హ్యూమలేట్ చేస్తున్నారో .. ప్రతీ వివరం బయటకు తెలిసేలా చేసుకుంటున్నారు. ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. పాపం … హరీష్ అనుకునేలా.. పరిస్థితులు తెప్పించుకోవాలనుకుంటున్నారు. అప్పుడే అసలు గేమ్ ప్రారంభమయింది.

హరీష్ ఎప్పుడు రంగంలోకి దిగుతారు..?

రాజకీయాలు చిత్రమైనవి. అంతా పదవుల కోసమే చేస్తున్నారని కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ.. ఇతర బలమైన అంశాలను కారణంగా చూపిస్తూ ఉంటారు. అలా చూపించే ప్రధానమైన కారణాలు ప్రజల కోసం.. రాష్ట్రం కోసం.. పార్టీని కాపాడుకోవడం కోసం. కచ్చితంగా అలాంటి పరిస్థితిని క్రియేట్ చేయాడనికి హరీష్ రావు.. ఇప్పుడు చాలా పకడ్బందీగా.. పయనిస్తున్నారు. ఆ క్రమంలో… తను… పార్టీ కోసం.. కేసీఆర్ కోసం.. నోరు మెదపకుండా ఉంటున్నానని.. తన రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా… వ్యవహారాలు నడుపుతున్నారు. ఇవన్నీ ఆయనకు ప్రజల్లో.. టీఆర్ఎస్ నేతల్లో.. ఆయన వల్ల సాయం పొంది… పైకెదిగిన నేతల్లో ఆరాధనా భావం అంతకంతకూ పెరుగుతుందే కానీ… తగ్గదు. హైకమాండ్‌ దూరం పెట్టాలనుకుంటుంది కాబట్టి.. తాము దగ్గరగా వ్యవహరించలేరు కాబట్టి… దూరంగానే ఉంటారు. సమయం వచ్చినప్పుడు అందరూ.. హరీష్ వెంటే ఉంటారు. ఎందుకంటే.. సహజంగా … రివోల్ట్ అయ్యే సందర్భాల్లో సానుభూతి… పోరాడేవారికే ఉంటుంది. కష్టపడిన వారికే లభిస్తుంది. టీఆర్ఎస్‌లో ఎలాంటి పదవి పొందడానికి అయినా హరీష్ కన్నా.. అర్హుడు ఎవరూ లేరనేది ప్రజాభిప్రాయం కూడా…!

పరిస్థితులు ఎప్పుడు కలిసి వస్తాయి..?

హరీష్ రావు.. పూర్తిగా కేటీఆర్‌కు వదిలేసి రాజకీయ సన్యాసం చేస్తారని అనుకోవడం భ్రమ. కానీ సందర్భం రావాలి..! ఆ సందర్భానికి సమయం కలసి రావాలి..! అవి ఎలాంటివి అంటే.. కచ్చితంగా… ఎన్టీఆర్‌పై.. చంద్రబాబు తిరుగుబాటు చేసేటప్పుడు.. టీడీపీలో… ఏపీలో ఉన్నటు వంటి పరిస్థితులు రావాలి. అప్పట్లో లక్ష్మిపార్వతికి… ఇప్పట్లో కేటీఆర్ కంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ఆమె మాట అనధికార శాసనంలా ఉండేది. కానీ తర్వాతేమయింది…? కచ్చితంగా అలాంటి పరిస్థితి రావాలి. వచ్చినప్పుడు.. హరీష్ రావు కచ్చితంగా.. మరో చంద్రబాబునాయుడు అవుతాడు. అదెప్పుడన్నది కాలమే నిర్ణయించాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close